News


యస్‌ బ్యాంకులో ఉన్నట్టుండి ఎందుకంత చలనం?

Thursday 19th December 2019
Markets_main1576778937.png-30316

యస్‌ బ్యాంకు స్టాక్‌ గురువారం ఇన్వెస్టర్లను అయోమయానికి గురి చేసింది. ఉదయం సెషన్‌లో స్టాక్‌ 4 శాతం నష్టపోయి రూ.45 వరకు పడిపోగా, మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటర్లో ఒక్కసారిగా యాక్టివిటీ పెరిగిపోయింది. అక్కడి నుంచి స్టాక్‌ ఏకంగా 10 శాతానికి పైగా పెరిగింది. రూ.50.90 వరకు వెళ్లి, చివరికి రూ.49.90 వద్ద బీఎస్‌ఈలో క్లోజయింది. దీని వెనుక నిధుల సమీకరణ, ఎఫ్‌అండ్‌వోలో బ్యాన్‌ అంశాలు కారణమై ఉండొచ్చని అనలిస్టులు తెలియజేశారు. 

 

‘‘క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపీ)ని యస్‌ బ్యాంకు త్వరలోనే ప్రకటించనుందనే పుకార్లు వచ్చాయి’’ అని ముంబై బ్రోకరేజీ అనలిస్ట్‌ ఒకరు తెలిపారు. చాలా ముందుగానే బ్యాంకు నిధులు సమీకరించనుందని యస్‌ బ్యాంకు సీఈవో మంగళవారం ప్రకటించడం ఈ వార్తలకు తావిచ్చాయి. ప్రిఫరెన్షియల్‌ విధానంలో వాటా విక్రయ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో, క్యూఐపీ మార్గంలో నిధుల సమీకరణకు అనుమతించాలని యస్‌ బ్యాంకు సెబీని కోరినట్టు సమాచారం. ‘‘యస్‌ బ్యాంకు లాట్‌ సైజు ఇప్పుడు 2,200 షేర్లుగా ఉంది. దీన్ని తదుపరి సిరీస్‌ నుంచి నాలుగింతలు చేయనున్నట్టు చర్చ నడుస్తోంది. అస్థిరతలకు కారణం ఇది అయి ఉండొచ్చు. దీనివల్ల షార్ట్‌ కవరింగ్‌తోపాటు, డెలివరీ ఆధారిత కొనుగోళ్లు జరిగి ఉంటాయి. ఉదాహరణకు ఒక లాట్‌ ఉంటే, అది నాలుగు రెట్లు పెరుగుతుంది. దీంతో పొజిషన్‌ రోలోవర్‌ ఎలా చేసుకోగలరు? ఒక పొజిషన్‌ను షార్ట్‌ చేసి ఉంటే, దాన్ని అలాగే కొనసాగించుకోదలిస్తే అప్పుడు నాలుగింతలు షార్ట్‌ చేయాలి. లేదా పొజిషన్‌ను కవర్‌ చేసుకోవాలి’’అని షేర్‌ఖాన్‌ ఎఫ్‌అండ్‌వో విభాగం డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌ అనూప్‌ చందక్‌ వివరించారు.

 

యస్‌ బ్యాంకు ఎఫ్‌అండ్‌వో లాట్‌సైజు మార్చనున్నట్టు తాను కూడా విన్నానని టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తెలిపారు. నిధుల సమీకరణ విషయంలో అనిశ్చితి కారణంగా పొజిషన్ల సెటిల్‌మెంట్‌, సర్దుబాటే ఆటుపోట్లకు కారణమన్నారు. అలాగే, ఎఫ్‌అండ్‌వో బ్యాన్‌ అవకాశాలు కూడా ఈ అస్థిరతలకు కారణమై ఉంటాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ యస్‌ బ్యాంకు లాంగ్‌, షార్ట్‌ టర్మ్‌ ఇష్యూయర్‌ రేటింగ్స్‌ను తగ్గించడం ఉదయం స్టాక్‌ నష్టపోవడానికి దారితీసింది.



You may be interested

వ్యాపార ని‘‘బంధనాలు’’ తొలగించండి

Friday 20th December 2019

స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం ఉండాలి విలీనాలు, కొనుగోళ్లకు నిబంధనల అవరోధం తొలగించాలి కేంద్ర ఆర్థిక మంత్రికి పారిశ్రామికవేత్తల వినతి న్యూఢిల్లీ: దేశంలో వ్యాపారాలను మరింత సులభంగా నిర్వహించుకునే వాతావరణం కల్పించాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కేంద్రాన్ని కోరారు. 2020-21 బడ్జెట్‌ ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌, సీఐఐ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ కిర్లోస్కర్‌, అసోచామ్‌ ప్రెసిడెంట్‌ బాలకృష్ణ గోయెంకా తదితర

వచ్చే ఐదేళ్లలో ‘టెలికం’ నుంచి ఆదాయం: అగర్వాల్‌

Thursday 19th December 2019

స్టాక్‌ మార్కెట్‌ ఇప్పటికీ టెలికం కంపెనీల పట్ల ఆశావహంగా ఉందని, ఈ రంగం పుంజుకుంటుందని అంచనాలే ఇందుకు కారణమని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ రామ్‌దేవ్‌ అగర్వాల్‌ అన్నారు. టెలికం ఆపరేటర్లు, ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో ఈ రంగం నుంచి డబ్బులు పిండుకోనున్నాయని ఆయన విశ్లేషించారు. ‘‘టెలికం అన్నది గత 13 ఏళ్లుగా ఓ ఉపద్రవం వంటిది. ఈ రంగంలో సేవలు అందించే కంపెనీలు మూడు నుంచి 17కు

Most from this category