News


సూచీల గమనంపై విశ్లేషకుల అభిప్రాయాలు

Friday 1st November 2019
Markets_main1572632867.png-29293

ప్రధాన సూచీలు నూతన గరిష్టాలను సమీపించాయి. సెన్సెక్స్‌ ఇప్పటికే నూతన గరిష్టాలను చేరుకుంది. నిఫ్టీదే తరువాయి. మరి ఈ క్రమంలో తదుపరి సూచీల గమనంపై విశ్లేషకులు, బ్రోకరేజీ సంస్థల అభిప్రాయాలు ఇలా ఉ‍న్నాయి. 

 

నిఫ్టీ 11,850-11,840 శ్రేణిని దిగిపోతే లాభాల స్వీకరణ చోటు చేసుకుంటుంది. దాంతో నిఫ్టీ 11,770-11,720 వరకు వెళ్లొచ్చు. స్వల్ప కాల చార్ట్‌పై ఆర్‌ఎస్‌ఐ అధిక కొనుగోళ్ల జోన్‌కు చేరింది. ఇది స్వల్ప కరెక్షన్‌ను సూచిస్తోంది.

- ఆదిత్య అగర్వాల్‌, యస్‌ సెక్యూరిటీస్‌

 

ట్విన్‌ మూమెంటమ్‌ ఆసిల్లేటర్స్‌ సెల్‌ సంకేతాన్ని స్వల్ప కాలావధి చార్ట్‌లపై ఇచ్చాయి. దీంతో మార్కెట్‌ పెరుగుదల నిలిచిపోతుందని, లేదా రానున్న సెషన్లలో దిద్దుబాటుకు గురవుతుందని అంచనా వేస్తున్నాం.

- మజర్‌ మహమ్మద్‌, చార్ట్‌వ్యూఇండియా డాట్‌ ఇన్‌

 

వీక్లీ స్కేల్‌పై నిఫ్టీ గరిష్టంలో గరిష్టం, కనిష్టంలో కనిష్టం నమోదు చేయడంతో మద్దతు స్థాయిలు క్రమంగా అధిక శ్రేణికి చేరాయి. ఇప్పుడిక 11,820పైనే కొనసాగితే 11,950 దిశగా వెళుతుంది. ఆ తర్వాత 12,000-12,103 వరకు వెళ్లొచ్చు. దిగువ వైపున ప్రధాన మద్దతు స్థాయిలు 11,780, 11,700.

- చందన్‌ తపారియా, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌

 

నిఫ్టీ పట్ల మా బుల్లిష్‌ ధోరణిని కొనసాగిస్తున్నాం. మార్కెట్లు పడినప్పుడల్లా కొనుగోలు చేయవచ్చన్నది మా సూచన. ఇ‍ప్పటికే చెప్పుకోతగ్గ మేర పెరిగినందున స్టాక్స్‌ ఎంపికలో ఎంతో జాగ్రత్త వహించాలి. దాదాపు అన్ని రంగాలు ర్యాలీకి తోడ్పడుతున్నాయి. అయితే, బ్యాంకింగ్‌, మెటల్‌ సమీప భవిష్యత్తులో ఇతర రంగాలతో పోలిస్తే మెరుగ్గా ఉండొచ్చు.

- అజిత్‌ మిశ్రా, రెలిగేర్‌ బ్రోకింగ్‌

 

బుల్స్‌ పట్టు మార్కెట్‌పై కొనసాగుతోంది. మార్కెట్లో ప్రాతినిధ్యం విస్తృతంగా ఉంది. మా బుల్లిష్‌ ధోరణిని కొనసాగిస్తున్నాం. నిఫ్టీ 12,100ను తిరిగి పరీక్షిస్తుందని అంచనా. త్వరలోనే నూతన గరిష్టాన్ని తాకనుంది. అయితే, గతంలో నిఫ్టీ 12,100ను తాకిన సమయంతో పోలిస్తే ఇప్పుడు మార్కెట్లు ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి.

- అమిత్‌షా, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌
 



You may be interested

జీఎస్‌టీ వసూళ్లు పేలవమే..!

Saturday 2nd November 2019

అక్టోబర్‌లో రూ.95,380 ‍కోట్లు న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు అక్టోబర్‌లో 5.29 శాతం తగ్గాయి. రూ.95,380 కోట్లుగా నమోదయాయ్యియి. 2018 ఇదే నెల్లో ఈ వసూళ్లు రూ.1,00,710 కోట్లు. శుక్రవారం ప్రభుత్వం ఈ గణాకాలను విడుదల చేసింది. జీఎస్‌టీ వసూళ్లు లక్ష కోట్లకన్నా తగ్గడం ఇది వరుసగా మూడవనెల. నిజానికి  పండుగల సీజన్‌ కావడంతో అక్టోబర్‌లో అయినా రూ. లక్ష కోట్లపైబడి జీఎస్‌టీ వసూళ్లు జరుగుతాయన్న అంచనా ఉంది.

ఈ స్టాక్స్‌లో ప్రమోటర్లు, ఇనిస్టిట్యూషన్ల వాటా పైపైకి 

Friday 1st November 2019

ఓ కంపెనీలో ప్రమోటర్లు వాటాలు పెంచుకున్నారంటే దాని వెనుక ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. ఎందుకంటే వీరు కంపెనీకి సంబంధించిన వ్యక్తులు. కానీ, ఏక కాలంలో ప్రమోటర్లతోపాటు, ఇనిస్టిట్యూషన్లు, విదేశీ ఇన్వెస్టర్లు ఒక కంపెనీలో వాటాలను పెంచుకున్నారంటే, సమీప కాలంలో ఆ కంపెనీకి సానుకూల పరిస్థితులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇలా ప్రమోటర్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ అన్నీ కూడా 12 కంపెనీల్లో

Most from this category