News


స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనం ఇందుకే..!

Friday 13th March 2020
Markets_main1584088683.png-32462

నేడు మార్కెట్లో అమ్మకాలు సునామిలా వెల్లువెత్తాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ నిఫ్టీలు 10శాతం పతనం కావడంతో లోయర్‌ సర్క్యూట్‌ విధించారు. దీంతో 45నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. ఈ తర్వాత తిరిగి ట్రేడింగ్‌ను కొనసాగించారు. సూచీలు నష్టాలను పూడ్చుకుంటున్నప్పటికీ.. మార్కెట్లో అమ్మకాల భయాలు ఇంకా మిగిలే ఉన్నాయి. 

గత కొన్ని రోజులుగా, కోవిడ్‌ -19 అంటువ్యాధికి సంబంధించిన ఆందోళనలు, ఆర్థిక మందగమన భయం, ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్‌ ధర అనూహ్యంగా పతనం కావడం తదితర కారణాలతో ప్రపంచ మార్కెట్లతో పాటు భారత మార్కెట్‌ నష్టాల దిశలో కదులుతోందని సెబీ ఒక ప్రకటనలో తెలిపింది. అసలు భారత మార్కెట్‌ పతనానికి గల ప్రధాన కారణాలను ఇప్పుడు చూద్దాం...


భయపెట్టిన కరోనా వ్యాధి తొలి మరణం:
కరోనా వైరస్ కారణంగా భారత్‌లో తొలి మరణం నమోదైంది. సౌదీ అరేబియా వెళ్లి వచ్చిన 76 ఏళ్ల కర్నాటకవాసి మరణించారు. హైదరాబాద్‌లో చికిత్స పొందిన అనంతరం సొంత ఊరు కర్నాటకలోని కలబురగికి వచ్చిన ఆయన మరణించారు. ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణైంది. కర్నాటక ఆరోగ్య మంత్రి బి.శ్రీరాములు ''కలబుర్గికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు మరణించారు. ఆయనకు కోవిడ్-19 ఉన్నట్లు నిర్ధరణైంద''ని ట్వీట్ చేశారు. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఈ మేరకు నిర్ధారించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 1.26లక్షల మందికి కరోనా వ్యాధి సోకిందని, సుమారు 4,613 మంది మృత్యువాత పడినట్లు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనేజేషన్‌ తెలిపింది. డబ్ల్యూహెచ్‌ఓ కొత్త కరోనా వైరస్ వ్యాప్తిని ఒక అంటుగావ్యాధిగా ప్రకటించడంతో ఆయాదేశాల్లో ఉత్పత్తి నిలిచిపోయి మాంద్యం దిశగా ఆర్థికవ్యవస్థ కదులుతోందనే ఆందోళనలు నెలకొన్నాయి.

మాంద్యం దిశగా ఆర్థిక వ్యవస్థ:
కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలతో ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. ఆయాదేశాలు ఎగుమతులు, దిగుమతులను నిలిపివేయడంతో పాటు ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించాయి. అసలే స్తబ్దుత సాగుతున్న ఆర్థిక వ్యవస్థ ఈ పరిణామంతో మరింత కుదేలవచ్చనే ఆందోళనలు మరింత తీవ్రతరం అయ్యాయి. ఇప్పటికే ఈ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

బీమా, ఆతిథ్యం, ప్రయాణం వంటి రంగాలలో మందగమనం కారణంగా గత ఏడాది ఇదే నెలతో పోల్చితే ఈ ఫిబ్రవరిలో ఉద్యోగ నియమాకాలు ఫ్లాట్‌గా నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. కరోనా భయాలతో ప్రయాణికుల రద్దు చేసుకునే శాతం అనూహ్యంగా పెరగినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తెలిపింది. ప్రయాణాల రద్దుతో సంబంధిత రంగాలకు వేల కోట్లలో నష్టం చేకూరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్‌ నుంచి వజ్రాలు, బంగారం ఆభరణాల ఎగుమతులు 20 శాతం తగ్గాయి. 

కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 2కోట్ల ట్రిలియన్‌ డాలర్ల మేరకు నష్టం వాటిల్లవచ్చని యూనిటెడ్‌ ట్రేడ్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్నీ చెబుతోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి ఉటుందని, ప్రపంచ వార్షిక వృద్ధి 2.5శాతం కంటే తక్కువగా నమోదు అవుతోందని హెచ్చరిస్తోంది.

ఇంకా వీడని చమురు భయాలు: 
ఈక్విటీ మార్కెట్లను ఇంకా చమురు భయాలు వీడలేదు. క్రూడాయిల్‌ ధరలు వరుసగా మూడో రోజూ పతనమయ్యాయి. బ్రెండ్‌క్రూడాయిల్‌ ధరలు 1991 స్థాయికి పడిపోయాయి. ఈ వారంలో బ్రెండ్‌ క్రూడ్‌ ధర 28శాతానిపైగా పతమైనంది. వాస్తవానికి చమురు ధరల పతనం భారత ఆర్థిక వ్యవస్థకు కలిసొస్తుంది. అయితే ఇటీవల పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. భారత్‌ లాంటి వర్ధమాన దేశాలకు సంబంధించి ముడి చమురు దిగిరావడం తక్కువ వృద్ధి, ఈల్డ్‌ మార్కెట్లో అధిక ఒత్తిడి అన్న చందంగా మారాయి. 

ప్రపంచ మార్కెట్లలో భారీ పతనం: 
 కరోనా వైరస్‌ భయాలతో అటు అమెరికాతో పాటు ఆసియా, ఐరోపా మార్కెట్ల భారీ నష్టాలను చవిచూశాయి. గడచిన కేవలం నెలరోజుల్లో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు(ఒక్క చైనా తప్ప) ఏకంగా 30శాతం నష్టాలను చవిచూశాయి. ఈ అంశం మన మార్కెట్‌కు ప్రతికూలంగా మారింది. 

ఆగని ఎఫ్‌ఐఐల పెట్టుబడుల మళ్లింపు:
భారత ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల మళ్లింపు ఆగడం లేదు. ఎఫ్‌ఐఐలు ఈ మార్చిలోనే మన మార్కెట్‌ నుంచి రూ.24వేల కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే మార్కెట్ల భారీ పతనాన్ని దేశీయ స్వదేశీ ఇన్వెస్టర్లు కొనుగోలుకు అవకాశంగా మలుచుకుంటున్నారు. ఇదే మార్చిలో ఇప్పటికి వరకు రూ.3198 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు జరిపినట్లు తెలుస్తోంది. You may be interested

ఎయిర్‌ ఇండియా విక్రయానికి గడువు పొడిగింపు

Friday 13th March 2020

ఎయిర్‌ ఇండియా విక్రయాన్ని ప్రభుత్వం మరో నెలరోజులు పాటు పొడిగించింది. ఎయిర్‌ ఇండియాలో 100 శాతం వాటాను విక్రయించేందుకు బిడ్స్‌ను ఏప్రిల్‌ 30 వరకు స్వీకరించనున్నట్లు హోమంత్రి అమిత్‌ షా తో కూడిన మంత్రిత్వ ప్యానల్‌ తెలిపింది. కోవిడ్‌-19తో పరిస్థితులు అనుకూలంగా లేనందున బిడ్స్‌ సమర్పణకు గడువు పొడిగించాలని ఆసక్తిగల కొనుగోలు దారులు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్యానెల్‌ వెల్లడించింది. కాగా జనవరిలో ఎయిర్‌ ఇండియాలో 100 శాతం

331 బిలియన్‌ డాలర్లు పోగొట్టుకున్న ప్రపంచ కుబేరులు

Friday 13th March 2020

కోవిడ్‌-19 ధాటికి ప్రపంచంలోని కుబేరుల సంపదంతా ఆవిరైపోతోంది. గురువారం ఒక్కరోజే ప్రపంచలోని 500 మంది సంపన్నులు 331 బిలియన్‌ డాలర్లను సంపదను నష్టపోయారు. గడిచిన ఎనిమేదళ్లలో ఒక్కరోజులోనే ఇంత పెద్ద మొత్తంలో సంపదను కోల్పోవడం ఇదే మొదటి సారని బ్లూంబర్గ్‌ బిలీయనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 500 మంది సంపన్నుల సంపదలో మొత్తం 950 బిలియన్‌ డాలర్లు నష్టపోయారు. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా మార్కెట్లు దెబ్బతినడంతో

Most from this category