News


200 డీఎంఏ కూడా కాపాడలేదు.. తర్వాతేంటి?

Wednesday 31st July 2019
Markets_main1564559349.png-27444

నిఫ్టీ పయనం ఎటు...
ఈ నెల 13న గత ఫిబ్రవరి తర్వాత తొలిసారి నిఫ్టీ తన 200 డైలీ మూవింగ్‌ యావరేజ్‌(డీఎంఏ) స్థాయి దిగువకు వచ్చింది. ఫిబ్రవరి 12న నిఫ్టీ 200 రోజుల డీఎంఏ మద్దతు కోల్పోయి 10585 పాయింట్ల కనిష్ఠాన్ని తాకి బౌన్స్‌ బ్యాక్‌ అయింది. సాధారణంగా 200 రోజుల డీఎంఏను బలమైన మద్దతు స్థాయిగా పరిగణిస్తారు. ఈ స్థాయికి పైన ఉన్నంత వరకు బలంగా ఉన్నట్లు, దిగువకు వస్తే బలహీనపడినట్లు విశ్లేషిస్తుంటారు. అయితే గతాన్ని పరిశీలిస్తే ఈ స్థాయి దగ్గరకు వచ్చినప్పుడల్లా బలమైన బౌన్స్‌బ్యాక్స్‌ జరిగినట్లు కనిపిస్తుంటుంది. 200 రోజుల డీఎంఏ స్థాయి వద్దకు చేరాక చాలాసార్లు అటు స్టాక్స్‌ కానీ, ఇటు సూచీలు కానీ రెండు మూడు సెషన్లలో రికవరీ చెందినట్లు గమనించవచ్చని, ఇందుకు బలమైన పాజిటివ్‌ సెంటిమెంట్‌ ఉండాలని చార​‍్టవ్యూ ఇండియా వ్యూహకర్త మజార్‌ మహ్మద్‌ చెప్పారు. 2016 నుంచి ఈ ధోరణి చాలాసార్లు గమనించామని, నిఫ్టీ ఈ స్థాయి దిగువకు వచ్చినప్పుడల్లా స్వల్పకాలంలోనే రికవరీ చెందిందని గుర్తు చేశారు. ఈ దఫా 12100 పాయింట్ల నుంచి నిఫ్టీ చాలా సార్లు ప్రయత్నించి పైకి వెళ్లలేకపోవడంతో పతనం బలంగా వచ్చిందని చెప్పారు. అందుకే నిఫ్టీ నెల మొత్తం పతనాభిముఖంగానే ఉందని ఆయన తెలిపారు.


బడ్జెట్‌ అనంతరం ఎఫ్‌ఐఐలు తెగబడి అమ్మకాలు జరుపుతున్నాయంటున్న నిపుణులు, అందువల్లే నిఫ్టీ తన 200 డీఎంఏ దిగువకు వచ్చిందని వివరిస్తున్నారు. అయితే 11000 పాయింట్ల వద్ద పుల్‌బ్యాక్‌ తప్పక వస్తుందని ఆయన అంచనా వేశారు. స్వల్పకాల ఇన్వెస్టర్లు ఇలాంటి పుల్‌బ్యాక్స్‌ను ఎగ్జిట్‌కు ఉపయోగించుకోవాలని సూచించారు. ఇన్వెస్టర్లలో నెగిటివ్‌ సెంటిమెంట్‌ ఎంత బలంగా ఉందంటే కీలక టెక్నికల్స్‌ కూడా బద్దలైపోతున్నాయని కోటక్‌ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ చెప్పారు. ఈ నెల 31న ఫెడ్‌ రేట్ల తగ్గింపు నిర్ణయం మార్కెట్‌కు కీలకం కానుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్‌ ఆకర్షణీయంగా కనిపిస్తోందని చెప్పారు. నిఫ్టీ 11000 పాయింట్లను కూడా కాపాడుకోలేకపోతే 10860 పాయింట్ల వద్ద మరో బలమైన మద్దతు ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం వీఐఎక్స్‌ 13.6 వద్ద ఉంది. వీఐఎక్స్‌ మరింత పెరిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆప్షన్‌ డేటా చూస్తే 11000, 11200 పాయింట్ల వద్ద పుట్స్‌, 11300, 11500 వద్ద కాల్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్తగా పుట్‌రైటింగ్‌ 10800 పాయింట్ల వద్ద, కాల్‌ రైటింగ్‌ 11300 పాయింట్ల వద్ద ఉంది. అందువల్ల స్వల్పకాలానికి 10800- 11300 పాయింట్ల మధ్య నిఫ్టీ కదలికలుండవచ్చని అంచనా. బ్యాంకు నిఫ్టీ చాలా బలహీనంగా మారింది. 29000 పాయింట్ల దిగువన ఉన్నంత వరకు ఈ బలహీనత కొనసాగుతుందని, క్రమంగా 28550,  28350 పాయింట్ల వరకు పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైస్థాయిలో 20250, 29500 పాయింట్లు నిరోధాలుగా వ్యవహరిస్తాయి. You may be interested

సిద్ధార్థ ఆత్మహత్యకు రెండు కారణాలు?

Wednesday 31st July 2019

కాఫీ కింగ్‌ వీజీ సిద్ధార్థ ఆత్మహత్య వెనుక రెండు బలమైన కారణాలున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గత 12 నెలలుగా తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సిద్ధార్థకు, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం ఫలితంగా మార్కెట్లో లిక్విడిటీ కొరతతో అదనపు రుణాలు సమీకరించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని వారు తెలిపారు. అలాగే స్వల్పకాలిక రుణాల్ని తీర్చేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం తన రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్ అమ్మకంలో సిద్ధార్థ విఫలమైనట్లు ఆయన సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి.

15నెలల కనిష్టానికి టెక్‌ మహీంద్రా

Wednesday 31st July 2019

ఐటీ కంపెనీ టెక్‌ మహీంద్రా షేర్లు బుధవారం 15నెలల కనిష్టానికి పతనమయ్యాయి. బ్రోకరేజ్‌ సంస్థలు షేరు కొనుగోలు ధరను తగ్గించడం ఇందుకు కారణమైంది. క్యూ1 ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బ్రోకరేజ్‌ సంస్థలు షేరు కొనుగోలు ధరను తగ్గించాయి. నేడు బీఎస్‌ఈలో కంపెనీ రూ.628.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి షేరు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో షేరు ఒక దశంలో 5శాతానికి పైగా నష్టపోయి రూ. 607.90ల

Most from this category