News


‘‘ముహూరత్‌ ట్రేడింగ్‌’’ గురించి మీకు తెలుసా..!?

Saturday 26th October 2019
Markets_main1572073309.png-29163

‘‘ముహూరత్‌ ట్రేడింగ్‌’’... దలాల్‌ స్ట్రీల్‌ వర్గాలకు పరిచయం అవసరం లేని పదం. అయితే కొత్తగా స్టాక్‌ మార్కెట్‌ను అనుసరించే వారు,  సాధారణ పాఠకులు మాత్రం ఈ ముహూరత్‌ ట్రేడింగ్‌ గురించి కాస్త తెలుసుకోవాల్సిందే. రేపు దీపావళి సందర్భరంగా ప్రత్యేకమైన ముహురత్‌ ట్రేడింగ్‌ జరగనుంది. అసలు మూహరత్‌ ట్రేడింగ్‌ అంటే ఏమిటి, ఎందుకు, ఎ‍ప్పుడు జరుగుతుందనే అనే కీలకాంశాలు ఇప్పుడు తెలుసుకుందాం....
మూహరత్‌ ట్రేడింగ్‌ అంటే ఏమిటి?
ప్రతి ఏడాది దీపావళి పండుగ పర్వదినాన ఎక్చ్సేంజీలు ప్రత్యేకంగా ట్రేడింగ్‌ సెషన్‌ నిర్వహిస్తాయి. ఈ ట్రేడింగ్‌ను ముహురత్‌ ట్రేడింగ్‌ అంటారు. కేవలం గంటసేపు మాత్రమే ట్రేడింగ్‌ జరుగుతుంది. ఈ సమయంలో ఒక్క షేరునైనా కొనడం ఇన్వెస్టర్లు శుభప్రదంగా భావిస్తారు. మనదేశంలో వ్యాపారం, ట్రేడింగ్‌ రంగంలో ఆధిపత్యం కనబరిచే మార్వాడీలు, గుజరాతీలు ఈ ముహురత్‌ ట్రేడింగ్‌ సందర్భంగా ఖాతా పుస్తకాలను, నగదు పెట్టెలను పూజిస్తారు. 

ట్రేడింగ్‌ ఎప్పుడు :-
దీపావళి పండుగ సందర్భంగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో సాధారణ ట్రేడింగ్‌కు బదులుగా ముహూరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహిస్తారు. ట్రేడింగ్‌ రాత్రి 6గంటలకు ఆరంభమై, గం.7.15వరకు ట్రేడ్‌ జరుగుతుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 27(ఆదివారం) జరగుతుంది.  
షెడ్యూల్‌ ఎలా ఉంటుంది:-
బ్యాక్‌ డీల్‌ సెషన్‌:- సాయంత్రం 5:44 నుంచి 6 గంటల వరకు
ప్రీ-ఓపెనింగ్‌:- సాయంత్రం 6:00 నుంచి 6:08వరకు
సాధారణ ట్రేడింగ్‌:- సాయంత్రం 6:15 నుంచి 7:15వరకు
ముగింపు సెషన్‌:- సాయంత్రం 7:20న నుంచి 7:30 

చరిత్రేం చెబుతుంది ..?
ఆసియాలోనే అత్యంత ప్రాచీన ఎక్చ్సేంజీగా  బీఎస్‌ఈ పేరుపొందింది. మూరత్‌ ట్రేడింగ్‌లు బీఎస్‌ఈ 1957లో, ఎన్‌ఎస్‌ఈ 1992లో ప్రారంభయ్యాయి. దాదాపు 60 ఏళ్ల నాటి నుంచి ఈ మూరత్‌ ట్రేడింగ్‌ ఆచారం కొనసాగుతూ వస్తుంది. ఈ శుభదినాన చిన్న పరిమాణంలో షేర్లను కొనుగోళ్లు చేయడంవల్ల సంవత్సరమంతా సంపద, శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీదేవీ ఆశీర్వాదం లభిస్తుందని ఇన్వెస్టర్లు నమ్ముతారు. దలాల్ స్ట్రీట్‌లోని కొందరు ఇన్వెస్టర్లు ఇప్పటికీ ఈ రోజు కొనుగోలు చేసిన షేర్లను వారస్వతంగా వద్దే అట్టిపెట్టుకుంటారు. తద్వారా వాటిని తరువాతి తరానికి అందజేస్తారు. 
ముహూరత్‌ ట్రేడింగ్‌లో సూచీల కదలికలు:- 
చారిత్రాత్మకంగా ఇప్పటికి వరకు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌లో మార్కెట్ మూమెంట్‌ పాజిటివ్‌గా ఉంది. అయితే ట్రేడింగ్ వాల్యూమ్‌లు సాధారణంగా తక్కువగా ఉంటాయి. స్వల్ప వ్యవధిలో జరిగే ఈ సెషన్‌లో సాక్ట్‌ల కదలికల మూమెంట్‌ కూడా తక్కువగా ఉంటాయి. గత 14 ముహూరత్‌ ట్రేడింగ్‌ సెషన్స్‌లో 11 సెషన్స్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ లాభంతో ముగిసింది. గతేడాది మూహురత్‌ ట్రేడింగ్‌ సెషన్‌లో సెన్సెక్స్‌ 0.7శాతం లాభపడి 35,237 వద్ద, నిఫ్టీ 68.40 పాయింట్లు పెరిగి 10,598.40 వద్ద స్థిరపడింది. అయితే 2008 అక్టోబర్‌ 28న జరిగిన ముహూరత్‌ ట్రేడింగ్‌ నాడు సెన్సెక్స్‌ మార్కెట్‌ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ 5.86 శాతం లాభపడి నిఫ్టీ 9,008 వద్ద ముగిసింది. ఇక మిగిలిన అన్ని ముహూరత్‌ ట్రేడింగ్‌ల సందర్భంగా సూచీలు పరిమితి శ్రేణిలోనే ట్రేడ్‌ అయ్యాయి. 
ఈ ఏడాది 2076 సంవత్‌ అంచనాలు:-
ఈ ఏడాది సంవత్‌ 2076లో సూచీలు పాజిటివ్‌గా రాణిస్తాయని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే 2077 నాటికి కల్లా నిఫ్టీ 14,000 మార్కును, సెన్సెక్స్‌ 46,000 స్థాయిని అందుకోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. You may be interested

టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 13 శాతం జంప్‌

Saturday 26th October 2019

మార్కెట్‌ అంచనాల్ని మించి ఫలితాల్ని వెల్లడించడంతో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో టాటా మోటార్స్‌ అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌) 13 శాతం పెరిగి 10.49 డాలర్ల వద్ద ముగిసింది. ఈ కంపెనీకి సంబంధించిన ఒక్కో ఏడీఆర్‌...ఇక్కడి 5 షేర్లకు సమానం. టాటా మోటార్స్‌ తాజా ఏడీఆర్‌ ధర ప్రకారం ఆదివారం దీపావళి సందర్భంగా జరగబోయే మూరత్‌ ట్రేడింగ్‌లో ఈ షేరు రూ.148 సమీపంలో ప్రారంభమయ్యే ఛాన్స్‌ వుంది. శుక్రవారం

ఆ కంపెనీల షేర్లపై డేగకన్ను!

Saturday 26th October 2019

ప్రమోటర్లు భారీగా తమవాటా షేర్లను తనఖా పెట్టిన కంపెనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్టాక్‌ఎక్చేంజ్‌లు నిర్ణయించాయి. ఇలాంటి కంపెనీల షేర్లలో చోటుచేసుకుంటున్న తీవ్ర ఒడిదుడుకులకు అడ్డుకట్ట వేసేందుకు ఎక్చేంజ్‌లు ఈ నిర్ణయానికి వచ్చాయి. ఇందులో భాగంగా వెయ్యికోట్ల రూపాయల మార్కెట్‌ క్యాప్‌ ఉండి, మొత్తం ఈక్విటీ క్యాపిటల్‌లో 25 శాతానికి మించి ప్రమోటర్లు తనఖా పెట్టిఉన్న కంపెనీల స్టాకులపై 35 శాతం కనిష్ఠ మార్జిన్‌ నిబంధన విధించాలని నిర్ణయించాయి. అదేవిధంగా

Most from this category