News


ఎన్‌బీఎఫ్‌సీ స్టాకులను ఏం చేద్దాం!

Friday 14th June 2019
Markets_main1560509616.png-26304

గతేడాదిలో ఆరంభమైన ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం బాగా ముదిరి పలు సమస్యలకు కేంద్రబిందువుగా మారింది. లిక్విడిటీ కొరత, డిఫాల్టులు, రేటింగ్‌ డౌన్‌గ్రేడ్స్‌, మోసాలు.. ఇలా పలు కారణాలతో పలు ఎన్‌బీఎఫ్‌సీల విలువ భారీగా క్షీణించిపోయింది. ఉదాహరణకు ఏడాదిలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు విలువ 80 శాతం, ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 40 శాతం మేర పతనమయ్యాయి. దీంతో వీటి మార్కెట్‌ క్యాప్‌ విపరీతంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో పలు ఎంఎఫ్‌లు ఎన్‌బీఎఫ్‌సీ స్టాకులను పోర్టుఫోలియోల నుంచి వదిలించుకుంటున్నాయి. గతేడాది మార్చిలో దాదాపు 57 ఎంఎఫ్‌ల పోర్టుఫోలియోల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు ఉండగా ప్రస్తుతం కేవలం ఐదారు ఎంఎఫ్‌ల వద్దే ఈషేరు ఉంది. రెప్కో, ఐబీ హౌసింగ్‌ సైతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. కానీ మరోవైపు కెన్‌ఫిన్‌ హోమ్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ లాంటి బలమైన మాతృసంస్థ ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలు మాత్రం బలంగా కొనసాగుతున్నాయి, ఇలాంటి వాటిలో ఎంఎఫ్‌లు పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌, జీ గ్రూప్‌, ఆర్‌ అడాగ్‌ గ్రూప్‌ తదితర పలు గ్రూప్‌లకు చెందిన అనేక ఎన్‌బీఎఫ్‌సీలు రేటింగ్‌ డౌన్‌గ్రేడ్స్‌ ఎదుర్కొన్నాయి. ఇవన్నీ కలిసి వీటి షేర్లపై ఇన్వెస్టర్లలో భయాన్ని పెంచాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభాన్ని నివారించేందుకు ఆర్బీఐ, ప్రభుత్వం బలమైన చర్యలు ప్రకటించకుంటే ఈ స్టాకులు ఇప్పట్లో కోలుకోలేవని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బలమైన బ్యాకప్‌ లేని, చిన్న ఎన్‌బీఎఫ్‌సీల జోలికి పోవద్దని సలహా ఇస్తున్నారు. అయితే బడా మాతృసంస్థలున్న ఎన్‌బీఎఫ్‌సీలను మాత్రం ఎంచుకోవచ్చని, వీటిపై ప్రస్తుత సంక్షోభ ప్రభావం పెద్దగా ఉండదని సూచిస్తున్నారు. వీలుంటే ఎన్‌బీఎఫ్‌సీల కన్నా ప్రైవేట్‌బ్యాంకుల షేర్లు కొనుగోలు చేయడం మంచిదని వివరించారు. కాదనుకుంటే కొంతమేర ఈ రంగంలో సమస్యలు చక్కబడేవరకు వేచిచూడాలని తెలిపారు. ఇప్పటికే ఈ షేర్లున్న ఇన్వెస్టర్లు ప్రస్తుత ధరల వద్ద అమ్ముకోవడం అంత మంచిది కాదని, ఇప్పటికే బాగా దిగజారిన ఈ షేర్లను కొంత కోలుకున్నాక విక్రయించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. You may be interested

నాలుగు నెలల్లోనే మల్టీబ్యాగర్‌ రిటర్నులు

Saturday 15th June 2019

నాలుగు నెలలు అంటే చాలా తక్కువ కాలవ్యవధి. మరి ఇంత తక్కువ కాల వ్యవధిలో మల్టీ‍బ్యాగర్‌ (ఒక రెట్టు అంతకంటే ఎక్కువ) రిటర్నులు ఇవ్వడం అంటే అంత చిన్న విషయమేమీ కాదు. కానీ, 19 స్టాక్‌లు ఈ ఏడాది ఎన్నికల సీజన్‌లో మల్టీబ్యాగర్‌ రిటర్నులు ఇచ్చి వాటాదారుల పంట పండించాయి. ఎందుకంటే ఇదే కాలంలో బ్రోడర్‌ మార్కెట్‌ బలహీనంగా ఉండడమే కాదు, పెరిగిన స్టా‍క్స్‌తో పోలిస్తే నష్టపోయిన స్టాక్సే ఎక్కువ.    ఈ

11900ల దిగువన ముగిసిన నిఫ్టీ

Friday 14th June 2019

మార్కెట్‌ ఈ వారం చివరిరోజైన శుక్రవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 289 పాయింట్ల నష్టంతో 39,452.07 వద్ద, నిఫ్టీ 90.75 పాయింట్లను నష్టపోయి 11,823.30 వద్ద ముగిసింది. శుక్రవారం అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌, అటో, ఎఫ్‌ఎంజీసీ, ఫార్మా, ఆర్థిక రంగ షేర్లలో విక్రయాలు ఎక్కువగా జరిగాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలకు నేడు టోకు ద్రవ్యోల్బణ గణాంకాల

Most from this category