News


టాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ జూన్‌లో ఏం కొన్నాయి...?

Sunday 14th July 2019
Markets_main1563127072.png-27051

ప్రముఖ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ప్రతీ నెలా వివిధ పథకాల పరిధిలో తమ పోర్ట్‌ఫోలియో వివరాలను ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. సెబీ నిబంధనలు  ఈ మేరకు నిర్దేశిస్తున్నాయి. ఆయా గణాంకాల ‍ప్రకారం జూన్‌ నెలలో టాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (ఏఎంసీలు) కొనుగోలు చేసిన, విక్రయించిన స్టాక్స్‌ వివరాలు ఇవి...

 

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
ఈ సంస్థ నిర్వహణలో 22 బిలియన్‌ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు ఉన్నాయి. ఫైనాన్షియల్‌ రంగ స్టాక్స్‌లో 35 శాతం, ఇండస్ట్రియల్‌ కంపెనీల్లో 14 శాతం ఇన్వెస్ట్‌ చేసి ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ జూన్‌లో నూతనంగా ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌లో పెట్టుబడులు పెట్టింది. నీలా స్పేసెస్‌, ఐఎఫ్‌సీఐ, జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌లో షేర్లను పూర్తిగా అమ్మేసింది. అలాగే, ఎన్‌ఎల్‌సీ ఇండియా, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌లో వాటాలు పెంచుకుంది. అదే సమయంలో గెయిల్‌ ఇండియా, యస్‌ బ్యాంకు, ఎన్‌హెచ్‌పీసీలో వాటాలు తగ్గించుకుంది.  

 

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ
దేశంలో నిర్వహణలోని ఆస్తుల పరంగా రెండో స్థానంలో ఉన్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ, జూన్‌ నెలలో కొత్తగా ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌, అరవింద్‌ ఫ్యాషన్స్‌లో మొదటి సారి పెట్టుబడులు పెట్టింది. అలాగే, కార్డినల్‌ హెల్త్‌ ఐఎన్‌సీ, అమెరిసోర్స్‌బెర్జెన్‌కార్ప్‌, మోండెలెజ్‌ ఇంటర్నేషనల్‌లో వాటాలను పూర్తిగా అమ్మేసింది. ఇక, ఎన్‌ఎల్‌సీ ఇండియా, సౌత్‌ ఇండియన్‌ బ్యాంకులో అదనపు పెట్టుబడులు పెట్టగా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్‌టీపీసీ, సుజ్లాన్‌ ఎనర్జీల్లో వాటాలను కొంత మేర అమ్మేసింది. 

 

ఎస్‌బీఐ ఏఎంసీ
ఈ సంస్థ జూన్‌లో ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌, కోపరేటివ్‌ రోబోబ్యాంకు, టోరెంట్‌ పవర్‌లో మొదటి సారి పెట్టుబడులు పెట్టింది. అలాగే, ఎన్‌ఎల్‌సీ ఇండియా, సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ నుంచి పూర్తిగా వైదొలిగింది. అలాగే, వొడాఫోన్‌ ఐడియా, ఇమామీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో అదనపు వాటాలను కొనుగోలు చేయగా, చోలమండలం ఇన్వెస్ట్‌మెంట్‌, ఐటీసీ, యూపీఎల్‌లో వాటాలు తగ్గించుకుంది. 



You may be interested

గ్యాప్‌అప్‌...నిఫ్టీ 11,600పైన ప్రారంభం

Monday 15th July 2019

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రికార్డు 5 శాతం లాభంతో ప్రారంభంకావడంతో సోమవారం భారత్‌ సూచీలు భారీ గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 278 పాయింట్ల లాభంతో 39,015 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 62 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,615 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత ఇన్ఫోసిస్‌ వెల్లడించిన ఫలితాలతో పాటు ఆదాయం గైడెన్స్‌ పెంచిన ప్రభావంతో ఆ షేరు తాజాగా 5 శాతం లాభంతో రూ.763

మార్కెట్లు ఎటు...? ఇన్వెస్టర్ల మార్గం ఎటు?

Sunday 14th July 2019

అంతర్జాతీయంగా బలహీన వాతావరణం నడుమ కేంద్ర బడ్జెట్‌ ఆశించిన విధంగా లేకపోవడం, చైనా గణాంకాలు బలహీనంగా ఉండడం వంటి అంశాలు ఇన్వెస్టర్లను అమ్మకాలకు పురికొల్పడంతో, గత వారం దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బేర్స్‌ దెబ్బకు బుల్స్‌ వణికిపోయాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ వరుసగా రెండో వారంలో 1.97 శాతం, 2.18 శాతం చొప్పున నష్టపోయాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ల గమనం ఏ విధంగా ఉండనున్నది, ఇన్వెస్టర్లు అనుసరించతగిన విధానంపై మార్కెట్‌ నిపుణుల

Most from this category