News


నవంబర్‌లో ఫండ్స్‌ షేర్ల షాపింగ్‌

Friday 13th December 2019
Markets_main1576259764.png-30216

నవంబర్‌లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి నికర పెట్టుబడుల రాక అంతక్రితం నెలతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. యాంఫి గణాంకాల ప్రకారం నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.1,311 కోట్లుగా ఉన్నాయి. అక్టోబర్‌లో ఇవి రూ.6,026 కోట్లుగా ఉన్నాయి. ‍కాకపోతే సిప్‌ రూపంలో పెట్టుబడులు నవంబర్‌లో రూ.8,272 కోట్లకు చేరి ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. అక్టోబర్‌లో సిప్‌ పెట్టుబడులు రూ.8,245 కోట్లుగా ఉన్నాయి. నవంబర్‌ నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని మొత్తం ఆస్తులు రూ.27.01 లక్షల కోట్లకు చేరాయి. నవంబర్‌లో ప్రముఖ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు) చేసిన కొనుగోళ్లు, అమ్మకాల వివరాలు ఇలా ఉన్నాయి..


ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌
భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ 3 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. పవర్‌గ్రిడ్‌ 2.26 కోట్ల షేర్లు, ఎస్‌జేవీఎన్‌ 1.31 కోట్ల షేర్లను కూడా కొనుగోలు చేసింది. ఐటీసీ, ఎన్‌హెచ్‌పీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, ప్రిస్మ్‌ జాన్సన్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హాట్సన్‌ ఆగ్రో, ఆర్‌ఐఎల్‌, ఎస్‌బీఐ, కోటక్‌ మహింద్రా బ్యాంకు, వేదాంత, ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కమిన్స్‌ ఇండియా, గెయిల్‌, యస్‌ బ్యాంకు షేర్లను కూడా 10-68 లక్షల పరిమాణంలో కొనుగోలు చేసింది. సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న యస్‌ బ్యాంకు షేర్లను కూడా మరికొన్ని కొనుగోలు చేయడం గమనార్హం. దీంతో యస్‌ బ్యాంకులో ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ వివిధ పథకాల పరిధిలో 4.62 కోట్ల షేర్లను కలిగి ఉంది. ఇంకా ఎస్‌ఆర్‌ఎఫ్‌, ఇంజనీర్స్‌ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, సీఎస్‌బీ బ్యాంకుల్లో వాటాలను కొనుగోలు చేసింది. ఇక అపోలో టైర్స్‌, క్లారియంట్‌ కెమికల్స్‌, కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌, నిట్‌ టెక్‌, న్యూలాండ్‌ ల్యాబ్‌ల్లో వాటాలను పూర్తిగా విక్రయించేసింది. వొడాఫోన్‌ ఐడియా షేర్లు 3 కోట్లకు పైగా అమ్మేసింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌లో తనకున్న వాటాల్లో కొంత మేర విక్రయించింది. అధిక వ్యాల్యూషన్లకు చేరడంతో లాభాల స్వీకరణ చేసినట్టు కనిపిస్తోంది. విక్రయించిన ఇతర స్టాక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంకు, అశోక బిల్డ్‌కాన్‌, బంధన్‌ బ్యాంకు, మదర్సన్‌ సుమి, యాక్సిస్‌ బ్యాంకు, అవాస్‌ ఫైనాన్షియర్స్‌, మిండా కార్పొరేషన్‌, యాక్సిస్‌ బ్యాంకు కూడా ఉన్నాయి.

 

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌
గోద్రేజ్‌ కన్జ్యూమర్‌, సన్‌ టీవీ, ముత్తూట్‌ ఫైనాన్స్‌లో కొత్తగా వాటాలను కొనుగోలు చేసింది. గెయిల్‌, అంబుజా సిమెంట్స్‌, సన్‌ఫార్మా కంపెనీల్లో మరికొన్ని వాటాలను యాడ్‌ చేసుకుంది. లెమన్‌ట్రీ హోటల్స్‌, అశోక్‌లేలాండ్‌, సెయిల్‌లో పూర్తి వాటాలను విక్రయించేసింది. ఐసీఐసీఐ బ్యాంకు, అలహాబాద్‌ బ్యాంకు, ఆర్‌ఐఎల్‌లో కొన్ని వాటాలను తగ్గించుకుంది. 

 

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌
సీఎస్‌బీ బ్యాంకులో వాటాలను కొనుగోలు చేయగా, కాఫీడేలో వాటాలను పూర్తిగా అమ్మేసింది. అలాగే, ఎస్‌బీఐ, వొడాఫోన్‌ ఐడియా, ఐసీఐసీఐ బ్యాంకులో వాటాలను తగ్గించుకుంది. You may be interested

నిర్మలా శక్తి రామన్‌..

Saturday 14th December 2019

- ఫోర్బ్స్‌ జాబితాలో 34వ స్థానం న్యూయార్క్‌: ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ రూపొందిందిన ఈ ఏడాది అగ్రశ్రేణి వంద అత్యంత శక్తివంతమైన మహిళల్లో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయంగా శక్తివంతమైన 100 మంది మహిళల 2019 జాబితాను ఫోర్బ్స్‌ తాజాగా విడుదల చేయగా.. ఇందులో మన దేశ ఆర్థిక మంత్రి 34వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.  గతంలో భారత రక్షణరంగానికి సారథ్యం వహించిన ఆమె.. ప్రస్తుతం మొత్తం

నిఫ్టీ బ్యాంకు ర్యాలీకి కారణాలివే..

Friday 13th December 2019

శుక్రవారం ప్రభుత్వరంగ బ్యాంకులు టాప్‌ గెయినర్లుగా నిలిచాయి. ఎస్సార్‌ స్టీల్‌ దివాలా పరిష్కార కేసులో బ్యాంకులకు చెల్లింపులు ఈ నెలలోనే ఉంటాయన్న వార్తలు ర్యాలీకి కారణమయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌ ఏకంగా 3.66 శాతం పెరిగి 2,561.60కు చేరుకుంది. నిఫ్టీ బ్యాంకు సూచీ కూడా కీలకమైన 32,000 మార్క్‌పైకి చేరింది. యూనియన్‌బ్యాంకు, ఓబీసీ, కెనరా బ్యాంకు, సిండికేట్‌ బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఐడీబీఐ బ్యాంకు, పీఎన్‌బీ, బ్యాంకు

Most from this category