News


అంచనాలే అంతిమం కాదు!

Thursday 2nd January 2020
Markets_main1577961790.png-30623

సమయానుగుణంగా మార్చుకోవాలి
లేదంటే బకరా అవడం ఖాయం
సీనియర్‌ అనలిస్టు సీకే నారాయణ్‌

‘‘అప్పుడప్పుడు ఒపీనియన్స్‌ ఛేంజ్‌ చేయాలోయ్‌!’’ అని కన్యాశుల్కంలో గిరీశం తన శిష్యుడికి హితోపదేశం చేస్తాడు. ఈ సూత్రం ఆ శిష్యుడికి పనికివచ్చిందో లేదో కానీ, మార్కెట్లో మదుపరికి మాత్రం తారకమంత్రంతో సమానమని సీనియర్‌ అనలిస్టు సీకే నారాయణ్‌ చెబుతున్నారు.

మార్కెట్లకు అనుగుణంగా మన అంచనాలను మార్చుకోవాలని, మూర్ఖంగా తా పట్టిన కుందేలుకు మూడేకాళ్లన్నట్లు ఒక అంచనా ఏర్పరుచుకొని, అందుకు రివర్సులో మార్కెట్‌ కదులుతున్నా అదే అంచనా పట్టుకువేళాడితే చివరకు మిగిలేది శూన్యమని సీకే నారాయణ్‌ హెచ్చరిస్తున్నారు. పెద్ద పెద్ద పేరొందిన అనలిస్టులు సైతం ఈ మాయలో చిక్కుకుపోయి కనపడకుండా పోయారని, మామూలు ట్రేడర్లు ఈ మాయకు లోబడకుండా జాగ్రత్త పడాలని హితవు చెప్పారు.

మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే....
‘‘ అమెరికాలో పేరొందిన అనలిస్టులు జోసెఫ్‌ గ్రాన్‌వెల్లి 1970లో, రాబర్ట్‌ ప్రీస్టర్‌ 1982లో అద్భుతమైన బేరిష్‌ అంచనాలు ఇచ్చారు. ఇవి 100 శాతం సక్సెస్‌ఫుల్‌గా జరిగాయి. దీంతో వీరికి విపరీమైన పేరొచ్చింది. కానీ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే 1970 పతనం తర్వాత రెండేళ్లు, 1982 పతనం తర్వాత ఆర్నెల్ల పాటు సూచీల్లో బుల్స్‌ చెలరేగిపోయాయి. కానీ వీరిద్దరూ మాత్రం తమ గత అంచనా మాయలో పడి ఇంకా మార్కెట్‌ పడుతుంది, పడుతుంది అని భావిస్తూనే వచ్చారు. కానీ వీరి ఆశ ఎప్పటికీ తీరలేదు. అదేవిధంగా మనదేశంలో 2006లో సత్యజిత్‌ దాస్‌ 2008లో రాబోయే సంక్షోభాన్ని ముందుగానే గుర్తించి హెచ్చరించారు. అది సరిగ్గా నిజమైంది. కానీ ఆ తర్వాత వాస్తవికతను గుర్తించకుండా తన బేరిష్‌ అంచనాలనే కొనసాగిస్తూ పోయారు. కానీ ఏ ఒక్కటీ సక్సెస్‌ కాలేదు. కేవలం అనలిస్టులే కాదు బడా బ్రోకరేజ్‌లు సైతం ఇదే మాయలో ఉంటాయి. 2017లో ఒక పెద్ద బ్రోకింగ్‌ సంస్థ 100మల్టీబ్యాగర్ల జాబితా ప్రకటించింది. కానీ ఆ తర్వాత సంవత్సరాల్లో అవేవీ పరుగులు తీయలేదు. కానీ ఇప్పటికీ సదరు సంస్థ ఆ జాబితాలో షేర్లపై బుల్లిష్‌గానే ఉన్నట్లు చెబుతుంటుంది. అదేవిధంగా ఒక మార్కెట్‌ నిపుణుడు పలు స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌ రికమండేషన్లకు పేరొందాడు. ఆయనిచ్చిన ఒక బేరిష్‌ సలహా విజయవంతం కావడంతో ఆ తర్వాత ఎప్పుడూ ఆయన అవే సలహాలు ఇవ్వాల్సిన స్థితిలో కూరుకుపోయాడు. మరో ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ హెడ్‌కు ఇన్వెస్టర్లలో గట్టి పేరుంది. ఈయన చెప్పిన అంచనాకు కచ్ఛితంగా వ్యతిరేక దిశలో మార్కెట్‌ నడుస్తుంటుందని పేరుగాంచాడు. దీంతో ఆయన తాను చెప్పిన అంచనాను సమర్ధించుకునేందుకు పలు విధాలుగా యత్నిస్తుంటాడు.
ఇలాంటి అంచనాలు చెప్పేవాళ్లు కేవలం వాళ్లు నష్టపోవడమే కాకుండా ఇన్వెస్టర్‌ను నష్టపరుస్తుంటారు. కొత్త అప్‌డేట్స్‌ ఏమీ లేనప్పుడు ఇన్వెస్టర్లు ఇలాంటి అంచనాలను పట్టుకొని ట్రేడింగ్‌ చేస్తుంటారు. మార్కెట్‌ తదనుగుణంగా ఉన్నంత వరకు ఫర్వాలేదుకానీ, రివర్సులో జరిగితే ఆ పెట్టుబడి గోవిందా! అవుతుంది. అందుకే మార్కెట్‌లో అంచనాల కన్నా పరిణామాలకే ప్రాధాన్యమివ్వాలి. ఈ విషయమై రాబర్ట్‌ మైనర్‌ చెప్పిన సూక్తి గుర్తుంచుకోవాలి. ‘‘ మార్కెట్‌ను ట్రేడ్‌ చేయండి కానీ అంచనాలను కాదు’’ అని మైనర్‌ చెబుతాడు. అలాగని మనం ఎలాంటి అంచనాలు లేకుండా ట్రేడ్‌ చేయమని అర్ధం కాదు. ఒక అంచనా ఏర్పరుచుకున్నా, మార్కెట్‌ తద్భిన్నంగా ప్రవర్తిస్తుంటే సదరు అంచనాను వదిలించుకొని మరోమారు మన నిర్ణయాలను పునఃసమీక్ష జరుపుకోవాలి. లేదంటే పైన చెప్పిన అనలిస్టుల్లాగా చెప్పే అంచనాలన్నీ తప్పులైతున్నా వాటిని సమర్థించుకోవడమే పనిగా మిగులుతుంది. మనం ఒక అంచనాను సమర్థించుకుంటున్నామంటే మనకు తెలియకుండానే పైన చెప్పిన అవలక్షణాన్ని అలవరుచుకుంటున్నామని అర్ధం. అది వ్యాధిగా మారితే తగ్గడం కష్టం కాబట్టి ఆరంభదశలోనే నివారించుకోవాలి. అంచనాలు తప్పడం కామన్‌ అని గుర్తించి ఎప్పటికప్పుడు నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలి.  

“Trade the market, never the forecast.” అనే రాబర్ట్‌ మైనర్‌ సూక్తిని మర్చిపోకూడదు.’’You may be interested

కదంతొక్కిన రియాల్టీ షేర్లు

Thursday 2nd January 2020

రియల్టీ రంగ షేర్ల ర్యాలీ కారణంగా నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ గురువారం 1శాతానికి పైగా లాభంతో ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో రియల్‌ ఎస్టేట్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ నేడు 299.15 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ ట్రేడింగ్‌ ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు రియల్టీ రంగ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఇండెక్స్‌ ఇంట్రాడేలో 1.52శాతం లాభపడి 302.40 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మార్కెట్‌ ముగిసే సరికి 0.92శాతం లాభంతో

బుల్‌ జోరు- సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ

Thursday 2nd January 2020

సెంచరీతో నిఫ్టీ.. క్లోజింగ్‌ రికార్డ్‌ మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌ జూమ్‌ దేశీ స్టాక్‌ మార్కెట్లలో కొత్త ఏడాది తొలి రోజు కనిపించిన హుషారు వరుసగా రెండో రోజు కొనసాగింది. దీంతో సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ సాధించగా.. నిఫ్టీ సెంచరీ కొట్టింది. దీంతో సెన్సెక్స్‌ 321పాయింట్లు జంప్‌చేసి 41627 వద్ద నిలవగా.. నిఫ్టీ 100 పాయింట్లు ఎగసి 12283 వద్ద ముగిసింది. వెరసి తద్వారా సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టానికి చేరువలో స్థిరపడగా.. నిఫ్టీ

Most from this category