News


బడ్జెట్‌ నుంచి ఆటోరంగానికి ఏం కావాలి?

Saturday 29th June 2019
Markets_main1561800807.png-26687

గత ఏడాది నుంచి దేశియ ఆటో రంగం అధ్వాన్న స్థితిలో ఉంది. వైఓవై (ఇయర్‌ ఆన్‌ ఇయర్‌) ప్రకారం ఆటోమొబైల్స్‌ అమ్మకాలు 20 శాతం మేర తగ్గాయి. ఈ జాబితా ఇంకా పెరుగుతునే ఉంది. 2019 బడ్జెట్‌లో ఈ రంగానికి దన్నుగా ఎటువంటి పాలసీలున్నాయి? ఆటోరంగం ఈ బడ్జెట్‌ ఎటువంటి అంశాలను కోరుకుంటుంది?

ఆటోమొబైల్స్‌పై జీఎస్‌టీ రేటు తగ్గింపు:
ఆటోమొబైల్స్‌పై విధిస్తున్నా 28శాతం జీఎస్‌టీ వలన వీటిని సిగరెట్స్‌, లక్సరీ వస్తువులలా అంటరానివిగా చూస్తున్నారని ఆటోరంగ ప్రతినిధులు వాపోతున్నారు. ఆటోమొబైల్స్‌పై జీఎస్‌టీ తగ్గింపును ‘జీఎస్‌టీ రేట్ల తగ్గింపు’ అనడం కంటే ‘జీఎస్‌టీ రేట్లను హేతుబద్ధీకరించడం’ అని పిలుస్తున్నారు. జీఎస్‌టీని 28 శాతం నుంచి 18శాతం హేతుబద్దీకరించాలని ఫలితంగా ధరలు తగ్గి డిమాండ్‌ పెరుగుతుందని ఆశిస్తున్నారు.

ఎన్‌బీఎఫ్‌సీ రంగాన్ని ఆదుకునే ప్రణాళికలు:
ఐల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం వలన ఎన్‌బీఎఫ్‌సీ రంగం మొత్తం కుదేలయ్యింది. దీని వలన లిక్విడిటీ సమస్యతో పాటు వడ్డిరేట్లు కఠినతరం అయ్యాయి. ఈ సంక్షోభం​వలన రియల్టీ రంగం తర్వాత భారీగా నష్టపోయింది ఆటోరంగమే.  ఎన్‌బీఎఫ్‌సీకి లిక్విడిటీ సమస్యను తీర్చేవిధంగా ఒక ఏకగవక్షాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ నిర్ణయించుకున్నారు. కానీ దీని వలన లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటున్న, అప్పులు తీర్చలేని ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలే లాభపడతాయి. దీంతోపాటు ఉన్న ఇంకో సమస్య ఫండ్‌ల ఖరీదు తగ్గింపు. ఈ పరిస్థితులలో ఎన్‌బీఎఫ్‌సీలు తక్కువ ఖరీదులో ఫండ్స్‌ను పెంచుకోలేవు. కానీ ఆటోరంగం డిమాండ్‌ పెంచడానికి ఇది ముఖ్యమైన చర్య. 

పాత వాహనాల రద్దుకు ప్రోత్సాహకాలు:
‘పాతవాహనాల రద్దుకు ప్రోత్సాహకాలు’ పథకాన్ని తీసుకొచ్చే విధంగా సియామ్‌(సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమోటివ్‌ మాన్యుప్యాక్చరర్స్‌) చాలాకాలం నుంచి ఆర్థిక మంత్రితో మంతనాలు జరుపుతోంది. ఈ పథకం వలన పాత, కాలుష్యన్ని కలిగించే వాహనాలను రోడ్లపై తగ్గించవచ్చు. ఫలితంగా వాహనాల పనురుద్ధరణ అమ్మకాలు పెరుగుతాయి. అంతేకాకుడా దిగుమతి చేసుకుంటున్నా వాణిజ్య వాహనాలు, ఎస్‌కేడీ(సెమీ నాక్‌డౌన్‌) వాణిజ్య వాహానాలపై దిగుమతి సుంకాలను వారు నిర్వహించే స్లాబులను అనుసరించి 5-15 శాతం పెంచాలని సియామ్‌ డిమాండ్‌ చేస్తోంది.  

ఎలక్ట్రిక్‌ వాహనాల అమలులో స్పష్టత:
ఎలక్ట్రిక్‌ వాహనాల అమలుకై స్థూలమైన పాలసీ పత్రాన్ని ఆటోరంగం​కోరుకుంటుంది. 2030 నాటికి  ఇందన ఆధారిత వాహనాలను రద్దు చేయాలని తాజాగా నీతి ఆయోగ్‌ ఆర్ధిక శాఖకు ఒక ప్రకటనను పంపించింది. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మార్పు తీసుకురావడం ఆటోరంగాన్ని గందరగోళ పరిచే విఘాతమైన చర్యగా చాలా వాహన తయారిదారి సంస్థలు అభివర్ణిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆటోరంగ సంస్థలకు అంత మొ‍త్తంలో ఇన్వెస్ట్‌మెంట్ చేసే సామర్ధ్యం లేదు. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఇంధన వాహనాల నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మారే రోడ్‌మ్యాప్‌ను పర్యవరణ పరిరక్షణకు కట్టుబడి, ఆటో కంపెనీల లాభదాయకతను దృష్ఠిలో పెట్టుకొని తీసుకురావచ్చు. సాధరణంగా ఆర్థికవ్యవస్థ వినియోగంలో ఆటోరంగం బలమైన పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ రంగాన్ని ఆదుకునే సమయం వచ్చింది. 
   You may be interested

ప్రజారంజకంగానే బడ్జెట్‌ : మార్కెట్‌ విశ్లేషకులు

Saturday 29th June 2019

నిఫ్టీ ఆల్‌టైం హైని అందుకోవడం కష్టమే.. వచ్చేవారంలో కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ప్రజారంజకంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చిన్న పరిశ్రమలు, రైతులను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ తయారీ ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఇదే ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడంతో ఈసారి బడ్జెట్‌పై సాధారణ ప్రజలు బడ్జెట్‌పై బారీగా ఆశలు పెట్టుకున్నారు. జూన్‌ 05న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ దేశీయ ఆర్థిక వ్యవస్థకు

రిలయన్స్‌ హోమ్స్‌ రూ.400కోట్ల చెల్లింపుల డీఫాల్ట్‌

Saturday 29th June 2019

అనిల్‌ అంబానీకి చెందిన అడాగ్‌ గ్రూప్‌ కంపెనీలకు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. తాజాగా అడాగ్‌ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ హోమ్స్‌ సంస్థ శుక్రవారం నాన్‌ - కన్వర్టబుల్‌ డిబెంచర్లపై చెల్లించాల్సిన రూ.400 కోట్లను చెల్లించడంలో విఫలమైంది. అప్పులను చెల్లించడానికి జరుగుతున్న మోనటైజేషన్‌ ప్రక్రియ నుంచి రావాల్సిన ఆదాయం సరైన సమయంలో అందకపోవడంతో డిబెంచర్ల రుణాన్ని చెల్లించలేకపోయినట్లు శనివారం కంపెనీ వివరణ ఇచ్చింది. ఈ మొత్తం రుణాన్ని చెల్లించేందుకు కంపెనీ

Most from this category