News


ఎగ్జిట్‌ పోల్స్‌పై మార్కెట్‌ ఏమంటోంది?

Monday 10th December 2018
Markets_main1544433407.png-22805

ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రధాని నరేంద్ర మోదీ హవాపై సందేహాలను లెవనెత్తిన తరుణంలో ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు పోటాపోటీగా ఉన్నాయని ఆరు ఎగ్జిట్‌ పోల్స్‌ తెలిపాయి. మూడు ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీ ముందంజలో ఉందని పేర్కొంటే.. మిగిలిన ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపాయి. విజేతలు ఎవరనేది మంగళవారం తెలిపోతుంది. 
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 ఇండెక్స్‌ సోమవారం మార్నింగ్‌ సెషన్‌లో 1.94 శాతం మేర పతనమైంది. 10,486 స్థాయిని తాకింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 35,000 మార్క్‌ను పరీక్షిస్తోంది. ఎగ్జిట్‌ పోల్స్‌పై దలాల్‌ స్ట్రీట్‌ నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.. 

హువావే సీఎఫ్‌వో అరెస్ట్‌, ట్రంప్‌కు దాదాపు దశాబ్ద కాలంపాటు ట్యాక్స్‌ లాయర్‌గా పనిచేసిన ఆల్డెర్మాన్ ఎడ్వర్డ్ బుర్కే లండన్‌ ఆఫీస్‌పై ఎఫ్‌బీఐ దాడి చేయడం, ఎగ్జిట్‌ పోల్స్‌ వంటి అంశాలు ఈ రోజు కరెక‌్షన్‌కు కారణం. ఇదే ట్రెండ్‌ మరి కొన్ని నెలలపాటు కొనసాగవచ్చు. దేశ రాజకీయ పరిస్థితులు ఆర్థిక వ్యవస్థపై గట్టి ప్రభావం చూపలేదు. ఇది గతంలోనూ లేదు. ఇప్పుడు కూడా ఉండదు.  అయితే నిఫ్టీ 9,500 దిగువకు వస్తే.. దాన్ని బైబ్యాక్‌ అవకాశంగా భావించాలి. అంతర్జాతీయ పరిస్థితులు, దేశీ రాజకీయ అంశాలను గమనిస్తే ఇండెక్స్‌ కిందకు వచ్చే అవకాశముంది
-మార్కెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఫౌండర్‌ సౌరభ్‌ ముఖర్జీ

మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో రెండింటిలో బీజేపీ ఓడిపోతే అది మార్కెట్లకు నెగటివ్‌ అంశం. ప్రస్తుతం ఇరు జాతీయ పార్టీల మేనిఫెస్టోలను గమనిస్తే.. 2019 ఎన్నికల్లో రైతు సమస్యలు, ఉద్యోగాలు ప్రధాన అజెండాగా కనిపిస్తున్నాయి. రైతు రుణ మాఫీ అంశం కీలకం కావొచ్చు.
-సీఎల్‌ఎస్‌ఏ ఇండియా స్ట్రాటజిస్ట్‌ మహేశ్‌ నండూర్కర్‌

డిసెంబర్‌ 11 తర్వాత మార్కెట్‌ ర్యాలీ చేయవచ్చు. అదేసమయంలో కరెక‌్షన్‌కు గురికావొచ్చు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆధారపడి అటువైపా? ఇటువైపా? ఉంటుంది. 
-కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ ఎండీ సంజీవ్‌ ‍ప్రసాద్‌

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడింటిలో బీజేపీ గెలుస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనాకు వచ్చాయి. రాజస్తాన్‌లో ఓటమి అంచనా వేయవచ్చు. అయితే ఇక్కడ ఎన్ని సీట్లు వస్తాయో గమనించాల్సి ఉంది. బీజేపీ మూడు రాష్ట్రాల్లో గెలిచినా కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనంగానే ఉండొచ్చు. క్రూడ్‌, కరెన్సీ, అమెరికా ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చు. స్టాక్స్‌ను తక్కువ ధరల్లో కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం.
-కేఆర్‌ చోక్సీ ఎండీ దెవెన్‌ చోక్సీ

మార్కెట్‌కు ఎగ్జిట్‌ పోల్స్‌ సానుకూల అంశం కాదు. మూడు ప్రధాన రాష్ట్రాల్ల బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. మార్కెట్లు బలహీనంగా ఉండొచ్చు.
-క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ సంజయ్‌ దత్‌

మూడు ప్రధాన రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే 2-3 రోజుల్లో మార్కెట్లు 3-4 శాతం మేర కరెక‌్షనకు గురికావొచ్చు. అదే బీజేపీ బలపడితే.. అప్పుడు ప్రతిపక్షాల ఐక్యత కష్టతరమౌతుంది. 
-ఎస్‌బీఐ క్యాప్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ (ఈక్విటీస్‌) నీరవ్‌ సేత్‌ 

మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావొచ్చని మార్కెట్‌ అంచనా వేస్తోంది. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ మిశ్రమ ఫలితాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. 
-వెంచరా సెక్యూరిటీస్‌ హెడ్‌ (ఈక్విటీస్‌ రీసెర్చ్‌) వినిత్‌ బలింజ్‌కర్‌

ఎగ్జిట్‌ పోల్స్‌ కచ్చితమైనవి కావు. ఇప్పుడు కూడా అంతే. మార్కెట్‌ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. బీజేపీకి అనుకూలంగా ఫలితాలు ఉంటే అది మార్కెట్‌కు పాజిటివ్‌.
-కార్నేలియన్‌ క్యాపిటల్‌ ఫౌండర్‌ వికాస్‌ ఖేమాని

ఎగ్జిట్‌ పోల్స్‌ మార్కెట్‌పై పాక్షికంగా ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అయితే అసలు ట్రెండ్‌ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాతనే ఉంటుంది. మూడు ప్రధాన రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం (3-0, 2-1) కనబరిస్తే.. అప్పుడు నిఫ్టీ 10,000 స్థాయి దిగువకు పడిపోవచ్చు. అదే బీజేపీ గెలిస్తే (2-1) 11,000 మార్క్‌ పైకి వెళ్తుంది. 3-0తో బీజేపీ గెలిస్తే నిఫ్టీ కొత్త గరిష్టాలకు చేరుతుంది. 
-మోనార్క్‌ నెట్‌వర్త్‌ క్యాపిటల్‌ హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ విపుల్‌ షా

ఎగ్జిట్‌ పోల్స​వల్ల ప్రస్తుతం డాలర్‌-రూపాయి మార్కెట్‌లో ఒడిదుడుకులు తలెత్తుతాయి. అయితే రానున్న కాలంలో మార్కెట్‌ ఫండమెంటల్స్‌ను అనుసరిస్తుంది. ఎగ్జిట్‌ పోల్స్‌కు భిన్నమైన ఫలితాలు వెలువడితే.. అప్పుడు మార్కెట్‌ ర్యాలీ చేస్తుంది. 
-హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీనియర్‌ రీజినల్‌ హెడ్‌ భాస్కర​ పాండా

ఎన్నికల ఫలితాలలో పాటు అమెరికా ఫెడరల్‌ రిజర్వు డిసెంబర్‌ పాలసీ, బ్రెగ్జిట్‌ పార్లమెంటరీ ఓటు, ఒపెక్‌ దేశాల ఆయిల్‌ సరఫరా తగ్గింపు నిర్ణయం వంటి పలు అంశాలను గమనించాల్సి ఉందని నిపుణులు పేర్కొన్నారు. You may be interested

రియల్టీ షేర్లు..పల్టీ

Monday 10th December 2018

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం రియల్టీ రంగ షేర్లు బోర్లా పడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 3.30శాతానికి పైగా నష్టపోయింది. మధ్యాహ్నాం గం.3:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(230.45)తో పోలిస్తే 3శాతం నష్టంతో 223.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలోని మొత్తం 10 షేర్లు నష్టాల బాట పట్టాయి. అత్యధికంగా ఇండియాబుల్స్‌ రియల్టీ షేరు 6.50శాతం నష్టపోయింది. యూనిటెక్‌ 5శాతం, శోభ, ఒబేరాయ్‌

ఈ వారం ట్రేడింగ్‌ జోలికెళ్లొద్దు..

Monday 10th December 2018

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు గత వారంలోని ఐదు ట్రేడింగ్‌ సెషన్లలోకెల్లా నాలుగు సెషన్లలో కరెక‌్షన్‌కు గురయ్యాయని ఈక్విటీ99 ఫౌండర్‌ సుమిత్‌ బిల్గైయన్‌ తెలిపారు. ఇదేసమయంలో గ్లోబల్‌ మార్కెట్లలోనూ తీవ్ర ఒడిదుడుకులు ఉన్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు మన మార్కెట్లపై నెగటివ్‌ ప్రభావం చూపాయని తెలిపారు. అయితే ఇప్పుడు అందరి కళ్లు డిసెంబర్‌ 11 నాటి ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు వీటిని సెమీఫైనాల్స్‌గా భావించొచ్చని

Most from this category