News


ఈ భారీ పతనం వెనుక...ఏమై ఉండొచ్చు?

Monday 8th July 2019
Markets_main1562608587.png-26904

ఆర్థిక మం‍త్రి నిర్మలా సీతారామన్‌ ఆదాయపన్ను సర్‌ చార్జీ పెంచుతూ బడ్జెట్‌లో చేసిన ప్రకటన సోమవారం భారీ నష్టాలకు దారి తీసి ఉండొచ్చన్న విశ్లేషణ వినిపిస్తోంది. బడ్జెట్‌ కాపీ చూసిన తర్వాత విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) లాభాల స్వీకరణకు పోటీపడి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా ఇండెక్స్‌ స్టాక్స్‌లో ఎక్కువ అమ్మకాలు చోటు చేసుకున్నాయి. 

 

బడ్జెట్‌లో ఆదాయపన్ను సర్‌ చార్జీని పెంచుతున్నట్టు మంత్రి ప్రకటించారు. దీనివల్ల విదేశీ ఇన్వెస్టర్ల దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను భారం పెరిగిపోతుందని అంచనా. సర్‌చార్జీపై ఎఫ్‌పీఐల ఆందోళనను పరిశీలించి, ఈ విషయమై ఓ వివరణ త్వరలోనే జారీ చేస్తామని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైరర్మన్‌ ప్రమోద్‌ చంద్ర మీడియాకు తెలిపారు. కానీ, ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలమ్మ స్పందిస్తూ తాజా వివరణ ఏదీ అవసరం లేదని తేల్చేశారు. ‘‘ఎఫ్‌పీఐలపై పన్ను సర్‌చార్జీకి సంబంధించి తాజా వివరణ అవసరమని నేను అనుకోవడం లేదు’’ అని మంత్రి ఆర్‌బీఐ బోర్డు సమావేశం తర్వాత జరిగిన మీడియా ముఖాముఖిలో పేర్కొన్నారు. 

 

ఆదాయపన్ను చట్టంలోని నిబంధల ప్రకరాం... షేర్లలో దీర్ఘకాలిక మూలధన లాభాల(ఎల్‌టీసీజీ)పై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ లాభం రూ.లక్ష దాటినప్పుడే పన్ను అమల్లోకి వస్తుంది. ఏడాది లోపు పెట్టుబడులపై లాభాలకు (స్వల్పకాల మూలధన లాభాలు/ఎస్‌టీసీజీ) గాను 15 శాతం పన్ను చెల్లించాలి. దీంతో సర్‌చార్జ్‌తో కలుపుకుని దీర్ఘకాల లాభాలపై 11.96 శాతం, స్వల్పకాల లాభాలపై 17.94 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లో దీర్ఘకాల లాభాలపై పన్ను 20 శాతం, స్వల్పకాల లాభాలపై 30 శాతం మేర అమలవుతోంది. డెరివేటివ్‌ ట్రేడ్లపై స్వల్ప కాల లాభాలపై 30 శాతం పన్ను అమల్లో ఉంది. తాజా బడ్జెట్లో వీటిల్లో మార్పులు అయితే చేయలేదు. కానీ, సర్‌చార్జీ బాదుడులో మార్పులు ఎఫ్‌పీఐలపై భారం మోపనుంది. రూ.2-5 కోట్ల ఆదాయ వర్గాలపై సర్‌చార్జీని 15 శాతం నుంచి 25 శాతానికి, రూ.5కోట్లపైన ఆదాయం కలిగిన వారికి 15 శాతం నుంచి 37 శాతానికి మేడమ్‌ నిర్మల పెంచేశారు. గతంలో వార్షికాదాయం రూ.కోటి దాటితే 15 సర్‌చార్జీ అమలయ్యేది. విదేశీ ఫండ్స్‌, ముఖ్యంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పర్సన్స్‌ లేదా ట్రస్ట్‌ల మార్గంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మినిమం ఆల్టర్నేటివ్‌ ట్యాక్స్‌ లేకుండా చూసుకునేవారు. తాజాగా మేడమ్‌ ప్రతిపాదన ప్రకారం... రూ.2 కోట్ల ఆదాయం లిస్టెడ్‌ కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా సమకూర్చుకుంటే, స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాల పన్నుపై 25 శాతం సర్‌చార్జీ చెల్లించుకోవాలి. అదే ఈక్విటీల నుంచి ఆదాయం రూ.5కోట్లు దాటితే చెల్లించాల్సిన సర్‌చార్జీ 37 శాతం అవుతుంది. 

 

‘‘రూ.లక్ష దాటిన మూలధన లాభాల పన్నుపై 10 శాతం పన్ను చెల్లించాల్సిందే. ఒకవేళ ఈ మూలధన లాభానికితోడు, ఇతర ఆదాయం కూడా కలసి రూ.2 కోట్లు దాటితే అధిక సర్‌చార్జీ చెల్లించాల్సి వస్తుంది’’ అని జేఎంపీ అడ్వైజర్స్‌ జైరాజ్‌ పురంధరే తెలిపారు. పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్‌ భవిన్‌షా నిర్వచనం ప్రకారం... రూ.2-5కోట్ల మధ్య ఆదాయం కలిగిన వారు స్వల్పకాల మూలధన లాభాలపై 13 శాతం, దీర్ఘకాల మూలధన లాభాలపై 19.50 శాతం ఎఫెక్టి్వ్‌ పన్ను రేటు ఇకపై చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే, రూ.5కోట్లపైన ఆదాయం కలిగిన వారికి ఈ రేట్లు 14.25 శాతం, 21.37 శాతంగా ఉంటాయన్నారు. You may be interested

ముందున్నది మరింత పెయిన్‌?

Monday 8th July 2019

సూచీలు సోమవారం భారీగా నష్టపోయాయి. బడ్జెట్‌ ప్రతిపాదనలపై ఎంతో ఆశపెట్టుకోగా, కొత్త విత్తమంత్రి నిరాశకు గురి చేయడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో నిఫ్టీ కీలక మద్దతు స్థాయిలను కూడా కోల్పోయింది. అయితే, ఇంకాస్త పతనం మిగిలి ఉందంటున్నారు విశ్లేషకులు.   నిఫ్టీ-50 గత శుక్రవారంతో పోలిస్తే సోమవారం భారీ భేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. 50రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌నూ కూడా కోల్పోయి, బేరిష్‌ బెల్ట్‌ హోల్డ్‌ ప్యాటర్న్‌ను డైలీ

సెన్సెక్స్‌ 800 పాయింట్లు క్రాష్‌

Monday 8th July 2019

బడ్జెట్‌ ప్రతిపాదనలు మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడంతో రెండో రోజూ సూచీలు నిలువునా పతనమయ్యాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, ముడిచమురు ధరల పెరుగుదల, రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్‌, రేపటి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు క్యూ1 ఫలితాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత తదితర అంశాలు కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. సెన్సెక్స్‌ ఏకంగా 793 పాయింట్లు నష్టపోయి 39 వేల దిగువున 38,720 వద్ద ముగిసింది. నిఫ్టీ

Most from this category