News


ఎయిర్‌టెల్‌, వీఐఎల్‌పై అనలిస్టుల అంచనాలు

Friday 15th November 2019
Markets_main1573801535.png-29616

నష్టాల్లోంచి లాభాల్లోకి మారిన  షేర్లు
ఆరంభ ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయిన వొడాఫోన్‌ ఐడియా, స్వల్పనష్టాలతో ట్రేడింగ్‌ ఆరంభించిన ఎయిర్‌టెల్‌ షేర్లు మధ్యాహ్న సమయానికి దాదాపు 7 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ షేర్లపై బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి..
= యూబీఎస్‌: ఎయిర్‌టెల్‌ షేరుకు కొనొచ్చు రేటింగ్‌ను రూ. 415 టార్గెట్‌ను ఇచ్చింది. షేరు ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉందని తెలిపింది. ఏజీఆర్‌ లెక్కలు లేకుంటే ఫలితాలు బలంగా ఉన్నట్లేనని తెలిపింది. 
= ఎమ్‌కే గ్లోబల్‌: ఎయిర్‌టెల్‌కు కొనొచ్చు రేటింగ్‌తో రూ. 432 టార్గెట్‌ను నిర్ణయించింది. కంపెనీ నిర్వహణ ప్రదర్శన అంచనాలను మించిందని, ఆఫ్రికా వ్యాపారం గాడిలో ఉందని తెలిపింది. ఏజీఆర్‌ జరిమానాల కారణంగా కంపెనీ నిధుల సమీకరణ చేపట్టాల్సిరావచ్చని అంచనా వేసింది. భవిష్యత్‌లో కంపెనీ వొడాఫోన్‌ ఐడియా ఆదాయాలు, చందాదారుల్లో దాదాపు 40 శాతాన్ని కొల్లగొట్టవచ్చని తెలిపింది. 
= ఎస్‌బీఐ క్యాప్‌: వొడాఫోన్‌ ప్రదర్శన మందకొడిగా ఉంది. ఏఆర్‌పీయూ, కొత్త చందాదారుల సంఖ్య క్షీణించాయి. ఎయిర్‌టెల్‌, జియోతో నెట్‌వర్క్‌, పెట్టుబడుల విషయంలో పోటీ పడలేకపోవడం కంపెనీ ప్రదర్శనను మరింత దెబ్బతీయవచ్చు. 
= ఎడెల్‌వీజ్‌: ప్రభుత్వం సాయం అందించకుంటే వొడాఫోన్‌ ఐడియా క్రమంగా పోటీ నుంచి తప్పుకోవచ్చు. అప్పుడు వొడా వ్యాపారంలో 40 శాతం వాటాను ఎయిర్‌టెల్‌ సొంత చేసుకొనే ఛాన్సుంది. 
= ఫిచ్‌ రేటింగ్స్‌: వొడాఫోన్‌ ఐడియా ఎబిటా పెరుగుదల చాలా అల్పంగా ఉన్నందున ప్రభుత్వం సాయం అందించకపోతే కంపెనీ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలోకి జారిపోవచ్చు. పోటీ మార్కెట్లో ఆరు నెలలకొకసారైనా కొత్త పెట్టుబడులు పెట్టకపోతే చందాదారుల సంఖ్య తీవ్రంగా తగ్గుతుంది. 
ఇకపై మూడు రకాల పరిణామాలు సంభవించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. టెలికం విషయంలో ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకోకపోవడం లేదా కొంతమేరే జోక్యం కల్పించుకోవడం లేదా పూర్తిగా సహకారం అందించడం.. అనే మూడు మార్గాలున్నాయని చెబుతున్నారు. తొలి మార్గమైతే దేశీయ టెలికం రంగంలో కేవలం రెండే ప్రైవేట్‌ ప్లేయర్లు మిగలవచ్చని, రెండో మార్గమైనా వొడాఫోన్‌ఐడియా తట్టుకోలేకపోవచ్చని, మూడో మార్గమైతే ప్రస్తుత మూడు టాప్‌ ప్లేయర్లు పోటీలోనే ఉంటారని అంచనా వేస్తున్నారు.You may be interested

నష్టాల్లోంచి లాభాల్లోకి భారతీ ఎయిర్‌టెల్‌ షేరు

Friday 15th November 2019

భారతీ ఎయిర్‌ షేరు మిడ్‌సెషన్‌ తిరిగి లాభాల బాట పట్టింది. గురువారం క్యు2 ఫలితాల్లో భారీ నష్టాలు నమోదు చేసిన ఈ షేరు ఉదయం ట్రేడింగ్‌లో నష్టాల్లో ప్రారంభమైంది. బీఎస్‌ఈలో 2.50శాతం నష్టంతో రూ.357.85 వద్ద ట్రేడ్‌ ప్రారంభమైంది. ఎయిర్‌టెల్‌ ఏజీఆర్‌పై సుప్రీం తీర్పుతో రెండో త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించింది. ఈ క్యూ2లో రూ.23045 కోట్ల నికర నష్టం వచ్చినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక

అక్టోబర్‌లో ఫంద్స్‌ కొన్న బ్లూచిప్స్‌ ఇవే!

Friday 15th November 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌ అక్టోబర్‌ నెలలో బ్లూచిప్‌ స్టాక్స్‌ కొనుగోలు చేయడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. వీటి వాల్యుయేషన్‌లు చౌకగా లేనప్పటికి, ఈ కంపెనీల వృద్ధి ఆశాజనకంగా ఉండడమే దీనికి కారణం. ఈ బ్లూచిప్‌ కంపెనీలన్ని ఒక పోలికను కలిగివున్నాయి. ఈ కంపెనీలు ఆయా రంగాలలో కీలకంగా ఉండడం లేదా కీలకంగా మారడానికి దగ్గర్లో ఉండడం గమనార్హం. ఫండ్‌ మేనేజర్లు అక్టోబర్‌ నెలలో కొనుగోలు చేసిన కంపెనీలలో టాప్‌ కంపెనీల గురించి

Most from this category