News


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలపై బ్రోకరేజ్‌లు పాజిటివ్‌

Monday 21st October 2019
Markets_main1571653108.png-29032

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక ఫలితాలను శనివారం విడుదల చేసింది. ఇతర మార్గాల నుంచి ఆదాయాలు అధికంగా రావడం, స్థిరమైన రుణ వృద్ధి కారణంగా ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకున్నాయి. దీంతో ఈ బ్యాంక్‌ షేర్లకు అనలిస్టులు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగించారు. ఇక బ్యాంకు ఈ క్యూ2లో రూ.6, 638 కోట్ల నికరలాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఆర్జించిన నికర లాభం, రూ. 5,322 కోట్లుతో పోల్చితే 25 శాతం అధికం. బ్యాంక్‌ ఆస్తుల స్థిరంగా ఉంది. స్థూల నాన్‌ ఫెర్మ్‌ఫామింగ్‌ ఆస్తుల నిష్పత్తి 1.38శాతంగా నమోదైంది. గతేడాది ఇదే క్యూ2లో ఇది 1.4శాతంగా నమోదైంది. నికర ఎన్‌పీలు 0.42 శాతం నుంచి 0.43 శాతానికి పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆయా ఆయా బ్రోకరేజ్‌ సంస్థలు బ్యాంకు క్యూ2 ప్రదర్శనపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చాయి. 
ప్రభుదాస్‌ లిల్లాధర్‌ :- 
1. గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను, షేరు కొనుగోలు టార్గెట్‌ ధరను రూ.1406లుగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
2. తక్కువ పన్ను రేటు, స్థిరమైన నిర్వహణ ప్రదర్శన బ్యాంకుకు తోడ్పతాయి.
3. పోర్ట్‌ఫోలియోలో మొండిబకాయిలు స్థిరంగా వున్నాయి.
4. రూ .660 కోట్ల ఆకస్మిక ప్రోవిజన్లకు బ్యాంక్ తక్కువ పన్ను రేటును ఉపయోగించింది
ఎక్వైరీస్‌ బ్రోకరేజ్‌ :-
1. గతంలో షేర్లకు కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగించడం పాటు షేరు టార్గెట్‌ ధర రూ.1338 నుంచి రూ.1410లకు పెంచింది.
2. నిర్వహణ ప్రదర్శన అంచనాలకు అనుగుణంగా ఉంది. రిటైల్‌ మొండిబకాయిలు ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి.
3. వార్షిక ప్రాతిపాదికన అటో రుణాలు 2.3శాతం తగ్గాయి. పంపిణీలు 12-13శాతం పెరిగాయి.
ఐడీఎఫ్‌సీ బ్రోకరేజ్‌ :- 
1. తక్కువ పన్ను, బలమైన రుణ వృద్ధి,  పెట్టుబడుల అమ్మకాలపై ఆదాయం వంటి అంశాలు అధిక లాభం సంపాదించడానికి దారితీసింది
2. నెమ్మదించిన నికర వడ్డీ ఆదాయ వృద్ధి, నెమ్మదించిన బ్యాలెన్స్‌ షీట్‌ వృద్ధి.. ఈ రెండు అంశాలు కీలక ప్రతికూలాంశాలు
3. ప్రస్తుత వాతావరణంలో ఫైనాన్షియల్‌ రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మంచి రిస్క్‌-ఆఫ్‌ ట్రేడ్‌ షేరు.

ఎమ్‌కే బ్రోకింగ్‌
1. గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను, షేరు టార్గెట్‌ ధర రూ.1500ల అలాగే కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
2. కార్పోరేట్‌ వృద్ధి పెరగడంతో రుణ వృద్ధి పెరిగింది. 
3. వ్యక్తిగత, వాహన రుణాల ప్రభావంతో రిటైల్‌ వృద్ధి నెమ్మదించింది
4. ద్వి, త్రి చక్ర వాహనాల రుణాలు విభాగంలో మొండి బకాయిలు అధికంగా ఉన్నాయి.You may be interested

సత్తా చూపిస్తున్న డయోగ్నోస్టిక్‌ స్టాక్స్‌

Monday 21st October 2019

హెల్త్‌కేర్‌ రంగం స్టాక్స్‌ (ఫార్మా) గడ్డు పరిస్థితులను చవిచూస్తుంటే, మరోవైపు ఇదే విభాగంలోని డయోగ్నోస్టిక్‌ (వ్యాధి నిర్ధారణ కేంద్రాలు) కంపెనీల స్టాక్స్‌ మంచి రాబడులను అందించాయి. దేశంలో వ్యాధి నిర్ధారణ పరీక్షల పరిశ్రమ పరిమాణం 9 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని అంచనా. గత ఐదేళ్లలో హెల్త్‌కేర్‌ విభాగంలో ఈ విభాగం ఒక ఆశాకిరణంగా కొనసాగుతోంది. లివర్‌ పనితీరు నుంచి, కొలెస్ట్రాల్‌ వరకు తమ ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకోవాలన్న అభిలాష

10-73 శాతం రాబడుల్నిచ్చే టాప్‌ 11 స్టాకులు!

Monday 21st October 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు గత కొన్ని సెషన్ల నుంచి పాజిటివ్‌గా ముగిశాయి. ఈ సానుకూల పరిస్థితులలో మధ్యస్థ కాలానికి గాను  10-73 శాతం వరకు రిటర్నలను ఇవ్వగలిగే 11 స్టాకులను వివిధ బ్రోకరేజిలు సిఫార్సు చేస్తున్నాయి. బ్రోకరేజిలు సిఫార్సు చేస్తున్న టాప్‌ స్టాకులు... బ్రోకరేజి: యాక్సిస్‌ సెక్యురిటీస్‌ డిక్సన్ టెక్నాలజీస్: కొనచ్చు | టార్గెట్‌ ధర: రూ .3,649 | రిటర్న్‌: 18 శాతం డిక్సన్ టెక్నాలజీస్ (డిక్సన్), కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ బ్రాండ్ల తయారిలో

Most from this category