News


సన్‌ఫార్మా సంగతేంటి..?

Wednesday 14th November 2018
Markets_main1542186621.png-21999

  • పాజిటీవ్‌గానే ఉన్నట్లు తెలిపినప్పటికీ.. టార్గెట్‌ ధరలో 10-12 శాతం మేర కోత విధించిన బ్రోకింగ్‌ సంస్థలు

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2018-19) రెండో త్రైమాసికానికి ఔషధ దిగ్గమైన సన్‌ఫార్మా రూ.218 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. క్యూ2(జులై-సెప్టెంబర్‌) కాలంలో అమెరికాలోని మోడఫినిల్‌ యాంటీ-ట్రస్ట్‌ కేసు పరిష్కారం నిమిత్తం రూ.1,214 కోట్లను కేటాయించిన నేపథ్యంలో కంపెనీ లాభాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. గతేడాది క్యూ2లో కంపెనీ ఆర్జించిన నికర లాభం రూ.912 కోట్లు కాగా, ఆదాయం రూ.6,650 కోట్లుగా నమోదైన విషయం తెలిసిందే. ఏడాది ప్రాతిపదికన చూస్తే.. ఆదాయం 4 శాతం వృద్ధి చెందింది. రూ.6,937 కోట్లుగా నమోదైంది. కంపెనీ ప్రకటించిన ఫలితాల ఆధారంగా పలు బ్రోకరేజ్‌ సంస్థలు తమ విశ్లేషణలను వెల్లడించాయి. షేరు పట్ల సానుకూలంగానే ఉన్నట్లు చెబుతూనే టార్గెట్‌ ధరలో 10-12 శాతం మేర కోత విధించాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి కంపెనీ షేరు ధర 7 శాతం నష్టపోయి రూ.521 వద్ద ట్రేడవుతోంది.

  • అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ ‘బై రేటింగ్‌’ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, టార్గెట్‌ ధరలో 10 శాతం కోత విధించింది. ఇంతకుముందు ఇచ్చిన రూ.800 ధరను రూ.700 వద్దకు సవరించింది. కేసు పరిష్కారంతో పాటు ప్రణాళిక నిల్వలు(ఇన్వెంటరీ)ను ఏకకాలంలో తగ్గించిన కారణంగా నష్టాలు నమోదైనట్లు తెలిపింది. 
  • యాజమాన్యం ప్రకటనల తరువాత అంచనా ఆదాయాన్ని 10 శాతం తగ్గించినట్లు షేర్‌ఖాన్‌ ప్రకటించింది. 2021 ఆర్థిక సంవత్సరం అంచనా ఎర్నింగ్స్‌ 21 రెట్లుగా లెక్కిస్తూ.. టార్గెట్‌ ధరను రూ.695 వద్ద నిర్ణయించినట్లు తెలిపింది.
  • దేశీ ఫార్ములేషన్‌ వ్యాపారం తగ్గుతున్న అంశం ఆధారంగా ఈపీఎస్‌ అంచనాను 2019 కాలానికి 6 శాతం, 2020 కాలంలో 3 శాతానికి కుదిస్తూ టార్గెట్‌ ధరను రూ.760 వద్ద నిర్ణయించినట్లు మోతిలాల్ ఓస్వాల్ వివరించింది. బై రేటింగ్‌ను మాత్రం కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
  • ఫలితాల ఆధారంగా షేరు రేటింగ్‌ను అవుట్‌పెర్ఫార్మ్‌ నుంచి న్యూట్రల్‌కు తగ్గించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. టార్గెట్‌ ధరను రూ.619 నుంచి రూ.557 వద్దకు సవరించినట్లు వెల్లడించింది. అమెరికా మార్కెట్‌లో ఒడిదుడుకులు, స్వల్పకాలానికి ఉన్న సవాళ్ల ఆధారంగా టార్గెట్‌ ధరను తగ్గించినట్లు వివరించింది.You may be interested

మహీంద్రా లాభం రూ.1,778 కోట్లు

Wednesday 14th November 2018

దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికం (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. కంపెనీ నికర లాభం 26 శాతం వృద్ధితో రూ.1,778 కోట్లకు పెరిగింది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.1,410 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.12,790 కోట్లకు పెరిగింది. గత

10,000లోపు వివో కొత్త ఫోన్‌!!

Wednesday 14th November 2018

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘వివో’ త్వరలో ‘వై81ఐ’ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకురానుంది. దీని ధర రూ.10,000లోపు ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఇందులోని ప్రత్యేకతలను గమనిస్తే.. 6.22 అంగుళాల స్క్రీన్‌ 3,260 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఫేస్‌ అన్‌లాక్‌ నాచ్‌ డిస్‌ప్లే ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఓఎస్‌ 2 జీబీ ర్యామ్‌ 16 జీబీ మెమరీ మీడియాటెక్‌ ఎంటీ-6761 ప్రాసెసర్‌ 13 ఎంపీ రియర్‌ కెమరా 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా

Most from this category