News


ఈ వారం స్టాక్‌ రికమెండేషన్స్‌

Monday 19th August 2019
Markets_main1566193545.png-27852

గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌         కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
ప్రస్తుత ధర: రూ.752
టార్గెట్‌ ధర: రూ.1,057

ఎందుకంటే: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ టెక్స్‌టైల్స్‌ కంపెనీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇప్పుడు టెక్స్‌టైల్స్‌తో పాటు సిమెంట్‌, రసాయనాలు, వీఎస్‌ఎఫ్‌(విస్కోస్‌ స్టేపుల్‌ ఫైబర్‌-దుస్తుల తయారీలో ఉపయోగించే ఒక రకమైన ఫైబర్‌) విభాగాల్లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌లోనే అతిపెద్దదైన అల్ట్రాటెక్‌ సిమెంట్‌లో గ్రాసిమ్‌​ ఇండస్ట్రీస్‌కు 60.2 శాతం వాటా ఉంది. వీఎస్‌ఎఫ్‌ విభాగం అమ్మకాలు ఈ క్యూ1లో 3.5 శాతం పెరిగాయి. ఉత్పత్తి సంబంధిత సమస్యల కారణంగా  ప్రస్తుత ఆర్థిక సంవత్సరలో ఈ విభాగం అమ్మకాలు 4 శాతమే పెరగగలవని భావిస్తున్నాం. అంతర్జాతీయంగా సరఫరాలు అధికంగా ఉండటంతో ధరల్లో పెద్దగా పురోగతి ఉండకపోవచ్చు. అయితే కాస్టిక్‌ సోడా, కర్ర గుజ్జు ధరలు తక్కువగా ఉండటం కంపెనీకి కలసివచ్చే అంశం. రెండేళ్లలో ఉత్పత్తి సామర్థ్యం 38 శాతం మేర పెరగనుండటం కూడా సానుకూలాంశమే. విలువాధారిత ఉత్పత్తులను పెంచుతోంది. భారత్‌లో వీఎస్‌ఎఫ్‌ విభాగంలో ఈ కంపెనీదే గుత్తాధిపత్యం. ఫలితంగా అంతర్జాతీయంగా ధరల ఒడుదుడుకులను ఈ కంపెనీ తట్టుకోగలదు. ఇక కెమికల్స్‌ విభాగం ఉత్పత్తి సామర్ధ్యాన్ని కూడా రెండేళ్లలో 27 శాతం మేర పెంచుకోనున్నది. దీంతో ఈ విభాగంలో ఈ కంపెనీ అగ్రస్థానం కొనసాగవచ్చు. సిమెంట్‌కు దీర్ఘకాలంలో డిమాండ్‌ నిలకడగానే కొనసాగుతుందన్న అంచనాలున్నాయి. మధ్యకాలానికి ఆర్థిక సేవల విభాగం వ్యాపారం కూడా నిలకడైన వృద్ధిని సాధించగలదని భావిస్తున్నాం. ఇతర గ్రూప్‌ కంపెనీలైన వొడాఫోన్‌ ఐడియాలో ఇటీవలే రూ.2,900 కోట్లు పెట్టుబడులు పెట్టింది.. ఆదిత్య బి‍‍ర్లా క్యాపిటల్‌ లిమిటెడ్‌(ఏబీసీఎల్‌)లో కూడా పెట్టుబడులు పెట్టనున్నది. ఈ పెట్టుబడులు.. సమీప కాలంలో షేర్‌ ధరపై ఒకింత ప్రతికూల ప్రభావం చూపించవచ్చు.  


అల్ట్రాటెక్‌ సిమెంట్‌         కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ.4,207
టార్గెట్‌ ధర: రూ.5,350

ఎందుకంటే: మార్జిన్లు ఆరోగ్యకరంగా ఉండటం, లాభదాయకతలో మంచి వృద్ధి కారణంగా రియలైజేషన్‌ ఒక్కో టన్నుకు 14 శాతం వృద్ధితో రూ.5,484కు పెరిగింది. అయితే పశ్చిమ బెంగాల్‌, ఆంధ్ర, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఇసుక సంబంధిత సమస్యలు, సాధారణ ఎన్నికలు, మౌలిక ప్రాజెక్టుల్లో మందగమనం తదితర కారణాల వల్ల అమ్మకాలు 2 శాతమే పెరిగి 17.9 మిలియన్‌ టన్నులకు చేరాయి. ధరల స్వల్ప పెంపు, ఉత్పత్తి వ్యయాలు నియంత్రణలోనే ఉండటంతో నిర్వహణ లాభ మార్జిన్‌ 8 శాతం పెరిగి 26 శాతానికి ఎగసింది. నిర్వహణ లాభం ఒక్కో టన్నుకు రూ.1,428కు పెరిగింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక నిర్వహణ లాభం. వివిధ కంపెనీల నుంచి కొనుగోలు చేసిన ప్లాంట్లు పూర్తి స్థాయిలో స్ట్రీమ్‌లైన్‌ కావడంతో కంపెనీ రుణ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలపై దృష్టి పెట్టింది. ​కీలకం కాని ఆస్తుల విక్రయం,  ఫ్రీ క్యాష్‌ ఫ్లోస్‌ వినియోగం ద్వారా రుణ భారం తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్యూ1లో రూ.1,022 కోట్ల రుణాలను తీర్చేసింది. నిర్వహణ లాభానికి రెండు రెట్లకు మించి రుణభారం ఉండకూడదనేది కంపెనీ లక్ష్యం. లిక్విడిటీ సమస్యలు, వర్షాలు అంతంతమాత్రంగానే ఉండటంతో సమీప భవిష్యత్తులో సిమెంట్‌ డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం ఉండొచ్చు. అయితే ప్రభుత్వ మౌలిక రంగ ప్రాజెక్ట్‌లు పుంజుకునే అవకాశాలు ఉండటంతో ఆర్నెల్లలో డిమాండ్‌ సాధారణ స్థాయికి రావచ్చు. సెంచురీ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన ప్లాంట్ల పూర్తి స్థాయి విలీనం ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో పూర్తవుతుంది. జేపీ అసోసియేట్స్‌ నుంచి కొనుగోలు చేసిన ప్లాంట్లు ఈ క్యూ1లోనే బ్రేక్‌ఈవెన్‌ సాధించాయి. తక్కువ బరువున్న సిమెంట్‌ క్యారియర్ల తయారీ కోసం హిందాల్కోతో కలసి ప్రయత్నాలు చేస్తోంది. ఫలితంగా రవాణా వ్యయాలు తగ్గుతాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,000 కోట్ల మేర పెట్టుబడులు పెడుతోంది. You may be interested

అమ్ముడుపోని 4 లక్షల ఫ్లాట్లు

Monday 19th August 2019

9 పట్టణాల్లో అందుబాటు ధరల గృహాల పరిస్థితి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 9 పట్టణాల్లో రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్ల వద్ద అమ్ముడుకాని అందుబాటు ధరల ఫ్లాట్లు 4.12 లక్షలు ఉన్నట్టు ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ తెలిపింది. ఇవన్నీ కూడా రూ.45 లక్షల ధరల్లోపువేనని పేర్కొంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్‌లో గృహ రుణాల వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచినందున, ఈ

ఎక్స్‌పెన్స్‌ రేషియో అధికం... ఇన్వెస్ట్‌ చేయాలా ? వద్దా ?

Monday 19th August 2019

(ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌) ప్ర: పరాగ్‌ పరీక్‌ లాంగ్‌ టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌ కాకుండా అంతర్జాతీయంగా షేర్లలో ఇన్వెస్ట్‌ చేసే ఫండ్స్‌ ఇంకా ఏమైనా ఉన్నాయా ?  అసలు మన ఫండ్స్‌కు విదేశీ షేర్లలో ఇన్వెస్ట్‌ చేసే అవకాశం, అనుమతులు ఉన్నాయా ? విదేశీ షేర్లలో ఇన్వెస్ట్‌ చేసే ఫండ్స్‌కు సంబంధించి పన్ను నియమాలు ఎలా ఉంటాయి? ఈ పరాగ్‌ ఫండ్‌కు సంబంధించిన డైరెక్ట్‌ ప్లాన్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో

Most from this category