News


ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగ షేర్లే మంచి చాయిస్‌!

Monday 12th August 2019
Markets_main1565601520.png-27716

‘ప్రస్తుత పరిస్థితులలో ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌), ఐటీ సెక్టార్‌ షేర్లు మిగిలిన రంగాల షేర్ల కంటే ఆకర్షిణియంగా ఉన్నాయి. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సెక్టార్లో కొన్ని సెలక్టివ్‌ స్టాకులను ఎంచుకోవడం మంచిదే’ అని రిలిగేర్‌ బ్రోకింగ్‌ రిసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, అజిత్‌ మిశ్రా ఓ ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..

మార్కెట్ల బౌన్‌బ్యాక్‌కు పరిమితి..
ఆర్‌బీఐ రేట్ల కోత కాకుండా ప్రభుత్వం ఆర్థిక చర్యలను తీసుకుంటుందనే వార్తలు మీడియాలో వస్తుండడంతో మార్కెట్లు తిరిగి బౌన్స్‌ బ్యాక్‌ అయ్యాయి. ప్రభు‍త్వం, సూపర్‌ రిచ్‌ సర్‌చార్జీ నుంచి ఎఫ్‌పీఐలకు మినహాయింపునిచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆటో సెక్టార్‌ ఉపశమన చర్యలను, ఎన్‌బీఎఫ్‌సీ లిక్విడిటీ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉండడంతో నిఫ్టీ గత వారం 11,100 స్థాయిని అధిగమించింది. కార్పోరేట్‌ ఆదాయాల సీజన్‌ చివర్లో ఉండడంతో ఇకా అంతర్జాతీయ పరిణామాలు, యుఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌, యుఎస్‌-ఇరాన్‌ ఒత్తిళ్లు, డాలర్‌ మారకంలో రూపీ కదలికలపై మదుపర్ల దృష్ఠి మారే అవకాశం ఉంటుంది. వీటితో పాటు వివిధ స్టాకు హోల్డర్లతో ఆర్థిక మంత్రి మీటింగ్‌ ఫలితాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. నిఫ్టీ 11,250-11,300 స్థాయి వద్ద నిఫ్టీ నిరోధం ఎదుర్కోవచ్చు. దిగువన 10,950-11,000 స్థాయి వద్ద తక్షణ మద్ధతు లభించనుంది. ఎఫ్‌పీఐలపై సర్‌చార్జీని తొలగించడం, సెప్టెంబర్‌ నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులలో రీక్యాపిటలైజేషన్‌ చర్యలను మొదలు పెట్టడం వంటి చర్యలు మార్కెట్‌ ర్యాలీకి సహకరించేవే. కానీ ఈ ర్యాలీ స్వల్పకాలానికే అనే విషయాన్ని గమనించాలి. ఆర్థిక వ్యవస్థ మందగమనం, తగ్గిన వినియోగం వంటి అంశాలు మార్కెట్లను ఇంకా వెంటాడుతున్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటు చాలా వరకు కార్పోరేట్‌ ఆదాయాలు తగ్గాయి. ఆదాయాల పరంగా ఏమైనా అర్థవంతమైన చర్యలుంటే తప్ప మార్కెట్లు తిరిగి స్థిరంగా కదలాడే అవకాశం లేదు.

రూపీ మరింత బలహీనం..
అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో పాటు, అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లు, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉండడంతో రూపీ డాలర్‌ మారకంలో భారీగా బలహీనపడింది. అంతేకాకుండా చైనా తన కరెన్సీ యువాన్‌ విలువను తగ్గించుకోవడంతో అంతర్జాతీయంగా అనేక దేశాలు కరెన్సీలు కూడా బలహీనపడ్డాయి. ప్రస్తుత పరిస్థితులలో రూపీ డాలర్‌ మారకంలో 71 వద్ద మధ్దతు తక్కువగా ఉండడంతో రూపీ మరింత బలహీనపడే అవకాశం ఉంది. రూపీ ఈ స్థాయిని కోల్పోయి 71.50-71.80 వైపు కదిలే అవకాశం ఉంది.

ఇండియా మార్కెట్లు అనిశ్చితిలో..
ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడంతో పాటు, కార్పోరేట్‌ ఆదాయాల వృద్ధి తగ్గడం, యుఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌ తిరిగి పెరగడంతో ఇండియా మార్కట్లలో అనిశ్చితి కొనసాగే అవకాశం ఉంది. మేం దేశియ మార్కెట్లపై జాగ్రత్తను వహించనున్నాం.  ప్రస్తుత పరిస్థితులలో నాణ్యమైన స్టాకులను ఎంచుకోవడం మంచిది. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగ స్టాకులు ఈ సమయంలో ఆకర్షణీయంగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సెక్టార్‌లోని సెలక్టివ్‌ స్టాకులను పరిశీలించవచ్చు. 

ఈక్విటీ ఫండ్స్‌లోకి నగదు ప్రవాహాం..
జూన్‌ నెలలో క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌ నుంచి రికార్డు స్థాయిలో రూ. 2,695 కోట్ల ఔట్‌ ఫ్లో జరిగిందని ఏఎంఎఫ్‌ఐ డేటా పేర్కొంది. అదే విధంగా జులై నెలలో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ. 8,092 కోట్లు ఇన్‌ఫ్లో జరిగింది. ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం వలన క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌ నుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. మరోవైపు ఎస్‌ఐపీ(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)/దీర్ఘకాల పెట్టుబడుల ద్వారా ఈక్విటీ మార్కెట్లలోకి పెట్టుబడులు పెరిగాయి. ముందుకెళ్లే కొద్ది కార్పోరేట్‌ ఆదాయాల వృద్ధి పుంజుకోవడంతో పాటు రుతుపవనాలు తిరిగి సాధారణ స్థాయికి చేరుకోవడంతో ఈక్విటీ మార్కెట్లలోకి ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉంది.You may be interested

సెప్టెంబర్‌5 నుంచి జియో ఫైబర్‌ సేవలు

Monday 12th August 2019

జియో ఫైబర్‌ సేవలు సెప్టెంబర్‌ 5 నుంచి అందుబాటులోకి రానున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముఖేష్‌ అంబానీ తెలిపారు. మంగళవారం జరిగిన రిలయన్స్‌ 42వ ఏజీఎం సమావేశంలో ముఖేష్‌ మాట్లాడుతూ ‘‘అమెరికా లాంటి అభివృద్ధి చెందని దేశంలో ఇంటర్నెట్ సగటు వేగం 90ఎంబీపీపీస్‌గా ఉంది. ఇప్పుడు జియో ప్రవేశపెట్టే జియో ఫైబర్‌ పథకంలో ఇంటర్నెట్ సగటు వేగం 100 ఎంబీపీపీస్‌లు ఉంటుంది. ఈ వేగాన్ని 1000ఎంబీపీపీస్‌ పెంచుకునేందుకు మాకు ప్రణాళికలున్నాయి.

బుల్‌కాల్‌ స్ప్రెడ్‌ వ్యూహం బెటరు

Monday 12th August 2019

నిపుణుల సూచన నిఫ్టీ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. గతవారం నిఫ్టీ 11100 పాయింట్ల పైన క్లోజయింది. వీఐఎక్స్‌ 19.4 స్థాయి నుంచి 16.25 స్థాయికి దిగివచ్చింది. నిఫ్టీ ప్రస్తుతం పరిమిత శ్రేణి పైఅవధి వద్ద కదలాడుతోంది. ఈ వారం మార్కెట్‌ ట్రేడింగ్‌ దినాలు తక్కువ కావడంతో స్వల్పకాలిక కదలికలే ఉండొచ్చని నిపుణుల అంచనా. వీక్లీ నిఫ్టీ ఆప్షన్స్‌ పరిశీలిస్తే 11000 పాయింట్ల వద్ద పుట్స్‌, 11200, 11300 పాయింట్ల వద్ద కాల్స్‌

Most from this category