STOCKS

News


సరైన ధర వద్దే నిధుల సమీకరణ: యస్‌బ్యాంకు

Friday 4th October 2019
Markets_main1570130042.png-28702

నిధుల సమీకరణ యస్‌ బ్యాంకు ముందున్న ప్రథమ ప్రాధాన్యంగా బ్యాంకు ఎండీ, సీఈవో రవనీత్‌ గిల్‌ తెలిపారు. ఏదో ఒక ధర వద్ద కాకుండా, బ్యాంకుకు ప్రయోజనదాయకమైన ధర వద్దే నిధులను సమీకరిస్తామని చెప్పారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. 

 

నిధుల సమీకరణ ప్రణాళికల గురించి...
నిధులను సమీకరించే సామర్థ్యం యస్‌ బ్యాంకుకు 100 శాతం ఉంది. అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్‌, కొన్ని దేశీయ కుటుంబ సంస్థలు, వ్యూహాత్మక ఇన్వెస్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నాం. 

 

ప్రస్తుత షేరు ధర సహేతుకమేనని భావిస్తున్నారా..?
యస్‌ బ్యాంకు స్టాక్‌ పుస్తక విలువ ఎంతన్నది మనందరికీ తెలుసు. కొన్ని మీడియా, రీసెర్చ్‌ సంస్థలు మా స్ట్రెస్‌ బుక్‌ (ఒత్తిడిలోని రుణాలు) ఎంతన్న దానిపై అంచనాలు వేసే పనిలో ఉన్నాయి. కానీ, వీటిల్లో చాలా అంచనాలు వాస్తవానికి తప్పు అని చెప్పదలుచుకున్నా. ప్రజల విశ్వాసంతో కూడిన ఓ సంస్థ గురించి ఇంత తేలిగ్గా, ప్రభావం చూపించే విధంగా వార్తలు రాస్తున్నందుకు బాధగా ఉంది. బ్యాంకు గురించి అనలిస్టులు, ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. భవిష్యత్తుకు సమాయత్తంగా ఉన్న బ్యాంకులు భవిష్యత్తును ఆలింగనం చేసుకుని, వేగంగా ముందుకు వెళ్లగలవు. గత త్రైమాసికంలో (సెప్టెంబర్‌ క్వార్టర్‌) 1,80,000 క్లయింట్లను కొత్తగా సంపాదించాం. ఇ‍ప్పటి వరకు చూసుకుంటే ఇదే అత్యధికం. నూతన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విషయంలో త్రైమాసికం వారీగా 39 శాతం పెరిగాయి. చాలా బ్యాంకుల కాసా క్షీణిస్తున్న పరిస్థితుల్లో... మా కాసా క్వార్టర్‌ తర్వాత క్వార్టర్‌ 30.2 శాతం నుంచి 30.8 శాతానికి పెరిగింది. యస్‌ బ్యాంకు పట్ల ఉన్న నమ్మకం చెక్కు చెదరలేదు. కనుక యస్‌ బ్యాంకు షేరు సరైన ధర ఎంతన్నది నేను కాదు చెప్పాల్సింది. అయితే ప్రస్తుత ధర మాత్రం కనీసం మా ఫ్రాంచైజీ విలువ స్థాయిని కూడా ప్రతిఫలించడం లేదు.

 

లోగడ రూ.80కు పైన నిధులు సమీకరణ చేశారు. ఈ ధర కంటే తక్కువలో నిధులు సమీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా? షేరు ధర స్థిరపడే వరకు ఆగుతారా..?
ఏ ధర వద్ద అయినా సరే మేము నిధుల సమీకరణ చేయబోము. మరో విషయం మా స్వీయ నిధుల సామర్థ్యం ఏంటో గత రెండు త్రైమాసికాల్లో చూపించాం. మా బ్యాలన్స్‌ షీటు ప్రకారం దండిగా మిగులు నిధులు ఉన్నాయి. నిధుల సమీకరణకు సరైన ధర అనుకునే వరకు స్వీయంగా నిధులను సర్దుబాటు చేసుకోగలం. You may be interested

ఐఆర్‌సీటీసీ ఐపీఓ... అదుర్స్‌ !

Friday 4th October 2019

112 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన ఐపీఓ  జారీ చేసేది 2 కోట్ల షేర్లు దరఖాస్తులు వచ్చింది 225 కోట్ల షేర్లకు  ఈ నెల 14న స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ రూ.150-200 రేంజ్‌లో లిస్టింగ్‌ లాభాలు  న్యూఢిల్లీ: ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ) సూపర్‌ హిట్‌ అయింది. గురువారం ముగిసిన ఈ ఐపీఓ 112 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ కావడం విశేషం. మందగమనం ఉన్నప్పటికీ, కంపెనీ పై భవిష్యత్తు అంచనాలు

లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ ర్యాలీ ఇప్పుడే మొదలైంది..!

Friday 4th October 2019

బీఎస్‌ఈ 100లోని స్టాక్స్‌లో నాలుగింట మూడొంతులు సెప్టెంబర్‌లో పెరిగాయి. వరుసగా మూడు నెలల నష్టాలకు గత నెలలో తెరపడింది. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు దలాస్‌ స్ట్రీట్‌లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మెరుగుపరిచిందనడంలో సందేహం లేదు. ఎక్కువగా షార్ట్‌ కవరింగ్‌ జరిగింది. బీఎస్‌ఈ100లోని 22 స్టాక్స్‌ డబుల్‌ డిజిట్‌ స్థాయిలో పెరిగాయి. బీపీసీఎల్‌, సీమెన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండియన్‌ ఆయిల్‌, టీవీఎస్‌ మోటార్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌ అధికంగా పెరిగిన వాటిల్లో

Most from this category