News


పెద్ద కార్పొరేట్‌ బ్యాంకులకే మా ప్రాధాన్యం!

Monday 28th October 2019
Markets_main1572238318.png-29176

 ‘ఇప్పటి వరకు మూడు కార్పొరేట్‌ బ్యాంకులు వాటి త్రైమాసికపు ఫలితాలను ప్రకటించాయి. ఒత్తిడిలో ఉన్న ఆస్తుల నుంచి బయటపడుతున్నట్లు, ఇక్కడి నుంచి పరిస్థితులు సాధరణ స్థాయికి వస్తాయనే అభయాన్ని ఈ ఫలితాలు ఇస్తున్నాయి. అంతేకాకుండా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లిక్విడిటీ లభ్యత పెరిగిందనే విషయం ఈ ఫలితాల ద్వారా తెలుస్తోంది. గత ఏడాదితో పొలిస్తే వచ్చే ఏడాది బాగుంటుందని ఆశిస్తున్నా’ అని అబాకస్‌ అసెట్‌ మానేజర్‌, వ్యవస్థాపకుడు, సునిల్‌ సింఘానియా ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు.  వచ్చే ఏడాది కాలానికి కూడా తాము పెద్ద కార్పోరేట్‌ బ్యాంకులకే ప్రాధాన్యాన్ని ఇస్తున్నామని తెలిపారు. ‘ ఈ పెద్ద కార్పోరేట్‌ బ్యాంకుల త్రైమాసిక ఫలితాలను గమనిస్తే, ఈ బ్యాంకుల ఆపరేటింగ్‌ లాభం ప్రోవిజన్లకు ముందు 18-20 శాతం పెరిగింది. అంతేకాకుండా ఈ బ్యాంకుల ప్రొవిజన్లు కూడా గణనీయంగా తగ్గాయి. ముందుకెళ్లే కొద్ది ఈ ట్రెండ్‌ కొనసాగుతుందని అంచనావేస్తున్నా. ప్రస్తుతం ఈ బ్యాంకుల ఆర్‌ఓఈ(ఈక్విటీలపై రిటర్న్‌), పీబీ నిష్పత్తి(ప్రైస్‌ టూ బుక్‌ వాల్యు రేషియో) లను గమనిస్తే, ఈ స్టాకుల వాల్యుషన్‌ ఆకర్షిస్తోంది’ అని  వివరించారు. ‘అంతేకాకుండా కొన్ని బ్యాంకులకు జనరల్‌ ఇన్సురెన్స్‌, లైఫ్‌ ఇన్సురెన్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటి అనుబంధ సంస్థలుండడం వలన వీటి విలువ మరింత పెరుగుతోంది. అందువలన పెద్ద కార్పోరేట్‌ బ్యాంకులపై మా ప్రాధాన్యాన్ని కలిగివున్నాం’ అని తెలిపారు. 
గమనింయాల్సిన ఇతర రంగాలేంటి?
 వ్యవస్థలో వడ్డీ రేట్లు సరళతరమవ్వాలని కోరుకుంటున్నా. ప్రభుత్వం జారీ చేసే 10 ఏళ్ల సెక్యురిటీ బాండ్లపై వడ్డీ రేటు 6.5 శాతంగా ఉంది. ఏఏఏ రేటింగ్‌ ఉన్న బాండ్లపై ఇది 8-9 శాతం వరకు ఉంది. వడ్డీ రేట్ల స్థాయి ఇండియాలోనే అధికంగా ఉం‍ది. వచ్చే 5-7 ఏళ్ల కాలంలో వడ్డీ రేట్లను కార్పొరేట్‌ పరంగా, వినియోగదారుల పరంగా తగ్గింపు ఉంటుందని ఆశిస్తున్నా. వడ్డీ రేట్లు తగ్గితే రియల్‌ ఎస్టేట్‌ అధికంగా లాభపడుతుంది. అంతేకాకుండా  తక్కువ వడ్డీరేట్లు వంటి అంశాల వలన హార్డ్ అసెట్‌ విభాగంలోని మెటల్స్‌, సిమెంట్, కాగితం, సరళ ఇంజనీరింగ్ కంపెనీల స్టాకులు మంచి ప్రదర్శన చేసే అవకాశం ఉంది.You may be interested

ఫెడ్‌ పాలసీ నిర్ణయం, కార్పొరేట్‌ ఫలితాలే కీలకం..!

Monday 28th October 2019

ఇన్ఫోసిస్‌ వివాదం, బ్రెగ్జిట్‌ ఆందోళనలు, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు, టెలికాం ఏజీఆర్‌పై సుప్రీం కోర్టు తీర్పు, కంపెనీల క్యూ2 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను నిరుత్సాహపరచడంతో గతవారం స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. అయితే, క్యూ2లో బ్యాంకుల ఆస్తుల నాణ్యత పెరగడంతో ఆయా బ్యాంకుల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడటం, అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు దిగిరావడం లాంటి సానుకూలాంశాలు మార్కెట్‌కు కొంత మద్దతుగా నిలిచాయి. దీపావళి సందర్భంగా

ఐసీఐసీఐ బ్యాంకుపై బుల్లిష్‌!

Monday 28th October 2019

సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం ఐసీఐసీఐ బ్యాంకుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా మారాయి. క్యు2లో బ్యాంకు అనేక అంశాల్లో పాజిటివ్‌ గణాంకాలు నమోదు చేసింది. దీంతో బ్యాంకు షేరు టార్గెట్‌ను సైతం బ్రోకరేజ్‌లు పెంచాయి. క్యు2లో బ్యాంకు రూ. 655 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఒకదఫా చెల్లించాల్సిన పన్ను మొత్తం కారణంగా లాభం తగ్గిందని, ఈ పన్ను లేకుంటే లాభం రూ. 3575 కోట్లుండేదని బ్యాంకు పేర్కొంది.  - ఎమ్‌కే గ్లోబల్‌:

Most from this category