News


బాటమ్‌ ఔట్‌కు ఇంకో 2-3 నెలలు పడుతుంది

Wednesday 21st August 2019
Markets_main1566384520.png-27924

మార్కెట్‌ బాటమ్‌ ఔట్‌ కావడానికి ఇంకో రెండు,మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని క్వాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, సందీప్ టాండన్ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే...
 

అసాధరణంగా పెరిగిన షార్ట్‌ పొజిషన్‌లు..
విస్తృత మార్కెట్ దృక్పథంలో పరిశీలిస్తే..కొంత మొత్తంలో అసాధారణమైన షార్ట్‌పొజిషన్‌లు గమనించవచ్చు. రిలయన్స్‌ ర్యాలీ చేయడం చూశాం. అదేవిధంగా కొన్ని ఆటో షేర్లు కూడా. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్‌లలో ఐదేళ్ళలో అత్యధిక షార్ట్‌ పొజిషన్‌లు జరిగాయి. కొన్ని స్టాక్స్ బాటమ్‌ ఔట్‌ అవ్వడం మొదలు పెట్టాయి. సాధారణంగా విస్తృత దృక్పథంలో మార్కెట్‌లో ఇంకా పతనం మిగిలి ఉంది. మొత్తం మార్కెట్‌ ఇంకో 15 శాతం నుంచి 20 శాతం పతనమవుతుందని జనరలైజ్‌ చేయడం కంటే నిర్ధిష్ట స్టాక్‌ల దిద్దుబాటును గమనించడం మంచిది.

సాంకేతికంగా చెప్పాలంటే మార్కెట్‌ డౌన్‌ ట్రెండ్‌...
మార్కెట్‌ డౌన్‌ ట్రెండ్‌ గల కారణాలను వెతకడానికి మేము ప్రాథమిక విషయాలను దాటి కూడా అలోచించాం. మేము చేప్పే ముఖ్యమైన అంశాలు రెండు విధానాలపై ఆధారపడి ఉన్నాయి. అవి ఒకటి రిస్క్‌ ఎపటైట్‌ విశ్లేషణకాగా రెండవది లిక్విడిటీ డేటా (అంతర్జాతీయ అంశాలను పరిగణలోకి తీసుకొని). మొదట రిస్క్‌ ఎపటైట్‌ను పరిశీలిస్తే..ఇండియాలో రిస్క్‌ ఎపటైట్‌ సూచీ 2018 జనవరిలో గరిష్ఠ స్థాయికి చేరి అక్కడి నుంచి తగ్గుతూ వస్తుంది. (ఈ రిస్క్‌ ఎపటైట్‌కు, ఆర్థిక మందగమనానికి సంబంధం ఉంది. రిస్క్‌ ఎపటైట్‌ అధికంగా ఉంటే ఆర్థిక మాంద్యానికి పునాదులు పడుతున్నాయని విశ్లేషకుల అంచనా). కాగా గత నెల నుంచి గమనిస్తే రిస్క్‌ ఎపటైట్‌ ఇంకా బాటమ్డ్‌ ఔట్‌ కాలేదనే విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌లు అధికంగా రిస్క్‌ ఎపటైట్‌, లిక్విడిటీపై ఆధారపడడం వలన రిస్క్‌ ఎపటైట్‌ ఇండికేటర్‌తో ఈ క్యాప్‌లు లింక్‌ అయి ఉంటాయి. మరోవైపు లిక్విడిటీ. ఇండియాలో లిక్విడిటీ 2018లో గరిష్ఠ స్థాయిని చేరుకొని అప్పటి నుంచి తగ్గుతూ వస్తుంది.
 అంతర్జాతీయంగా కూడా రిస్క్‌ ఎపటైట్‌ జనవరిలో గరిష్ఠ స్థాయిలను చేరుకొని అక్కడి నుంచి తగ్గుతూ వస్తుంది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే లిక్విడిటీ పారమీటర్‌ 2007లో బాటమ్‌ ఔట్‌ కావడమే. గ్లోబల్ లిక్విడిటీ అనలిటిక్స్ ఆధారంగా పరిశీలిస్తే..అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్‌లో వృద్ధి కనిపిస్తోంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో (ఈఎం) పోలిస్తే, ఉద్దీపన లిక్విడిటీతో పాటు ప్రైవేటు రంగ లిక్విడిటీ, అభివృద్ధి చెందిన మార్కెట్‌లలో పెరుగుతున్నాయని నమ్ముతున్నాము. కాగా ఈఎం మార్కెట్‌లలో లిక్విడిటీ ఇప్పటికీ సాప్ట్‌గా ఉండడం చూడవచ్చు. 
     మొత్తంగా రిస్క్‌ ఎపటైట్‌, లిక్విడిటీ గరిష్ఠ స్థాయిని చేరుకున్నప్పుడు మార్కెట్‌ కూడా గరిష్ఠ స్థాయిని చేరుకుంటుంది. అదే విధంగా రిస్క్‌ ఎపటైట్‌, లిక్విడిటీ బాటమ్‌ ఔట్‌ అయితే మార్కెట్‌ కూడా బాటమ్‌ ఔట్‌ అవుతుంది. ఇండియాలో లిక్విడిటీ తగ్గడం గత ఏడాది జులై నుంచి ప్రారంభమైంది. రిస్క్‌ ఎపటైట్‌ కూడా ఇంకా బాటమ్‌ ఔట్‌ కాలేదు. కాబట్టి దీనిని నుంచి స్పష్టంగా అర్థమయ్యే విషయమేంటంటే స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌లలో ఇంకా పతనం మిగిలి ఉంది. మనం బాటమ్‌కి దగ్గర్లో ఉన్నాం. ఇంకా రెండు నుంచి మూడు నెలలో మార్కెట్‌ బాటమ్‌ ఔట్‌ అయ్యే అవకాశం ఉంది.

ఉద్దీపన ప్యాకేజీ.. స్వల్పకాలానికే
ప్రభుత్వం నుంచి వచ్చే ఉద్దీపన ప్యాకేజిపై మార్కెట్‌ చాలా అంచనాలను పెట్టుకుంది. ఒక వేళ ఉద్దీపన ప్యాకేజి వచ్చినప్పటికి అది స్వల్ప కాలం మాత్రమే మార్కెట్‌కు మద్ధతుగా ఉండగలదు. మా దృక్పథం ప్రకారం మధ్యస్థ కాలానికి గాను మార్కెట్‌లో ఇంకా పతనం మిగిలి ఉంది. అంతర్జాతీయంగా జరిగిన ఉద్దీపనలను విశ్లేషిస్తే..ఈ అంశాన్ని రెండు విభాగాలుగా విడదీయవచ్చు. మొదటిది ఉద్దీపన లిక్విడిటీ..ఇది ఏప్రిల్‌ 2019 నుంచి పెరగగా, ఇంకా పెరిగే అవకాశం ఉంది. భారతీయ పభుత్వం కూడా ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తే అందులో ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ ట్రెండ్‌ కొనసాగుతుంది. అంతర్జాతీయంగా లిక్విడిటీ మరింతగా మెరుగు పడుతుందని మేము అంచనావేస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న(ఈఎం) మార్కెట్లు బాటమ్‌ ఔట్‌ కాడానికి ఇంకో రెండు, మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. ఈఎం మార్కెట్లన్నింటిలో బ్రెజిల్‌ మార్కెట్‌లో రిస్క్‌ ఎపటైట్‌, లిక్విడిటీ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నాయి. మిగిలిన ఈఎంలు భారీగా పడిపోయాయి.

ఈ స్టాక్స్‌ను పరిశీలించండి..
 ఇన్సురెన్స్‌ విభాగంలో లైఫ్‌ ఇన్సురెన్స్‌, జనరల్‌ ఇన్సురెన్స్‌ స్టాక్స్‌ గత ఆరు నెలలు లేదా గత త్రైమాసికం నుంచి వృద్ధి చెందడం చూశాం. మూడు, ఐదు, పదేళ్ల లో ఈ విభాగంలో వృద్ధి బాగుంటుందని  కొన్ని ఆస్తి నిర్వహణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కాబట్టి ప్రైవేటు రంగ బ్యాంకులతో పోల్చితే ఇన్సురెన్స్‌ సెక్టార్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఉత్తమమే. దీనితో పాటు సిమెంట్, మెటల్‌ సెక్టార్లో కొన్ని స్టాక్స్, 2-3 నెలలకు గాను పరిశీలించవచ్చు. కొన్ని చమురు మార్కెటింగ్ సంస్థలను చూస్తే, ప్రపంచంలోని పవర్ గ్రిడ్ లేదా ఎన్‌టీపీసీలు, పరిశీలించవచ్చు. ఇవి బాటమ్‌ఔట్‌కి దగ్గరగా ఉన్నాయి.You may be interested

డిస్కౌంట్‌లో 12 స్టాకులు .. కొనవచ్చా..?

Wednesday 21st August 2019

ఇటీవల బెంచ్‌మార్క్‌ సూచీలు దిద్దుబాటుకు లోనైనప్పటికీ.., వాటి చరిత్రాత్మక యావరేజ్‌ స్థాయిల వద్ద కొద్ది ప్రీమియంతో ట్రేడ్‌ అవుతున్నాయి. అయితే సూచీల చారిత్రాత్మక యావేరేజ్‌లో పోలిస్తే చాలా షేర్లు ఆకర్షణీయమైన వాల్యూవేషన్‌ వద్ద దొరుకుతున్నాయి. నిఫ్టీ-50లోని 12 కంపెనీల షేర్లు వాటి ఐదేళ్ల పీఈ యావరేజ్‌ పోలిస్తే డిస్కౌంట్‌తో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇలా ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉన్న స్టాకుల్లో సన్‌ఫార్మా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ,

మందగమన ఆందోళనతో నష్టాల ముగింపు

Wednesday 21st August 2019

వృద్ధి మందగమన ఆందోళనతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్‌ రెండోరోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 267.64 పాయింట్లు నష్టపోయి 37,060.37 వద్ద, నిఫ్టీ 98.30 పాయింట్లు పతనమైన 10,918.70 వద్ద స్థిరపడ్డాయి. మిడ్‌సెషన్‌ వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు క్యూ1లో జీడీపీ వృద్ధి క్షీణించవచ్చనే అంచనాలతో మార్కెట్లో అమ్మకాలు తీవ్రతరమయ్యాయి. క్యూ1లో పెట్టుబడులు క్షీణించడం, సేవారంగం ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, వినియోగం

Most from this category