News


బడ్జెట్‌కు సేఫ్‌ బెట్స్‌

Saturday 25th January 2020
Markets_main1579891319.png-31179

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. దీనిపై చాలా వర్గాల్లో ఎన్నో అంచనాలు, ఆకాంక్షలు ఉన్నాయి. దేశ జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతానికి తగ్గిపోయిన సమయంలో వస్తున్నందున ఈ బడ్జెట్‌కు ఎక్కువ ప్రాధాన్యమే ఉంది. ఈ సమయంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారికి బీమా కంపెనీలు సురక్షితమైనవిగా ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌కు చెందిన సుదీప్‌ బందోపాధ్యాయ సూచించారు. వివిధ రంగాలపై తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థకు తెలియజేశారిలా..

 

ఐటీ రంగం..
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగం అద్భుతంగా ఉంది. ఇన్ఫోసిస్‌ ఫలితాలు బాగున్నాయి. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ మధ్యనున్న వ్యాల్యూషన్ల అంతరం ఇక్కడ నుంచి గణనీయంగా తగ్గిపోతుంది. ఐటీ మిడ్‌క్యాప్‌లో జెన్సార్‌ ఫలితాలు నిరాశపరిచాయి. ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ ఫలితాలు ఎంతో ఉత్సాహంగా ఉన్నాయి. ఆదాయ వృద్ధి పరంగా సమస్యలు ఉన్నప్పటికీ.. తగినన్ని డీల్స్‌ను సొంతం చేసుకోవడం ద్వారా కంపెనీ చక్కని ఆదాయ వృద్ధిని నమోదు చేయగలదు. భవిష్యత్తును వారు నిర్మిస్తున్నారు. మిడ్‌క్యాప్‌ ఐటీలో ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ను మేము ఇష్టపడుతున్నాం. అలాగే, ఇన్ఫోసిస్‌, మైండ్‌ట్రీని కూడా. పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ కూడా చూడ్డానికి బాగుంది. మొత్తం మీద ఐటీ రంగం సురక్షితమైనది. రూ.100 ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే రూ.20-30ను ఐటీ రంగంలో లార్జ్‌, మిడ్‌క్యాప్‌ కంపెనీల కలయికగా ఇన్వెస్ట్‌ చేసుకోవాలి.

 

బీమా రంగం..
బడ్జెట్‌లో ఏమీ ప్రకటించకపోయినా, జీవిత బీమా కంపెనీల నుంచి ఇన్వెస్టర్లు లాభపడొచ్చు. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ చూడ్డానికి అద్భుతంగా కనిపిస్తోంది. బీమా ఉత్పత్తుల్లో పెట్టుబడులకు ప్రత్యేక విభాగం కేటాయించొచ్చన్న అంచనాలున్నాయి. అది జరిగితే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వంటి కంపెనీలకు చాలా సానుకూలం అవుతుంది. ఒకవేళ ఇది జరగకపోయినా కానీ, ఏడాది కాలానికి పైగా ఇన్వెస్ట్‌ చేసే వారికి ప్రస్తుత స్థాయి నుంచి 20-25 శాతం రాబడులను ఇస్తుంది. కనుక జీవిత బీమా కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ను సూచిస్తున్నాం. ఈ విభాగంలో టాప్‌ పిక్‌ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌. ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ను కూడా పరిశీలించొచ్చు.

 

ఫార్మా రంగం..
డాక్టర్‌ రెడ్డీస్‌ ఇష్టమైన స్టాక్‌. చైనా మార్కెట్లోకి ప్రవేశించడం సహా కంపెనీ ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంది. చైనా మార్కెట్లో మంచి ప్రవేశం ఉన్న కంపెనీల్లో ఇదీ ఒకటి. అమెరికా మార్కెట్‌పైనే ఆధారపడకుండా కంపెనీ ఎక్స్‌పోజర్‌ భిన్న భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించింది ఉంది. ప్రస్తుత ధరల్లో డాక్టర్‌ రెడ్డీస్‌ను తప్పకుండా కొనుగోలు చేసుకోవచ్చు. దేశీయంగా పెద్ద ఎత్తున వ్యాపారం కలిగిన ఫార్మా కంపెనీల పట్ల సానుకూలంగా ఉన్నాం. టోరంట్‌ ఫార్మా, నాట్కోను పరిశీలించొచ్చు.You may be interested

స్థిరమైన రాబడులను ఆశిస్తు‍న్నారా..?

Saturday 25th January 2020

మార్కెట్లో ఎప్పుడు, ఏ స్టాక్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే రాబడులు తీసుకోవచ్చన్న సూక్ష్మం సాధారణంగా ఎక్కువ మంది రిటైల్‌ ఇన్వెస్టర్లకు తెలియదు. ఎందుకంటే రిటైల్‌ ఇన్వెస్టర్ల దృష్టి ఎక్కువ శాతం స్వల్పకాలంలో అధిక రాబడులను ఇచ్చే స్టాక్స్‌ ఏవి? అనే దానిపైనే ఉంటుంది. స్థిరమైన రాబడుల పట్ల వారు అంత ఆసక్తి చూపించరు. ఈ విధమైన ధోరణి ఎక్కువ సందర్భాల్లో వారు నష్టపోయేలా చేస్తోంది. వార్షికంగా సగటున డబుల్‌ డిజిట్‌ కాంపౌండెడ్‌

ఫండ్స్‌, ప్రమోటర్లు కలిసి కొన్న షేర్లివే..!

Friday 24th January 2020

డిసెంబర్‌ క్వార్టర్‌లో  సూచీలు తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కోన్నాయి. ఈ క్యూ3 కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌, ఎఫ్‌పీఐలు, ప్రమోటర్లు యాదృచ్ఛికంగా 8 స్టాక్‌లను కొనుగోలు చేశారు. ఫలితంగా ఈ 8 షేర్లు కలిగిన ఇన్వెస్టర్లు ఓ మోస్తారు లాభాలను గడించారు.  ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, పైప్‌మేకర్‌ వెల్‌స్పన్‌ కార్పోరేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ రిటైలర్‌ వైభవ్‌ గ్లోబల్‌, పేపర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ వెస్ట్‌ కోస్ట్‌ పేపర్‌ మిల్స్‌, షిప్‌యార్డ్‌ దిగ్గజం గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌, ట్రాన్స్‌ఫార్మర్‌

Most from this category