News


స్మాల్‌క్యాప్‌లో ఈ ఫండ్స్‌ బెటర్‌: ధీరేంద్రకుమార్‌

Thursday 30th May 2019
Markets_main1559154717.png-25987

స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేవే స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌. పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇ‍న్వెస్ట్‌ చేయగలిగిన వారు అధిక రాబడులు సొంతం చేసుకునేందుకు వీటిల్లో అవకాశం ఉంటుంది. ఈ విభాగంలో బిర్లా సన్‌లైఫ్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌, యాక్సిస్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌, ఫ్రాంక్లిన్‌ ఇండియా స్మాలర్‌ కంపెనీస్‌ ఫండ్‌ పథకాలను ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు, వ్యాల్యూరీసెర్చ్‌ సంస్థ సీఈవో ధీరేంద్రకుమార్‌ సూచించారు. ఈ మేరకు ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 

 

మిడ్‌, స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులకు ఇది సరైన సమయమా?
అవును. అయితే, స్మా్ల్‌క్యాప్స్‌, మిడ్‌క్యాప్స్‌ అన్నవి అన్ని రకాల ఇన్వెస్టర్ల కోసం కాదు. కాకపోతే వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు మంచి తరుణం. కేవలం రెండు రకాల ఇన్వెస్టర్లు వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. కనీసం ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టి ఉన్న స్వభావం కలిగిన వారే ఇన్వెస్ట్‌ చేయాలి. అలాగే, మార్కెట్‌పై అనుభవం ఉన్న వారు కూడా. ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారో, స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్స్‌తో ఆరంభిస్తే తీవ్ర నిరాశకు గురికావచ్చు. మార్కెట్లు పడిపోయినా దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించే స్వభావం ఉన్నవారే ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. ఇటువంటి సమయాల్లో ఇన్వెస్టర్లు ఆందోళనతో ఉండడంతోపాటు పెట్టుబడులతో బయటపడేందుకు వేచి చూస్తుంటారు. గత ఏడాది కాలంలో రాబడులు మైనస్‌ 6 శాతం నుంచి మైనస్‌ 10 శాతం మధ్య ఉన్నాయి. దీర్ఘకాల రాబడులను గమనించినట్టయితే స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, లార్జ్‌క్యాప్‌ రాబడుల మధ్య వ్యత్యాసం 1-2 శాతమే. 

 

మిడ్‌, స్మాల్‌క్యాప్‌లో టాప్‌-3 ఫండ్స్‌ ఏవి?
అవకాశాల కోణంలో చూస్తే పెట్టుబడుల కోసం ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విభాగంలో ఇప్పటికీ నేను నచ్చే పథకం సుందరం స్మైల్‌ ఫండ్‌. ఇది ఇప్పుడు ఎక్కడా ర్యాంకుల్లో కనిపించదు. లార్జ్‌క్యాప్‌ లేదా మల్టీక్యాప్‌ లేదా మల్టీక్యాప్‌ అయిన లార్జ్‌క్యాప్‌ అయినా కానీ ప్రతీ ఫండ్‌ మేనేజర్‌ భిన్నంగా చూస్తుంటారు. భిన్నమైన విధానాలతో వారు రాణిస్తుంటారు. టాప్‌-3 స్మాల్‌క్యాప్‌ పథకాల్లో బిర్లా సన్‌లైఫ్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ ఒకటి. రెండోది యాక్సిస్‌ స్మాల్‌క్యాప్‌ పథకం. ఇది పెద్ద పథకంగా మారినప్పటికీ స్మాల్‌క్యాప్‌ పథకంగా బాగా రాణిస్తోంది. ఇక చాలా స్థిరమైన పనితీరు చూపించేది ఫ్రాంక్లిన్‌ ఇండియా స్మాలర్‌ కంపెనీస్‌ ఫండ్‌.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌

Thursday 30th May 2019

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతున్నప్పటికీ,  భారత్‌ మార్కెట్‌ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.40 గంటలకు 50  పాయింట్ల లాభంతో 11,966 పాయింట్ల వద్ద కదులుతోంది. బుధవారం ఇక్కడ నిఫ్టీ జూన్‌ ఫ్యూచర్‌ 11,916  పాయింట్ల వద్ద ముగిసింది.  తాజాగా ఆసియా మార్కెట్లలో  జపాన్‌ నికాయ్‌ 1 శాతంపైగా క్షీణించగా, సింగపూర్‌ స్ర్టయిట్‌ టైమ్స్‌, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, తైవాన్‌ వెయిటెడ్‌  చైనా షాంఘై,

కరెక్షన్‌కు అవకాశం... లాంగ్‌ పొజిషన్లకు దూరం...!

Wednesday 29th May 2019

నిఫ్టీ 12,000 మార్క్‌ను అధిగమించి ఇంట్రాడేలో 12,041 రికార్డు స్థాయిని గత వారంలో నమోదు చేసిన తర్వాత సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. లాంగ్‌ పొజిషన్లకు ట్రేడర్లు దూరంగా ఉండడమే మంచిదన్న సూచన వారి నుంచి వినిపిస్తోంది. నిఫ్టీ ఈ నెల 28న హ్యాంగింగ్‌ మ్యాన్‌ పాటర్న్‌ను నమోదు చేసిందని, దీన్ని బేరిష్‌ రివర్సల్‌‍ ప్యాటర్న్‌గా పేర్కొంటున్నారు. నిఫ్టీ 12,000-12,041 వద్ద మధ్యంతర గరిష్టాన్ని నమోదు చేసిందని,

Most from this category