News


రుణభారం లేని కంపెనీల షేర్లను ఎన్నుకొండి..!

Friday 10th January 2020
Markets_main1578650718.png-30836

అప్పు నిప్పు లాంటిందని భారతీయ సమాజం భావిస్తుంది. ఈ సెంటిమెంట్‌ ప్రభావం రుణభారంతో సతమతమవుతున్న కంపెనీలపై పడింది. గతేడాదిలో అధిక అప్పులతో కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపలేదు. వాస్తవానికి రుణరహితంగా ఉన్న మెజారిటీ కంపెనీల షేర్లు 2019లో 122శాతం పెరిగాయి. రుణరహిత కంపెనీల్లో అగ్రశ్రేణిలో ఉన్న టాప్‌-15 కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు 50శాతం లాభాల్ని పంచాయి. 

రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఆస్ట్రాజెనికా ఫార్మా ఇండియా, ఇన్ఫోఎడ్జ్‌(ఇండియా), అబాట్‌ ఇండియా, వర్ల్‌ఫూల్‌ ఆఫ్‌ ఇండియా, డాక్టర్‌ లాల్‌పాథ్‌ ల్యాబ్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, మల్టీ ఎక్చే‍్సంజ్‌ ఆఫ్‌ ఇండియా, బాటా ఇండియా, అవంతీ ఫీడ్స్‌ వాటిలో ఉన్నాయి. 

ఆర్థిక వ్యవస్థలో కష్టతరమైన వ్యాపార వాతావరణం ఉన్నందున ఇన్వెస్టర్లు రుణరహిత కంపెనీల మనుగడ ధీర్ఘాకాలం పాటు సాగుతుంది. ప్రస్తుత వాతావరణంలో, మూలధన కొరత కష్టంగా మారింది. దీనికి తోడు మూలధన వ్యయం కూడా పెరుగుతున్న తరణంలో కంపెనీ బ్యాలెన్స్ షీట్ పరిపుష్టి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల తక్కువ అప్పు ఉన్న కంపెల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈక్విటీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. రుణరహిత కంపెనీలు అధిక రుణభారం కలిగిన కంపెనీలతో పోలిస్తే అధిక మదింపు మల్టిపుల్‌ను పొందుతాయ ప్రభుదాస్‌ లిల్లాదర్‌ ఫోర్ట్‌ ఫోలియో మేనేజర్‌ అజయ్‌ బోడ్కే అభిప్రాయపడ్డారు.

పైన పేర్కోన మొత్తం 15 కంపెనీల్లో రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేశాయి. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కంపెనీ షేర్లపై మొత్తం 13మంది విశ్లేషకుల్లో ఏడుగురు ‘‘బుల్లిష్’’ రేటింగ్‌, 4గురు ‘హోల్డ్’ రేటింగ్‌ను కేటాయించినట్లు రాయిటర్స్‌ గణాంకాలు చెబుతున్నాయి. కేవల ఇద్దరు అనలిస్ట్‌లు మాత్రమే ‘‘సెల్‌’’ రేటింగ్‌ను కేటాయించారు. అదే విధంగా రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ 13మంది విశ్లేషకుల్లో ఇద్దరు ఇన్వెస్టర్లు ‘‘బై’’ రేటింగ్‌ను, ఐదుగురు ‘‘అవుట్‌ఫార్మ్‌’’ రేటింగ్‌ను, ఇద్దరు ‘‘హోల్డ్‌’’ రేటింగ్‌ను కేటాయించారు.

రుణ రహిత కంపెనీ షేర్లను కొనుగోలు చేయడం సహజంగానే ప్రయోజనకరమని కేడియా సెక్యూరిటీస్‌కు చెందిన విజయ్ కేడియా తెలిపారు. అయితే కేవలం రుణ రహితంగా ఉండటం మాత్రమే ముఖ్యం కాదు. వృద్ధి కూడా ముఖ్యం.  సున్నా అప్పులు,  వృద్ధి లేని వ్యాపారానికి బదులుగా 10-20 శాతం వృద్ధితో వచ్చే అప్పులు మంచిమని కేడియా చెప్పుకొచ్చారు.

ఒక కంపెనీ సహేతుక రీతులో అప్పుల్లో చేయడం ద్వారా కంపెనీ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోదు. అంతేకాక, వడ్డీ చెల్లించిన తర్వాత సంస్థ యొక్క నగదు ప్రవాహం కూడా బలంగా ఉండాలి. అధిక రుణ-ఈక్విటీ నిష్పత్తి కలిగిన కంపెనీలు ఒక మందగమనంలో పతనమవుతాయి. 

ఈ ఏడాదిలో రుణ-ఈక్విటీ నిష్పత్తులు సున్నా లేదా సున్నాకి దగ్గరగా ఉన్న బీఎస్‌ఈ 500 సూచికలోని మొత్తం 95 కంపెనీల్లో 54కంపెనీల షేర్లు సానుకూల రాబడినిచ్చాయి. మిగిలిన 54శాతం వరకు పతనమయ్యాయి.

తేజాస్‌ నెట్‌వర్స్‌‍్క 2019 ఏడాదిలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. దానితో పాటు క్లారెక్స్‌ సర్వీసెస్‌, లక్ష్మీ మెషన్స్‌ నెట్‌వర్క్స్‌, ఎన్‌బీసీసీ ఇండియా, నోసిల్‌, వీ-మార్ట్‌ రిటైల్‌, టీవీ ఇండియా నెట్‌వర్క్స్‌, కేర్‌ రేటింగ్‌ సంస్థలు నష్టాలను చవిచూశాయి. You may be interested

మార్కెట్లు ప్లస్‌లోనే- నిఫ్టీ కొత్త రికార్డు

Friday 10th January 2020

ఇంట్రాడేలో 12,311కు నిఫ్టీ సెన్సెక్స్‌ 150 పాయింట్లు అప్‌ రియల్టీ, మెటల్‌, ఆటో జోరు చిన్న షేర్లు వెలుగులో అంతర్జాతీయ మార్కెట్లలో బలపడ్డ సెంటిమెంటు కారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌లోనూ జోరు చూపాయి. సెన్సెక్స్‌ 148 పాయింట్లు బలపడి 41,600కు చేరగా.. నిఫ్టీ 41 పాయింట్లు పుంజుకుని 12,257 వద్ద ముగిసింది. గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకోవడంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. దీంతో మిడ్‌ సెషన్‌కల్లా

మరింత పెరిగిన రూపాయి..

Friday 10th January 2020

12 పైసలు ప్లస్‌ 71.09 వద్ద ట్రేడింగ్‌ డాలరుతో మారకంలో బుధవారం లాభాల యూటర్న్‌ తీసుకున్న దేశీ కరెన్సీ వరుసగా మూడో రోజు శుక్రవారం సైతం బలపడింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి మధ్యాహ్నానికల్లా 12 పైసలు(0.17 శాతం) పుంజుకుని  71.09 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్‌, అమెరికా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు చల్లబడటంతో ఇటీవల ముడిచమురు, బంగారం ధరలు నీరసించగా.. స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ట్రేడింగ్‌లో

Most from this category