News


స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌: ఒడిదుడుకుల ట్రేడింగ్‌..!

Saturday 1st February 2020
Markets_main1580540031.png-31398

  • లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న సూచీలు
  • 12000 స్థాయి దిగువునే నిఫ్టీ 
  • అటో, ఎఫ్‌ఎంజీసీ షేర్లకు లాభాల మద్దతు
  • మెటల్‌ షేర్లలో కొనసాగుతున్న అమ్మకాలు

బడ్జెట్‌ సందర్భంగా ప్రత్యేకంగా ట్రేడ్‌ అవుతున్న స్టాక్‌ మార్కెట్‌ తీవ్రంగా ఒడిదుడుకులకు లోనవుతోంది. నేటి ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. రికవరీ అయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జె్‌ట్‌ ప్రసంగం ప్రారంభించేటప్పుడు ఒక్కసారిగా భారీ పతనాన్ని చవిచూశాయి. మళ్లీ రికవరీ అయ్యాయి. మధ్యాహ్నం 12గంటలకు ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌ 50 పాయింట్ల లాభంతో 40773.81 వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 11975.10 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఇదే సమయానికి మెటల్‌, మీడియా, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అటో కంపెనీలు నేడు జనవరి మాసపు విక్రయ గణాంకాలను విడుదల చేయనున్న నేపథ్యంలో అటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఎఫ్‌ఎంజీసీ దిగ్గజ కంపెనీలైన ఐటీసీ, హెచ్‌యూఎల్‌ క్యూ3 ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఉండటంతో ఎఫ్‌ఎంజీసీ షేర్లు కూడా లాభపడ్డాయి. వాటితో ఫార్మా, బ్యాంకింగ్‌, రియల్టీ రంగ షేర్లు పెరిగాయి. హిందూస్థాన్‌ యూనిలివర్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ లాంటి అధిక వెయిటేజీ కలిగిన షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండటం సూచీలకు కలిసొస్తుంది. 

టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, టాటా మోటర్స్‌ షేర్లు 1.50శాతం నుంచి 2శాతం నష్టపోయాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, మారుతి, హిందూస్థాన్‌ యూనిలివర్‌, గెయిల్‌ షేర్లు 1శాతం నుంచి 2శాతం లాభపడ్డాయి. 



You may be interested

స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌: 11880 దిగువకు నిఫ్టీ

Saturday 1st February 2020

 ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో మార్కెట్‌కు ప్రభావితం చేసే అంశాలేవి లేకపోవడంతో సూచీలు మిడ్‌సమయానికి తీవ్రంగా నష్టాలను చవిచూస్తున్నాయి. నిఫ్టీ ఇండెక్స్‌ 93 పాయింట్లు నష్టపోయి 11,869.00 స్థాయికి దిగివచ్చింది. సెన్సెక్స్‌ 279 పాయింట్లను కోల్పోయి 40,444.44 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మెటల్‌, బ్యాంకింగ్‌, రియల్టీ, మీడియా రంగ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఆర్థిక సంవత్సరం 2020-21లో వైద్య రంగానికి రూ.69 వేల

లాభాల్లోకి సూచీలు

Saturday 1st February 2020

బడ్జెట్‌ రోజు నష్టాలతో ఆరంభమైన దేశీయ మార్కెట్లు క్రమంగా లాభాల్లోకి మరలాయి. 11939 పాయింట్ల వద్ద ఆరంభమైన నిఫ్టీ ఒకదశలో 11880 పాయింట్ల కనిష్టాలకు చేరింది. క్రమంగా కోలుకొని 12017 పాయింట్ల గరిష్ఠాన్ని చేరింది. ప్రస్తుతం(మధ్యాహ్నం12గంటలకు) 11975 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 40767 పాయింట్ల వద్ద కదలాడుతోంది. బడ్జెట్లో మార్కెట్‌ను ప్రభావితం చేసే పన్ను అంశాలు ఇంకా ప్రవేశ పెట్టలేదు. 

Most from this category