News


పాలసీ ఎఫెక్ట్‌....బ్యాంకింగ్‌, ఆటో షేర్ల ఒడిదుడుకులు

Friday 4th October 2019
Markets_main1570171470.png-28717

ఆర్‌బీఐ వరుసగా ఐదోసారి వడ్డీరేట్ల కోత తగ్గింపు తరువాత బ్యాంకింగ్‌, అటో, రియల్టీ షేర్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. వడ్డీరేట్ల ప్రకటన అనంతరం ఆయా రంగాలకు చెందిన షేర్లు ఉదయం ఆర్జించిన లాభాల్ని కోల్పోతున్నాయి. ఆర్‌బీఐ అంచనాలకు తగ్గట్లుగానే  వడ్డీరేట్లను తగ్గించడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ను ఉత్సాహపరచడంలో విఫలమైంది. ఫలితంగా ఈ రంగ షేర్లను విక్రయించేందుకు ట్రేడర్లు మొగ్గచూపుతున్నారని సామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేశ్‌ మెహతా అభిప్రాయపడ్డారు. ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ ఉదయం ఆర్జించిన లాభాల్ని కోల్పోయి 0.25శాతం స్వల్ప లాభంతో ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ సైతం పావుశాతం నష్టపోయింది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లలో కూడా అమ్మకాలు మొదలయ్యాయి. ఎక్కువగా ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లు ఒత్తిడికి ఎదుర్కోంటున్నాయి. ఫలితంగా నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1శాతం క్షీణించింది. అలాగే ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం ఆర్‌బీఐ ప్రకటనల అనంతరం ఉదయం ఆర్జించిన లాభాల్ని కోల్పోయాయి. ఫలితంగా ఇంట్రాడే గరిష్టం నుంచి 2.50శాతం నష్టపోయింది. 
నేడు జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను పావుశాతం మేర తగ్గించింది. వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటులో 0.25 శాతం కోత విధించింది. దీంతో ప్రస్తుతం రెపోరేటు 5.15 శాతానికి దిగివచ్చింది. రివర్స్‌ రెపో సైతం 4.90 శాతానికి పరిమితమైంది. వరుసగా ఐదోసారి రెపో రేటు తగ్గింపును చేపట్టినట్లయ్యింది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 6.9 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది. You may be interested

లాభాల బాటలో అశోక్‌ లేలాండ్‌

Friday 4th October 2019

హిందుజా గ్రూపునకు చెందిన అశోక్‌‌‌‌ లేలాండ్‌‌‌‌ కంపెనీ షేర్లు శుక్రవారం 7.50శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో ఈ షేర్లు రూ.68.60 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ షేర్లకు డిమాండ్‌ పెరగడంతో షేర్లు లాభాల బాటపట్టాయి. ఒక దశలో 7.50శాతం ర్యాలీ చేసి రూ.72.65 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.12:00లకు క్రితం ముగింపు(రూ.67.60) ధరతో పోలిస్తే 3.50శాతం లాభంతో రూ.70.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పావుశాతం కోత

Friday 4th October 2019

దేశీయ బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ రంగాలపై మార్కెట్‌లు ఆందోళనగా ఉన్న ప్రస్తుతం సమయంలో ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) మరో దఫా రెపో రేటును తగ్గించి ఊరటనిచ్చింది. ఇప్పటికే ఈ ఏడాదిలో 110 బేసిస్‌ పాయింట్లను తగ్గించిన ఆర్‌బీఐ, శుక్రవారం సమావేశంలో మరో 25 బేసిస్‌ పాయింట్లను తగ్గించింది. దీంతో ఈ ఏడాది మొత్తంగా 135 బేసిస్‌ పాయింట్లను తగ్గించినట్టయింది. ప్రస్తుతం రెపో రేటు 5.15 శాతం ఉంది.

Most from this category