News


ఒడిదుడుకుల మధ్య లాభాలతో....

Tuesday 17th March 2020
Markets_main1584418711.png-32523

  • మార్కెట్లో కొనసాగుతున్న కరోనా భయాలు
  • నష్టాల్లో ఫైనాన్స్‌, లాభాల్లో మెటల్‌ షేర్లు
  • సెన్సెక్స్‌ 100 పాయింట్ల: నిఫ్టీ 45.7 పాయింట్లు

స్టాక్‌ మార్కెట్లో అస్థిరత కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్‌ వ్యాధి భయాలు ఇంకా మార్కెట్‌ను వీడటం లేదు. ఫలితంగా మంగళవారం స్టాక్‌ సూచీలు భారీ లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికీ.., లాభనష్టాల మధ్య ట్రేడ్‌ అవుతున్నాయి. ఆర్థికవ్యవస్థ రికవరీ ఆర్‌బీఐ అభయహస్తం, రూపాయి విలువ బలపడటం, షార్ట్‌ కవరింగ్‌ల పాటు డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో అదుపులో ఉన్నట్లు గణాంకాలు వెలువడటం తదితర కారణాలతో నేడు సెన్సెక్స్‌ 304.64 పాయింట్ల లాభపడి 31694.71 వద్ద, నిఫ్టీ 77.15 పాయింట్ల పెరిగి 9274.55  వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 

అయితే కరోనా భయాలతో ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరత సూచీలను లాభాలను క్షణాల్లో హరించివేసింది. నిన్నరాత్రి అమెరికా సూచీలు 12శాతం నష్టాల ముగింపు, నేడు ఆసియాలోని ప్రధాన దేశాల సూచీలు నష్టాల ట్రేడింగ్‌లు మన మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. 

ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభంతో 31490 వద్ద, నిఫ్టీ 45.7 పాయింట్లు పెరిగి 9243.10 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఫైనాన్స్‌, మీడియా రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. 

టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో అదుపులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి ద్రవ్యోల్బణం 2.26శాతంగా నమోదైనట్లు వాణిజ్య పరిశ్రమల శాఖ ఓ నివేదికలో వెల్లడించింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌మారకంలో రూపాయి విలువ మునుపటి ముగింపు(74.27)స్థాయితో పోలిస్తే 14పైసలు బలపడి 74.13 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ ‘‘ఆగస్ట్‌ వరకు కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగే అవకాశం ఉన్నందున దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉంది.’’ అన్నారు. దీంతో అమ్మకాల తీవ్రత మరింత పెరిగి ఆ దేశ ప్రధాన సూచీలైన ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్‌, డౌజోన్స్‌లు 13శాతం నష్టాన్ని చవిచూశాయి. నేడు ఆసియాలోని ప్రధాన మార్కెట్లు సైతం అదే పంథాను అనుసరిస్తున్నాయి. జపాన్‌, కొరియా, సింగపూర్‌ తైవాన్‌ దేశాలకు చెందిన ప్రధాన స్టాక్‌ సూచీలు గరిష్టంగా 3శాతం వరకు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 

సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ ఇండ్‌, టాటా స్టీల్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 4.50శాతం 23శాతం వరకు లాభపడ్డాయి. కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫ్రాటెల్‌, యూపీఎల్‌ షేర్లు 2.50శాతం నుంచి 5శాతం నష్టపోయాయి. You may be interested

రూ.40,000 దిగువకు పసిడి

Tuesday 17th March 2020

గతవారం రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మంగళవారం భారీగా పతనమై రూ.40,000 దిగువకు చేరాయి.దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే రూ.1224 తగ్గి 10 గ్రాముల పసిడి రూ.39,731.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ఫెడరల్‌ వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్లుపై ఆసక్తి చూపడం లేదు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి. నిన్నటితో పోలిస్తే 15 డాలర్లు పడిపోయి ఔన్స్‌ బంగారం

యూఎస్‌ మార్కెట్ల ఘోర పతనం

Tuesday 17th March 2020

చరిత్రలో మరో బ్లాక్‌‘మండే’ 13 శాతం కుప్పకూలిన డోజోన్స్‌ ఎస్‌అండ్‌పీ 12 శాతం పతనం అదే బాటలో నాస్‌డాక్‌ డౌన్‌ మూడు దశాబ్దాలలో అత్యధిక నష్టం కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను ఏకంగా సున్నా(0-0.25 శాతం) స్థాయికి కోత పెట్టినప్పటికీ సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. డోజోన్స్‌ 2997 పాయింట్లు(13 శాతం) పడిపోయి 20,189 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 325 పాయింట్లు(12 శాతం) తిరోగమించి 2,386 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ 970

Most from this category