News


సుప్రీం తీర్పుతో కొత్త కనిష్ఠానికి వోడాఫోన్‌ఐడియా

Friday 25th October 2019
Markets_main1571982228.png-29136

  లైసెన్సు ఫీజుపై సుప్రీం కోర్టు ప్రతికూల ఆదేశాలివ్వడంతో గురువారం సెషన్‌లో 27 శాతం పతనమయిన వొడాఫోన్‌ ఐడియా షేరు, శుక్రవారం ట్రేడింగ్‌లో కూడా మరో 10 శాతం నష్టపోయి రూ. 3.65 వద్ద కొత్త జీవిత కాల కనిష్ఠాన్ని తాకింది. వోడాఫోన్‌-ఐడియా షేరు ఉదయం 10.54 సమయానికి 8.05 శాతం నష్టపోయి రూ. 4.00 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో 27 శాతం పడిపోయి రూ. 4.35 వద్ద ముగిసిన ఈ షేరు, శుక్రవారం ట్రేడింగ్‌లో రూ. 4.15 వద్ద నెగిటివ్‌గా ప్రారంభమైంది. సుప్రీం కోర్టు తాజా తీర్పు వలన ఈ టెలికాం కంపెనీ రూ. 19,823.71 కోట్లను ప్రభుత్వానికి లైసెన్సుల రూపేణా బకాయి పడింది. భారతీ ఎయిర్‌టెల్‌ షేరు కూడా 0.68 శాతం నష్టపోయి రూ. 369.80 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌ ఇంట్రాడేలో సుమారు 10 శాతం క్షీణించి రూ. 325.60కి పడిపోయిన ఈ టెలికాం కంపెనీ షేరు తిరిగి పుంజుకొని 3.31 శాతం లాభంతో రూ. 372.45 వద్ద క్లోజయ్యింది. ఈ కంపెనీ లైసెన్సుల రూపేణా రూ. 21,682.13 కోట్లును ప్రభుత్వానికి బకాయిపడింది. 
అసలు వివాదామేంటి?
కొత్త టెలికం విధానం ప్రకారం.. టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్‌)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి. అయితే ఈ ఏజీఆర్‌ లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన టెలికంయేతర ఆదాయాలు కూడా ఏజీఆర్‌ కిందే వస్తాయని, దానిపైనే లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుందని టెలికం వివాదాల పరిష్కార, అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (టీడీశాట్‌) గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారం భారీగా పెరిగిపోనుండటంతో టీడీశాట్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ టెల్కోలు .. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై జూలైలో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం తమ వాదనలు వినిపించింది. అప్పటిదాకా టెల్కోలు రూ. 92,000 కోట్ల మేర లైసెన్సు ఫీజులు బకాయి పడ్డాయని తెలిపింది. తాజాగా ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. 



You may be interested

ధన్‌తెరాస్‌ ఎఫెక్ట్‌: ఏడాది గరిష్ఠానికి టైటాన్‌

Friday 25th October 2019

   ధన్‌తెరాస్‌ ప్రభావంతో డైమండ్‌, ఆభరణాల షేర్లు శుక్రవారం సెషన్లో మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. టైటాన్‌ షేరు స్వల్పంగా పెరిగి ఏడాది గరిష్ఠాన్ని తాకింది. ఉదయం 11.37 సమయానికి టైటాన్‌ షేరు 0.60 శాతం లాభపడి రూ. 1,382.80  వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 1,374.55 ముగిసిన ఈ షేరు, శుక్రవారం సెషన్‌లో రూ. 1,378.90 వద్ద ప్రారంభమై, రూ. 1,389.95 వద్ద 52 వారాల గరిష్ఠానికి చేరుకుంది. ఇతర డైమండ్‌,

1500 డాలర్ల పైకి పసిడి

Friday 25th October 2019

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తిరిగి 1500డాలర్లను అందుకుంది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర అరడాలరు స్వల్ప లాభంతో 1,505 డాలరు వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ధర పసిడికి రెండు వారాల గరిష్ట స్థాయి కావడం విశేషం. అమెరికా విడుదల చేసిన బలహీన ఆర్థిక గణాంకాలు పసిడి బలపడేందుకు తోడ్పడింది. నిన్నరాత్రి అమెరికా సెప్టెంబర్‌ మాసపు డ్యూరబుల్‌ గూడ్స్‌ ఆర్డర్ల గణాంకాలను విడుదల చేసింది. గణాంకాలు

Most from this category