News


ఏజీఆర్‌ చెల్లింపులకు పదేళ్ల గడువు: వొడాఫోన్‌

Thursday 6th February 2020
Markets_main1580969038.png-31554

5జీ స్పెక్ట్రమ్‌ కొనుగోలుకి నో: ఎయిర్‌టెల్‌ 
52 వారాల గరిష్టానికి ఎయిర్‌టెల్‌ షేరు
1 శాతం లాభంతో వొడాఫోన్‌ ఐడియా

ఏజీఆర్‌ బకాయిల చెల్లింపునకు పదేళ్ల గడువును ఇవ్వవలసిందిగా వొడాఫోన్‌ ఐడియా గ్రూప్‌ తాజాగా ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఏజీఆర్‌ బకాయిలలో కలిసి ఉన్న వడ్డీలు, పెనాల్టీలను రద్దు చేయవలసిందిగా వొడాఫోన్‌ ఐడియా గ్రూప్‌ సీఈవో నిక్‌ రీడ్‌ కోరారు. వీటిని మినహాయించిన ఏజీఆర్‌ అసలు(ప్రిన్సిపల్‌) బకాయిలను చెల్లించేందుకు పదేళ్ల గడువును అభ్యర్థించారు. అంతేకాకుండా ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుపై రెండేళ్ల వరకూ వాయిదా(మారటోరియం)కు అవకాశమివ్వాలని కోరారు. నష్టాలలో ఉన్న వొడాఫోన్‌ ఐడియా కంపెనీలో తాజా పెట్టుబడులు చేపట్టబోమని ఈ సందర్భంగా నిక్‌ పేర్కొన్నారు. వడ్డీలు, పెనాల్టీలు, లైసెన్స్‌ ఫీజులు తదితరాలతో కలిపి కంపెనీ రూ. 53,000 కోట్లవరకూ చెల్లించవలసి ఉన్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు ఇప్పటికే తెలియజేశాయి. 

ప్రతిష్ట రీత్యా..
ప్రత్యర్థి సంస్థల్లో ఒకటైన వొడాఫోన్‌ ఐడియా కార్యకలాపాలు కొనసాగితేనే మేలంటోంది దేశీ మొబైల్‌ రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌. పోటీలో కనీసం మూడు కంపెనీలుంటే టెలికం రంగానికి లద్ది చేకూరగలదని చెబుతోంది. తద్వారా దేశీ టెలికం రంగానికి మంచి గుర్తింపు లభించడంతోపాటు.. పెట్టుబడులు పెరుగుతాయని అభిప్రాయపడింది. ఏజీఆర్‌ బకాయిలపై ప్రభుత్వం ఆదుకోకుంటే కార్యకలాపాల నిలిపివేత(దివాళా)కు దిగే అవకాశమున్నట్లు గతంలో వొడాఫోన్‌ ఐడియా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దేశీ టెలికం రంగంలో మూడు ప్రధాన సంస్థలకు అవకాశమున్నట్లు ఈ ఏడాది(2019-20) మూడో త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఎయిర్‌టెల్‌ సీఎఫ్‌వో బాదల్‌ బగ్రీ అభిప్రాయపడ్డారు. వొడాఫోన్‌ ఐడియా కార్యకలాపాలు కొనసాగుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. దేశీ మొబైల్‌ మార్కెట్‌ పరిమాణరీత్యా మూడు సంస్థలు పోటీ పడేందుకు చోటున్నట్లు వ్యాఖ్యానించారు. వెరసి వొడాఫోన్‌ ఐడియా కొనసాగాలని వాంఛిస్తున్నట్లు తెలియజేశారు. ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు, టెలికం రంగ ప్రతిష్ట వంటి అంశాలరీత్యా మూడు సంస్థలు కొనసాగడంమేలని పేర్కొన్నారు. 
 

5జీ స్పెక్ట్రమ్‌ ఖరీదు
త్వరలో జరగనున్న వేలంలో 5జీ స్పెక్ట్రమ్‌ కొనుగోలుకి ముందుకెళ్లబోమని బాదల్‌ తెలియజేశారు. 5జీ స్పెక్ట్రమ్‌ ధరలు బాగా ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. టెలికం నియం‍త్రణ సంస్థ(ట్రాయ్‌) సూచనల ప్రకారం చూస్తే 100 మెగాహెట్జ్‌కు రూ. 50,000 కోట్లవరకూ వ్యయంకానున్నట్లు పేర్కొన్నారు. ఇదే అభిప్రాయాన్ని ఎయిర్‌టెల్‌ సీఈవో గోపాల్‌ విటల్‌ సైతం వ్యక్తం చేశారు. కాగా.. దేశవ్యాప్తంగా 11 సర్కిళ్లలో 3జీ నెట్‌వర్క్‌ను మూసివేశామని, ఆయా ప్రాంతాలలో 4జీ సర్వీసులను ప్రారంభించినట్లు గోపాల్‌ తెలియజేశారు. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఎయిర్‌టెల్‌ రూ. 1035 కోట్ల నికర నష్టం​ప్రకటించిన విషయం విదితమే. తద్వారా వరుసగా మూడో క్వార్టర్‌లోనూ నికర నష్టాలు ప్రకటించినట్లయ్యింది. ఇంతక్రితం అంటే 2018-19 క్యూ3లో రూ. 86 కోట్ల నికర లాభం​ఆర్జించింది. ఉదయం 10 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో ఎయిర్‌టెల్‌ షేరు 1 శాతం బలపడి రూ. 540 వద్ద ట్రేడవుతోంది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! ఇక వొడాఫోన్‌ ఐడియా షేరు 1 శాతం పుంజుకుని రూ. 5.30 వద్ద కదులుతోంది.



You may be interested

ఎఫ్‌పీఐలకే బడ్జెట్‌ బాగుందా?

Thursday 6th February 2020

తక్కువ అంచనాలున్నందున నిరాశపడని విదేశీ ఇన్వెస్టర్లు సాధారణంగా విదేశీ ఫండ్‌ మేనేజర్లతో పోలిస్తే దేశీయ ఫండ్‌ మేనేజర్లు స్థానిక ఎకనమిక్‌ పరిస్థితులపై ఎక్కువ అవగాహన కలిగిఉంటారు. కానీ బడ్జెట్‌ తర్వాత మార్కెట్‌ గమనం చూస్తే విదేశీ ఫండ్స్‌కే బడ్జెట్‌ బాగా అర్ధమైనట్లు కనిపిస్తోంది. అందుకు తగ్గట్లే విదేశీ మేనేజర్లు గత మూడునాలుగు సెషన్లుగా భారీ కొనుగోళ్లు జరుపుతున్నారు. బడ్జెట్‌ అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో శనివారం రోజు దేశీయ ఇన్వెస్టర్లు, ఫండ్‌ మేనేజర్లు

యస్‌ బ్యాంక్‌ ఎండీపై చర్యలు తీసుకోండి

Thursday 6th February 2020

ఆర్‌బీఐకి బ్యాంక్ మాజీ డైరెక్టర్ అగర్వాల్ లేఖ న్యూఢిల్లీ: నియంత్రణ సంస్థ నిర్దేశించిన పలు నిబంధనల ఉల్లంఘనకు గాను ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌ సీఈవో, ఎండీ రవ్‌నీత్‌ గిల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆ బ్యాంక్‌ మాజీ డైరెక్టరు ప్రకాష్ అగర్వాల్ తాజాగా రిజర్వ్ బ్యాంక్‌కు లేఖ రాశారు. అనైతిక విధానాలతో బ్యాంకు బోర్డుపై గిల్ ఆధిపత్యం సాధించారని, క్విడ్ ప్రో కో లావాదేవీలతో బోర్డు సభ్యులను ప్రభావితం చేస్తున్నారని

Most from this category