News


వొడాఫోన్‌ ఐడియా..అదుర్స్‌

Thursday 20th February 2020
Markets_main1582176524.png-31954

రెండో రోజూ షేరు హైజంప్‌
మంగళవారం కనిష్టం నుంచి 68 శాతం అప్‌
డెలివరీ ఆధారిత కొనుగోళ్లు పెరిగాయ్‌

మొబైల్‌ సేవల కంపెనీ వొడాఫోన్‌ ఐడియా కౌంటర్‌ వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ఉదయం 10.30 ప్రాంతంలో 14 శాతం జంప్‌చేసి రూ. 4.80 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 4.85 వరకూ ఎగసింది. బుధవారం సైతం ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో 38 శాతం దూసుకెళ్లి రూ. 4.20 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. వెరసి మంగళవారం బీఎస్‌ఈలో నమోదైన కనిష్టం రూ. 2.83 నుంచి చూస్తే వొడాఫోన్‌ ఐడియా షేరు తాజాగా 68 శాతం బౌన్స్‌బ్యాక్‌ సాధించినట్లయ్యింది. కాగా.. ఈ కౌంటర్లో డెలివరీ ఆధారిత కొనుగోళ్లు పెరగడం గమనించదగ్గ అంశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు డెరివేటివ్‌ విభాగంలో వొడాఫోన్‌ ఐడియా ఫిబ్రవరి ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులో ఓపెన్‌ ఇంటరెస్ట్‌ 8 శాతం పెరిగినట్లు తెలియజేశారు. బుధవారం 101.5 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. గత మూడు నెలల పరిమాణంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికంకాగా.. 24.57 కోట్ల షేర్లు డెలివరీ ఆధారితంకావడం విశేషమని నిపుణులు వివరించారు. ఈ పరిమాణం సైతం మూడు రెట్లు అధికంకాగా.. ఫ్యూచర్స్‌లో ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌ చేపట్టినట్లు తెలియజేశారు. నేటి ట్రేడింగ్‌లోనూ తొలి అర్ధగంటలోనే వొడాఫోన్‌ ఐడియా కౌంటర్లో దాదాపు 3 కోట్ల షేర్లు(బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ కలిపి) ట్రేడైనట్లు తెలుస్తోంది.

ఎందుకంటే?
కొన్ని నెలలుగా పతన బాటలో సాగిన వొడాఫోన్‌ ఐడియా కౌంటర్‌ ఉన్నట్టుండి టర్న్‌అరౌండ్‌ కావడానికి మార్కెట్‌ వర్గాలు వివిధ కారణాలను పేర్కొంటున్నాయి. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులకు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్న మొబైల్‌ టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లకు ప్రభుత్వం కొంతమేర ఉపశమనం​కలిగించే చర్యలు ప్రకటించవచ్చన్న అంచనాలు బలపడుతున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు తెలియజేశారు. ఈ బాటలో బుధవారం వొడాఫోన్‌ ఐడియా చైర్మన్‌ కేఎం బిర్లా, భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ ఆర్థిక శాఖ అధికారులను కలిసినట్లు వెలువడిన వార్తలు టెలికం కౌంటర్లలో స్పెక్యులేటివ్‌ పొజిషన్లకు కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 

టెలికం ఫండ్‌
ఆర్థిక శాఖకు మొబైల్‌ టెలికం ప్రతినిధులు కొన్ని అభ్యర్ధనలు చేసినట్లు తెలుస్తోంది. సాఫ్ట్‌లోన్స్‌కు వీలుగా టెలికం ఫండ్‌ ఏర్పాటును ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ఏజీఆర్‌ నిబంధనలను సవరించడం ద్వారా కొంతమేర ఉపశమనం కల్పించడం, బకాయిల చెల్లింపులకు గడువు పొడిగించడం వంటి అభ్యర్ధనలున్నట్లు చెబుతున్నాయి. కాగా.. ఏజీఆర్‌ బకాయిల్లో వడ్డీలు, పెనాల్టీలను మినహాయించి అసలు చెల్లింపులకు వీలుగా ప్రభుత్వం వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ అంశాన్ని సైతం పరిశీలించే వీలున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఏజీఆర్‌ చెల్లింపుల్లో విఫలంకారణంగా ప్రభుత్వం బ్యాంక్‌ గ్యారంటీలను నగదుగా మార్చుకోకపోవచ్చన్న అంచనాలు ఇప్పటికే మార్కెట్లలో వినిపిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి.
 You may be interested

టెస్లా.. వాల్‌స్ట్రీట్‌ నయా బుల్‌!

Thursday 20th February 2020

రెండు నెలల్లో దాదాపు 100 శాతం ర్యాలీ వెయ్యిడాలర్లకు చేరుతుందని నిపుణుల అంచనాలు 17000 కోట్ల డాలర్లకు చేరువలో మార్కెట్‌ క్యాప్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ టెస్లా యూఎస్‌ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా టెస్లా షేరు బుధవారం రికార్డు ర్యాలీ జరిపి నూతన గరిష్ఠాలను తాకింది. మంగళవారం 858.40 డాలర్ల వద్ద ముగిసిన టెస్లా షేరు బుధవారం 923.50 డాలర్ల వద్ద ఆరంభమై 944.78 డాలర్ల ఆల్‌టైమ్‌హైని తాకింది. చివరకు 6.88

నేటి వార్తల్లోని షేర్లు

Thursday 20th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రా: సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఈక్విటీని కొనేందుకు అదాని గ్రూపు చర్చలు జరుపుతోంది. మరికొన్ని ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లు కూడ సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాలో వాటా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముత్తూట్‌ ఫైనాన్స్‌: గోల్డ్‌ లోన్స్‌ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ముత్తూట్‌ ఫైనాన్స్‌ అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు బాండ్ల విక్రయం ద్వారా రూ.3,900 కోట్ల నిధులను  సమీకరించనుంది. బీపీసీఎల్‌: బీపీసీఎల్‌ను ప్రవేటీకరణ చేసినప్పటికీ ఉద్యోగాలలో

Most from this category