News


కుప్పకూలిన వొడాఫోన్‌ ఐడియా

Tuesday 18th February 2020
Markets_main1582008052.png-31889

కేర్‌ రేటింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ షాక్‌
10 శాతం పతనమై రూ. 3 దిగువకు 
7 రోజుల్లో 44 శాతం దిగజారిన షేరు
రూ. 2,500 కోట్లమేర ఏజీఆర్‌ చెల్లింపులు
మరో రూ. 1,000 కోట్ల చెల్లింపులకు సిద్ధం

సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వొడాఫోన్‌ ఐడియా ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులకు ముందుకొచ్చింది. తొలి విడతగా సోమవారం రూ. 2,500 కోట్లను టెలికం శాఖ(డాట్‌)కు చెల్లించింది. వారాంతానికల్లా మరో రూ. 1,000 కోట్లను చెల్లించేందుకు సిద్ధపడుతోంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు తాజాగా పేర్కొంది. అయితే వొడాఫోన్‌ ఐడియా దీర్ఘకాలిక బ్యాంక్‌ సౌకర్యాలు, మార్పిడి రహిత డిబెంచర్ల రేటింగ్‌లను కేర్‌(CARE) రేటింగ్స్‌ తాజాగా డౌన్‌గ్రేడ్‌ చేసింది. కంపెనీ మొత్తం రిస్క్‌ ప్రొఫైల్‌ భారీగా బలహీనపడిన కారణంగా రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు కేర్‌ రేటింగ్స్‌ తెలియజేసింది. BBB- నుంచి BB-కు రేటింగ్‌ను సవరించినట్లు తెలియజేసింది.

కారణాలున్నాయ్‌
ఏజీఆర్‌ బకాయిల విషయంలో అటు ప్రభుత్వం, ఇటు సుప్రీం కోర్టు నుంచి ఎలాంటి ఉపశమనం లభించని నేపథ్యంలో కంపెనీపై పడనున్న ఆర్థిక భారాన్ని రేటింగ్‌కు పరిగణించినట్లు తెలియజేసింది. దీనికితోడు ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో రూ. 6453 కోట్లమేర నికర నష్టం ప్రకటించడం​కూడా రేటింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు వెల్లడించింది. ఏజీఆర్‌ బకాయిల ప్రొవిజన్లు, కార్యకలాపాల ద్వారా నమోదవుతున్న నష్టాలు నెట్‌వర్త్‌ను దెబ్బతీస్తున్నట్లు వివరించింది. అయితే పరిశ్రమలో నెలకొన్న పోటీ వాతావరణంలోనూ వొడాఫోన్‌ ఐడియా నిర్వహణ సామర్థ్యాన్ని చూపడం, మాతృ సంస్థలు వొడాఫోన్‌ గ్రూప్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌ల నుంచి మద్దతు కొనసాగడం వంటి అంశాలు భవిష్యత్‌లో రేటింగ్‌ను ప్రభావితం చేయగలవని కేర్‌ రేటింగ్స్‌ పేర్కొంది.

రూ. 3 దిగువకు
వొడాఫోన్‌ ఐడియా షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో రూ. 2.85 వరకూ పతనమైంది. తద్వారా 2019 నవంబర్‌ 15న నమోదైన చరిత్రాత్మక కనిష్టం రూ. 2.61కు చేరువైంది. తదుపరి కొంతమేర కోలుకుంది. మధ్యాహ్నం 12 ప్రాంతంలో 10.5 శాతం పతనమై రూ. 3 వద్ద ట్రేడవుతోంది. వెరసి వరుసగా 7వ రోజు నేలచూపులతో కదులుతోంది. ఫలితంగా సుమారు 44 శాతం విలువను కోల్పోయింది. You may be interested

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 4 శాతం అప్‌!

Tuesday 18th February 2020

 అదానీ గ్రూప్‌, కేకేఆర్‌, బెయిన్‌ క్యాపిటల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, పిరమాళ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వంటి కంపెనీలతోపాటు 12కు పైగా కంపెనీలు దివాల తీసిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను సొంతంచేసుకునేందుకు బిడ్లు వేశాయి. అదానీ గ్రూప్‌, ఓక్‌ట్రీ క్యాపిటల్‌, ఏఆర్‌సీఐఎల్‌, కేకేఆర్‌ ఇండియా, వెల్‌స్పన్‌ గ్రూపులు డిహెచ్‌ఎల్‌ఎఫ్‌ మొత్తం వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు బిడ్లను వేయగా. ఎడెల్వీజ్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఫోనిక్స్‌ ఏఆర్‌సీ వార్డే పార్టనర్స్‌ ఎస్‌సీలోవీలు కొన్ని ప్రత్యేకమైన పోర్ట్‌పోలియోలు కొనుగోలు

నేటి వార్తల్లోని షేర్లు

Tuesday 18th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు వొడాఫోన్‌ఐడియా: రూ.2500 కోట్లు ఏజీఆర్‌ బకాయిలు చెల్లించన వొడాఫోన్‌ఐడియా కంపెనీ ఈ వారంతంలోపు మరో రూ.1000 కోట్లు కట్టడానికి బోర్డు అనుమతించిందని వెల్లడించిం‍ది. గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌:  ముంబై కేంద్రంగా పనిచేస్తున్న గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌.. రైల్వే ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నుంచి భూమిని కొనుగోలు చేయనుంది. దీనిలో భాగంగా ఢిల్లీలోని అశోక్‌ విహార్‌ ప్రాంతంలో ఉన్న 26.58 ఎకరాల భూమిని రూ.1,359 కోట్లకు

Most from this category