News


8శాతం నష్టంతో ముగిసిన వోడాఫోన్‌ ఐడియా

Wednesday 12th February 2020
Markets_main1581502108.png-31731

  • ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో అప్రమత్తత  

వోడాఫోన్‌ ఐడియా కంపెనీ షేరు బుధవారం 8శాతం నష్టంతో ముగిసింది. కంపెనీ గురువారం మూడో త్రైమాసిక ఫలితాల విడుదల నేపథ్యంలో అప్రమత్తత వహిస్తుండటం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో రూ.4.87ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి షేరు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో షేరు ఒక దశలో 9.50శాతం క్షీణించి రూ.4.87 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మార్కెట్‌ ముగిసే సరికి షేరు మునుపటి ముగింపు(రూ.4.87)తో పోలిస్తే 8శాతం క్షీణించి రూ.4.48 వద్ద స్థిరపడింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.2.61లు రూ.21.74గా ఉన్నాయి. 

మూడో త్రైమాసిక ఫలితాలపై బ్రోకరేజ్‌ సంస్థల అంచనాలివే
కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనాలు:

డిసెంబర్‌లో టారీఫ్‌ల పెంపుతో క్వార్టర్‌ టు క్వార్టర్‌ ప్రాతిపదికన ఈ డిసెంబర్‌ క్వార్టర్లో కంపెనీ ఆదాయం 4శాతం పెరగవచ్చు. సబ్‌స్క్రైబర్ల సంఖ్య 308.1 మిలియన్లుగా నమోదయ్యే అవకాశం ఉంది. అందుకు ముందు క్వార్టర్‌లో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 311.1మిలియన్లుగా ఉంది. యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌ 6శాతం వృద్ధి చెంది రూ.113 నమోదు కావచ్చు. నిర్వహణ పరపతి ప్రయోజనం, వ్యయ నియంత్రణల సమన్వయంతో ఈబిటా 34శాతం వృద్ధిని సాధించి రూ.1400 కోట్లను ఆర్జించవచ్చు. ఆర్థిక వ్యయాలు పెరుగుతాయని కోటక్‌ ఆశిస్తూ​ఉంది. ఇదే క్యూ3లో కంపెనీ రూ.4444.30 కోట్ల నికర నష్టాన్ని, ఆదాయం రూ.11,235 కోట్లు నమోదు చేయవచ్చు. 

ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌ అంచనాలు:
సబ్‌స్క్రైబర్ల సంఖ్య 5.7 మిలియన్ల క్షీణతను పరిగణనలోకి తీసుకుంటే ఈ క్యూ3లో కంపెనీ ఆదాయం 1.6శాతం పెరగవచ్చు. యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌ 6శాతం వృద్ధి చెందుతుంది. మార్జిన్లు 80శాతం పెరిగి 31.7శాతంగా నమోదు కావచ్చు. వీటితో పాటు ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులపై యాజమాన్యం వ్యాఖ్యలు, నెట్‌వర్క్ కాపెక్స్, అదనంగా బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు మూలధన ఇష్యూ ప్రణాళికలు తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని ఎడెల్వీజ్‌ బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడింది.



You may be interested

సెన్సెక్స్‌ ట్రిపుల్‌ - 2 వారాల గరిష్టం

Wednesday 12th February 2020

నిఫ్టీ 93 పాయింట్లు ప్లస్‌ రెండు వారాల గరిష్టానికి మార్కెట్లు ఎఫ్‌ఎంసీజీ జూమ్‌ వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు దూకుడు చూపాయి. సానుకూల ప్రపం‍చ సంకేతాలతో హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు తదుపరి మరింత జోరందుకున్నాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఏదశలోనూ వెనుదిరిగి చూడలేదు. వెరసి రెండు వారాల గరిష్టానికి చేరాయి. సెన్సెక్స్‌ 350 పాయింట్లు జంప్‌చేసి 41,566 వద్ద నిలవగా.. నిఫ్టీ 93 పాయింట్లు పెరిగి 12,201

డాక్టర్‌ రెడ్డీస్‌ చేతికి వొకార్డ్‌ దేశీ బిజినెస్‌

Wednesday 12th February 2020

డీల్‌ విలువ రూ. 1850 కోట్లు విభిన్ని విభాగాల 62 బ్రాండ్లు కొనుగోలు 6.5 శాతం పతనమైన వొకార్డ్‌ షేరు దేశీ ఫార్మా రంగం‍లో తాజాగా కన్సాలిడేషన్‌కు తెరలేచింది. ఫార్మా రంగ హైదరాబాద్‌ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌.. హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ వొకార్డ్‌ లిమిటెడ్‌ దీనిలో భాగంకానున్నాయి. వొకార్డ్‌కు చెందిన దేశీ బిజినెస్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ కొనుగోలు చేయనుంది. ఎంపిక చేసిన కొన్ని విభాగాలను కొనుగోలు చేసేందుకు వొకార్డ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు డాక్టర్‌

Most from this category