News


వోడాఫోన్‌ ఐడియా 12 శాతం పతనం

Monday 9th December 2019
news_main1575882508.png-30130

ప్రభుత్వ సాయం లేకపోతే వ్యాపారాన్ని మూసివేస్తామని వోడాఫోన్‌ ఐడియా ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా వ్యాఖ్యాలతో ఈ కంపెనీ షేరు సోమవారం ట్రేడింగ్‌లో దాదాపు 12శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.6.58 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  కేంద్రానికి చెల్లించాల్సిన పాత బకాయిలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఊరట చర్యలేమీ తీసుకోకపోతే వోడాఫోన్‌ ఐడియా సం‍స్థ మూసివేయాల్సి ఉంటుందని బిర్లా శుక్రవారం ఒక సదస్సులో తెలిపారు.  ఈ సెప్టెంబర్‌ క్వార్టర్‌లో దేశీయ జీడీపీ గా 4.5శాతంగా నమోదై ఆరేళ్ల కనిష్టానికి పతనమైన నేపథ్యంలో కేంద్రం టెలికాం రంగానికే కాక, మొత్తం ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ఉద్దీపన చర్యలు ప్రకటించాలని బిర్లా కోరుతున్నారు. ఏజీఆర్‌ లెక్కింపు వివాదంలో ఇటీవల కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.50,921 కోట్ల నష్టాలను ప్రకటించింది. బిర్లా వ్యాఖ్యాలతో నేడు వోడాఫోన్‌ ఐడియా షేరు ఒకదశలో 12.28శాతం నష్టపోయి రూ.6.07 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:15ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.6.92)తో పోలిస్తే 5.50శాతం నష్టంతో రూ.6.54 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.2.61, రూ.25.01లుగా నమోదయ్యాయి. 



You may be interested

ఈ వ్యూహంతో ఆప్షన్‌ బయర్స్‌లాభాలు పొందొచ్చు!

Monday 9th December 2019

అసిత్‌ బరాన్‌ పతి సూచనలు, సలహాలు అసిత్‌ బరాన్‌ పతి... ఆప్షన్‌ బయింగ్‌తో కూడా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించిన ట్రేడర్‌. సాధారణంగా ఆప్షన్‌ సెల్లర్స్‌కు మాత్రమే మార్కెట్‌ న్యాయం చేస్తుందని, ఆప్షన్స్‌ కొన్నవాళ్లు లాభపడడం తక్కువ సందర్భాల్లోనే జరుగుతుందని మార్కెట్‌లో అందరూ భావించే విషయం. కానీ ఆప్షన్‌ బయింగ్‌ కూడా లాభాల పంటనిస్తుందని ఈ మాజీ బ్యాంకు ఉద్యోగి చూపించాడు. ట్రేడింగ్‌లో మజా తెలిసాక చేస్తున్న ఉద్యోగం  వదిలి మరీ పూర్తి

11950 దిగువన షార్ట్‌ చేయొచ్చు!

Monday 9th December 2019

నిఫ్టీపై నిపుణుల సలహా నిఫ్టీ స్వల్పకాలానికి డౌన్‌ట్రెండ్‌లోనే ఉండొచ్చని, ఈ సమయంలో ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీ 11950 పాయింట్ల దిగువన కదలాడుతుంటే స్వల్పకాలానికి షార్ట్‌ చేయొచ్చని సూచిస్తున్నారు.  = చార్ట్‌వ్యూఇండియా నిపుణుడు మజార్‌ మహ్మద్‌ నిఫ్టీ తన స్వల్పకాలిక ఊర్ధ్వముఖ ఛానెల్‌ నుంచి బ్రేక్‌డౌన్‌ సాధించింది. అందువల్ల స్వల్పకాలానికి ట్రెండ్‌ డౌన్‌గానే ఉంటుంది. గతంలో మద్దతునిచ్చిన 13రోజుల డీఎంఏ దిగువన ముగియడం మరింత బలహీనత చూపుతుంది. అప్‌సైడ్‌ ప్రస్తుతానికి పరిమితంగా

Most from this category