News


వోడాఫోన్‌ ఐడియా..కనిష్టం నుంచి 49శాతం అప్‌

Friday 15th November 2019
news_main1573811645.png-29620

దేశీయ కార్పోరేట్‌ చరిత్రలో ఒక తైమాసికంలో అతిపెద్ద నికర నష్టాన్ని ప్రకటించిన వోడాఫోన్‌ ఐడియా షేరు శుక్రవారం మిడ్‌సెషన్‌ కల్లా తిరిగిలాభాల్లోకి మళ్లింది. ఏజీఆర్‌ ప్రభావంతో వొడాఫోన్‌ ఐడియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో భారీ నష్టాలను ప్రకటించింది. ఈ క్యూ2లో రూ.50,921 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో తమ నష్టాలు రూ.4,874 కోట్లని కంపెనీ వెల్లడించింది. ఇక ఆదాయం 42 శాతం ఎగసి రూ.11,146 కోట్లకు పెరిగిందని వివరించింది. సుప్రీం తాజా తీర్పు కారణంగా తాము చెల్లించాల్సిన ఏజీఆర్‌ బకాయిలు రూ.44,150 కోట్లుగా ఉంటాయని అంచనా వేసిన వొడాఫోన్‌ ఐడియా, ఈ క్యూ2లో రూ.25,680 కోట్ల మేర కేటాయింపులు జరిపినట్లు కంపెనీ తెలిపింది. భారీ నష్టాల ప్రకటన నేపథ్యంలో నేడు బీఎస్‌ఈలో 10శాతం నష్టంతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో మరింత అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో షేరు ఒకదశలో 11.50శాతం వరకు నష్టపోయింది. అయితే అనూహ్యంగా ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌ చేయడంతో షేరు కనిష్ట స్థాయి నుంచి దాదాపు 49శాతం లాభపడి రూ.3.89వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.3:10లకు షేరు క్రితం ముగింపు(రూ.2.95)తో పోలిస్తే 25.76శాతం నష్టంతో రూ.3.71 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధర వరుసగా రూ.2.61, రూ.28.06లుగా నమోదయ్యాయి. 



You may be interested

స్వల్ప లాభంతో సరి

Friday 15th November 2019

ఇంట్రాడేలో ఆర్జించిన లాభాల్ని నిలుపుకోవడంలో సూచీలు విఫలమయ్యాయి. ఐనప్పటికీ ఈ వారాంతపు రోజైన శుక్రవారాన్ని లాభంతో ముగించాయి. సెన్సెక్స్‌ 70 పాయింట్లు లాభంతో 40,356.69 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 11,895 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 266 పాయింట్లు(0.87శాతం) ఎగిసి 31,016.50 వద్ద స్థిరపడింది. అలాగే ఫార్మా, ఆర్థిక, మీడియా, రియల్టీ రంగ షేర్ల

ఇండియాపై సీఎల్‌ఎస్‌ఏ అండర్‌వెయిట్‌!

Friday 15th November 2019

‘అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల(ఈఎం)లో ఇండియా అండర్‌పెర్ఫార్మ్‌ చేస్తుందని అంచనావేస్తున్నాం. నా సలహా ఏంటంటే ఈఎం మార్కెట్లలో మొదట ఉత్తరాసియా మార్కెట్లు ఔట్‌పెర్ఫార్మ్‌ చేస్తాయి. ఈ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాం’ అని సీఎల్‌ఎస్‌ఏ చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ అడ్రియన్‌ మావత్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో... డిమాండ్‌ తగ్గింది.. ప్రభుత్వం కార్పోరేట్‌ పన్ను రేటును 25 శాతానికి తగ్గించడంతో, మేము చూస్తున్న ఇతర దేశాల సరసన ఇండియా నిలిచింది.

Most from this category