News


వొడాఫోన్‌ ఐడియా షేరు పతనం

Tuesday 25th February 2020
Markets_main1582609664.png-32069

బ్యాంక్‌ గ్యారంటీలను నగదు చేసుకోవద్దంటున్న రుణదాతలు
6.5 శాతం పతనమైన వొడాఫోన్‌ ఐడియా షేరు

మొబైల్‌ సేవల కంపెనీ వొడాపోన్‌ ఐడియాకు రుణాలిచ్చిన ఫైనాన్షియల్‌ సంస్థలు బ్యాంక్‌ గ్యారంటీలను నగదుగా మార్చుకోవద్దని వారాంతాన టెలికం శాఖ(డాట్‌)ను అభ్యర్థించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇలా చేస్తే బ్యాంకుల రుణాలను చెల్లించే విషయంలో కంపెనీ విఫలంకాగలదని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. టెలికం రంగంలో మూడు కంపెనీల కార్యకాలపాలు కొనసాగే పరిస్థితులు కల్పించే బాటలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రుణదాత సంస్థలు పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఇప్పటికే టెలికం రంగంలో మొండి రుణాల సమస్యలు తలెత్తిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వొడాఫోన్‌ ఐడియా బ్యాంక్‌ గ్యారంటీలను నగదుగా మార్చుకుంటే ఇది బ్యాంకులపై అదనపు భారాన్ని మోపుతుందని డాట్‌కు రుణదాత సంస్థలు వివరించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఏజీఆర్‌ బకాయిలపై ప్రభుత్వం నుంచి ఉపశమనం లభించకుంటే.. కార్యకలాపాలను నిలిపివేసే అవకాశమున్నట్లు ఇప్పటికే వొడాఫోన్‌ ఐడియా పేర్కొన్న నేపథ్యంలో రుణదాతల అభ్యర్ధనకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.

షేరు పతనం
నిజానికి వొడాఫోన్‌ ఐడియా కార్యకలాపాలు కొనసాగేలా రుణదాతలు సైతం కోరుకుంటున్నప్పటికీ ఈ కౌంటర్లో తాజాగా అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రత్యర్థి కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ సైతం దేశీ మొబైల్‌ సేవల రంగంలో మూడు కంపెనీలకు తావున్నట్లు వ్యాఖ్యానించిన విషయం విదితమే. కాగా.. ఉదయం 11 ప్రాంతం‍లో వొడాఫోన్‌ ఐడియా షేరు ఎన్‌ఎస్‌ఈలో 6.5 శాతం పతనమై రూ. 3.60 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 4 వద్ద గరిష్టాన్ని తాకినప్పటికీ తదుపరి రూ. 3.50 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఇతర కౌంటర్లలో భారతీ ఎయిర్‌టెల్‌ షేరు 0.7 శాతం పుంజుకుని రూ. 533 వద్ద కదులుతోంది. రిలయన్స్‌ జియో మాతృ సంస్థ ఆర్‌ఐఎల్‌ షేరు 0.6 శాతం నీరసించి రూ. 1437 వద్ద ట్రేడవుతోంది.You may be interested

ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ ధర శ్రేణి రూ.750-755

Tuesday 25th February 2020

మార్చి 2న ఐపీఓ ప్రారంభం న్యూఢిల్లీ: ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ విభాగమైన ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ తన ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ధర శ్రేణిని నిర్ణయించింది. మార్చి 2న మొదలై 5న ముగిసే ఈ ఐపీఓకు ధర శ్రేణిని రూ.750-755గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. అలాగే అర్హత కలిగిన ప్రతి ఎంప్లాయిలకు డిస్కౌంట్‌ కింద ప్రతి షేరును రూ.75లకే విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఐపీఓ కోసం బిడ్ లాట్‌ను

నేటి వార్తల్లోని షేర్లు

Tuesday 25th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు ఎన్‌టీపీసీ: ఎన్‌ఈఈపీసీఓ లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 100 శాతం, టెహ్రీ హైడ్రో పవర్‌ కాంప్లెక్స్‌లో 74.5 శాతం వాటాను ఎన్‌టీపీసీ కొనుగోలు చేయడానికి సీసీఐ ఆమోదం తెలిపింది. ఐఆర్‌బీ: ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ట్రస్ట్‌లో జీఐసీ అనుబంధ సంస్థ రూ.4,400 కోట్ల పెట్టుబడులు పెడతానని ఒప్పందం చేసుకోగా, తొలిదశలో రూ.3,753 కోట్లును ఐఆర్‌బీకి పెట్టుబడి కింద ఇచ్చింది. ట్రస్ట్‌లో ఐఆర్‌బీకి 51

Most from this category