News


వొడాఫోన్‌-ఐడియా 17 శాతం క్రాష్‌

Thursday 14th November 2019
Markets_main1573704755.png-29575

టెలికాం ఏజీఆర్‌(అడ్జస్టడ్‌ గ్రాస్‌ రెవెన్యూ) బకాయిలతో కలిపి, ప్రభుత్వం వేగంగా ఉపశమన ప్యాకేజిని ప్రకటించకపోతే, ఆదిత్య బిర్లా గ్రూప్‌, వొడాఫోన్‌-ఐడియాను దివాలాకు వదిలేస్తారన్న వార్తలు వెలువడటంతో ఆ కంపెనీ షేరు గురువారం 17 శాతం పతనమయ్యింది. ఈ కంపెనీ సీనియర్‌ ఎక్సిక్యూటివ్‌ అధికారి పేర్కొన్న వ్యాఖ్య ద్వారా పై వార్త వెలువడింది. వొడాఫోన్‌-ఐడియా ఏజీఆర్‌ బకాయిలు రూ. 39,000 కోట్లుగా ఉన్న విషయం తెలిసిందే. ‘టెలికాం కంపెనీలు తప్ప ఈ వ్యాపారంలో అందరూ లాభపడుతున్నారు. ఈ వ్యాపారం ఆశాజనకంగా లేదు. ఇది గ్రూప్‌ లాభాలు పడిపోడానికి కారణమవుతోంది. ఇటువంటి క్లిష్టమైన వ్యాపారానికి మూలధనాన్ని కేటాయించడంపై ఆలోచించాల్సిన అవసరం ఉంది’ అని ఈ సీనియర్‌ ఎక్సిక్యూటివ్‌ అన్నారు. వొడాఫోన్‌-ఐడియాకు సంబంధించి అనేక సమస్యలు చుట్టుముట్టడంతో ఈ కంపెనీ షేరు గురువారం ట్రేడింగ్‌లో భారీగా పడిపోయింది. ఉదయం 9.33 సమయానికి వొడాఫోన్‌-ఐడియా షేరు విలువ 17శాతం పతనమయ్యి, రూ. 3.05 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో రూ. 3.70 వద్ద ముగిసిన ఈ షేరు, గురువారం సెషన్లో రూ. 3.35 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైంది. ఒకనొక దశలో రూ. 2.85 వద్ద జీవిత కాల కనిష్ఠానికి పడిపోయింది. 



You may be interested

నేడు క్యూ2 ఫలితాలను వెల్లడించే కంపెనీలు

Thursday 14th November 2019

భారతీ ఎయిర్‌టెల్‌, ఓఎన్‌జీసీ, వోడాఫోన్‌ ఐడియా, సెయిల్‌, గ్రాసీం ఇండస్ట్రీస్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, ఎంఈపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, బాలక్రిష్ణ ఇండస్ట్రీస్‌, ఎంటీఎన్‌ఎల్‌, జీవీకే పవర్‌, సుజ్లాన్‌ ఎనర్జీ, జీఎంఆర్‌ ఇన్ఫ్రా, యూనిటెక్‌, పీఎఫ్‌సీ, రిలయన్స్‌ పవర్‌, సద్భవన్‌ ఇంజనీరింగ్స్‌, డిష్‌ టీవీ, పేజ్‌ ఇండస్ట్రీస్‌, ప్రభాత్‌ డైరీ, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, హెచ్‌సీసీ, అపోలో హాస్పిటల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, మెయిల్‌, ఐడీఎఫ్‌సీ, ఫ్యూచర్‌ రిటైల్‌,

నష్టాల ప్రారంభం

Thursday 14th November 2019

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో భారత్‌ స్టాక్‌ సూచీలు గురువారం స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 20 పాయింట్ల నష్టంతో 40,095 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 11,825 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

Most from this category