STOCKS

News


వొడా-ఐడియా 10% క్రాష్‌, నష్టాల్లో ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ షేర్లు!

Thursday 21st November 2019
Markets_main1574310099.png-29750

టెలికాం కంపెనీలు చెల్లించవలసిన ఏజీఆర్‌(ఎడ్జస్టడ్‌ గ్రాస్‌ రెవెన్యూ) బకాయిలను మాఫీ చేయడం లేదా ఈ బకాయిలు చెల్లించడానికి టెలికాం కంపెనీలకు కొంత సమయం ఇవ్వడం వంటి ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద లేవని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ బుధవారం పార్లమెంట్‌లో తెలిపారు. కాగా గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వం టెలికాం కంపెనీలకు ఉపశమన ప్యాకేజిని ప్రకటిస్తుందనే వార్తలు మార్కెట్‌ వర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి. ఫలితంగా గత కొన్ని సెషన్లలో వోడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ షేర్లు పాజిటివ్‌గా ట్రేడయ్యాయి. కానీ ఇలాంటి ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద లేవని కేంద్ర మంత్రి ప్రకటించడంతో గురువారం సెషన్లో ఈ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.44 సమయానికి వొడాఫోన్‌ ఐడియా షేరు 9.22 శాతం నష్టపోయి రూ. 6.40  వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 7.05 వద్ద ముగిసిన ఈ షేరు, గురువారం సెషన్‌లో రూ. 7.75 వద్ద ప్రారంభమైంది. అదేవిధంగా భారతీ ఎయిర్‌టెల్‌ షేరు 1.68 శాతం పడిపోయి రూ. 429.95 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు గత సెషన్‌లో రూ. 437.30 వద్ద ముగిసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 0.66 శాతం నష్టపోయి రూ. 1,537.50  వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు గత సెషన్‌లో రూ. 1,547.65 వద్ద ముగిసింది. You may be interested

మీ ఫోన్‌ బిల్లు ఎంత పెరుగుతుందో తెలుసా?

Thursday 21st November 2019

రాబోయే రోజుల్లో వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీలు టారిఫ్‌ల పెంపుదలో జియో చూపే బాటలో నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జియో 15 శాతం మేర టారిఫ్‌లు పెంచితే ఎయిర్‌టెల్‌, వీఐఎల్‌ కనీసం 30 శాతం వరకు టారిఫ్‌లు పెంచుకోవచ్చని భావిస్తున్నారు. గతంలో జియో 15శాతం మేర టారిఫ్‌లు పెంచింది, ఈ దఫా కూడా అంతమేర పెరుగుదల ఉండొచ్చని నిపుణుల అంచనా. రుణభారాలతో కుంగిపోతున్న టెలికం కంపెనీలకు ఈ

ఒడిదుడుకుల ప్రారంభం

Thursday 21st November 2019

పలు ప్రతికూల, సానుకూల సంకేతాల నడుమ గురువారం ప్రారంభంలో స్టాక్‌ సూచీలు స్వల్ప హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 85 పాయింట్ల లాభంతో 40,737 పాయింట్ల వద్ద ప్రారంభమైన కొద్ది నిముషాల్లోనే స్వల్ప నష్టాల్లోకి మళ్లింది. ఇదే రీతిలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 12,025 పాయింట్ల వద్ద మొదలై, వెనువెంటనే 12,000 లోపునకు పడిపోయింది. దేశీయంగా టెలికాం కంపెనీలకు స్పెక్ర్టం చెల్లింపుల్లో ప్రభుత్వం ఊరటనివ్వడం, కొన్ని ప్రభుత్వ

Most from this category