News


వోడాఫోన్‌ 48 శాతం ర్యాలీ

Wednesday 19th February 2020
Markets_main1582100502.png-31933

వోడాఫోన్‌ ఐడియా షేరు బుధవారం మిడ్‌సెషన్‌ సమయానికి 48శాతం లాభపడింది. నేడు బీఎస్‌ఈలో ఇండెక్స్‌లో ఈ షేరు రూ.3.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ కంపెనీకి సంబంధించిన బ్యాంక్‌ గ్యారెంటీలను ప్రభుత్వం నగదుగా మార్చుకోకపోవొచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోలుకు మొగ్గుచూపారు. అలాగే గడిచిన ఏడు రోజుల్లో 42శాతం నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో జరిగిన షార్ట్‌ కవరింగ్‌ చేయడం కూడా షేరు ర్యాలీ చేసింది. ఒకదశలో 48.18శాతం లాభపడి రూ.4.49 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యహ్నం గం.1:30ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.3.03)తో పోలిస్తే 31శాతం లాభంతో రూ.3.99 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.2.61లు, రూ.21.74 నమోదయ్యాయి. 



You may be interested

వెల్లువెత్తుతున్న లిక్విడిటీతోనే మార్కెట్‌ ర్యాలీ

Wednesday 19th February 2020

ప్రపంచ వడ్డీ రేట్లు తగ్గే చాన్స్‌ తక్కువే పసిడి ధరలు మరింత పెరగకపోవచ్చు సుందరం ఎంఎఫ్‌ ఎండీ సునీల్‌ అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఇండియావంటి ప్రత్యామ్నాయాలవైపు విదేశీ ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ఇక దేశీయంగా చూస్తే ఇక్కడ కూడా ఈక్విటీల పోలిస్తే ఇతర సాధనాలలో పెద్దగా పెట్టుబడి అవకాశాలు కనిపించడంలేదు. దీంతో దేశీ మార్కెట్లు లిక్విడిటీ కారణంగా ర్యాలీ చేస్తున్నాయంటున్నారు సుందరం మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సీఈవో సునీల్‌

52 వారాల కనిష్టానికి 86 షేర్లు!

Wednesday 19th February 2020

బుధవారం 52 వారాల కనిష్టానికి 86 షేర్లు చేరాయి. వీటిలో అంబికా కాటన్‌ మిల్స్‌, ఆరో గ్రీన్‌టెక్‌, ఆటోమోటివ్‌ స్టాంపింగ్స్‌ అండ్‌ అసెంబ్లీస్‌, బాల్మర్‌ లారీ అండ్‌ కంపెనీ, బంధన్‌ బ్యాంక్‌, సీఎల్‌ ఎడ్యుకేట్‌, ఎల్గీ ఎక్విప్‌మెంట్స్‌, ఎక్సెల్‌ ఇండస్ట్రీస్‌, ఫ్యూచర్‌ కన్జూమర్‌, గాయత్రీ ప్రాజెక్ట్స్, జీహెచ్‌సీఎల్‌, జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇండో రామా సింథటిక్స్‌ ఇండియా, ఐవీపీ, మోడీ రబ్బర్‌, ఆప్టిమమ్‌ ఇన్‌ఫ్రాకమ్‌, ఓరియంట్‌ బెల్‌, సద్భావ్ ఇంజనీరింగ్‌,

Most from this category