News


వొడాఫోన్‌ గెలాప్‌- ఎయిర్‌లైన్స్‌ బోర్లా

Friday 13th March 2020
Markets_main1584093522.png-32466

కనిష్టం నుంచి 53 శాతం పెరిగిన వొడా ఐడియా
రెండో రోజూ 10 శాతం కుప్పకూలిన స్పైస్‌జెట్‌

ఇంట్రాడేలో 14 శాతం పతనమైన ఇంటర్‌గ్లోబ్‌

ఏజీఆర్‌ బకాయిలపై టెలికం కంపెనీలకు ఉపశమనాన్ని కల్పిస్తూ కేంద్ర కేబినెట్‌ సహాయక ప్యాకేజీ(బెయిలవుట్‌)ను ప్రకటించే వీలున్నట్లు పెరిగిన అంచనాలు వొడాఫోన్‌ ఐడియా కౌంటర్‌కు డిమాండ్‌ను పెంచాయి. దీంతో ఈ కౌంటర్‌ మార్కెట్ల బాటలో వేగంగా టర్న్‌అరౌండ్‌ సాధించింది. అయితే మరోపక్క విమానయానం, టూరిస్ట్‌ వీసాలపై నిషేధం వార్తలతో ఎయిర్‌లైన్స్‌ కౌంటర్‌ స్పైస్‌జెట్‌ వరుసగా రెండో రోజూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వివరాలు చూద్దాం..

వొడాఫోన్‌ ఐడియా
టెలికం శాఖకు చెల్లించవలసి ఉన్న ఏజీఆర్‌ బకాయిల విషయంలో కేం‍ద్ర కేబినెట్‌ రిలీఫ్‌ ప్యాకేజీని ప్రకటించనున్నట్లు అంచనాలు పెరిగాయి. భారీ రుణాలు, నష్టాలతో సమస్యలు ఎదుర్కొంటున్న మొబైల్‌ టెలికం కంపెనీలకు ఉపశమనాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు వెలువడుతున్న అంచనాలు ప్రధానంగా వొడాఫోన్‌ ఐడియా కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్ల బాటలో తొలుత 20 శాతంపైగా కుప్పకూలి రూ. 3.85 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. తదుపరి మార్కెట్లు జోందుకోవడంతోపాటు.. కేబినెట్‌ నిర్ణయాలపై అంచనాలతో 33 శాతం దూసుకెళ్లింది. రూ. 5.80 వద్ద గరిష్టానికి చేరింది. సాయంత్రం 3.16 ప్రాంతంలో 29 శాతం జంప్‌చేసి రూ. 5.40 వద్ద ట్రేడవుతోంది. 

స్పైస్‌జెట్‌- ఇండిగో
ప్రపంచవ్యాప్తంగా వందలకొద్దీ విమాన సర్వీసులు రద్దవుతున్న నేపథ్యంలో దేశీ ఎయిర్‌లైన్‌ కంపెనీల కౌంటర్లలో వరుసగా రెండో రోజు అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి స్పైస్‌జెట్‌ కౌంటర్‌ 10 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకింది. బీఎస్‌ఈలో రూ. 4.85 నష్టంతో రూ. 43.70 వద్ద ఫ్రీజయ్యింది. చమురు ధరలు తగ్గినప్పటికీ గురువారం సైతం ఈ షేరు 20 శాతం కుప్పకూలిన విషయం విదిమతమే. దేశీయంగానూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటం, ప్రభుత్వం టూరిస్ట్‌ వీసాలపై నియంత్రణలు విధించడం, పలు కంపెనీలు ఇళ్ల నుంచే సేవలను పొందే సన్నాహాలు చేయడం వంటి ప్రతికూల అంశాలు ఎయిర్‌లైన్స్‌ కంపెనీలను దెబ్బతీస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఇండిగో సేవల ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేరు సైతం తొలుత 14 శాతం పడిపోయింది. రూ. 866 దిగువన 52 వారాల కనిష్టానికి చేరింది. తదుపరి కోలుకుంది. ఎన్‌ఎస్‌ఈలో చివరికి 2 శాతం నష్టంతో రూ. 1000కు చేరింది.


 You may be interested

పతనం- రికవరీ.. రెండూ రికార్డులే

Friday 13th March 2020

తొలుత 3091 పాయింట్లు పడిన సెన్సెక్స్‌ 29,389 వద్ద ఇంట్రాడే కనిష్టం నమోదు తదుపరి 34,769ను దాటేసిన సెన్సెక్స్‌ కనిష్టం నుంచి 5380 పాయింట్ల హైజంప్‌ చివరికి 1325 పాయింట్లు ప్లస్‌లో ముగింపు ఇవన్నీ సరికొత్త రికార్డులే కావడం విశేషం వారాంతాన దేశీ స్టాక్‌ మార్కెట్లు చరిత్రలోనే సరికొత్త ఫీట్‌ను సాధించాయి. తొలుత మార్కెట్‌ చరిత్రలోనే అత్యధికంగా సెన్సెక్స్‌ 3091 పాయింట్లు పడిపోయింది. ఇది 10 శాతం పతనంకావడంతో 45 నిముషాలపాటు ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్‌ నిలిచిపోయింది. ఆపై తిరిగి

యస్‌బ్యాంక్‌ వాటా విక్రయానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం ..!

Friday 13th March 2020

సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంకులో ఎస్‌బీఐ వాటా కొనుగోలును కేంద్ర కేబినేట్‌ ఆమోదం తెలిపినట్లు శుక్రవారం వార్తలు వెలువడ్డాయి.  ఆర్‌బీఐ రూపొందించిన యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళిక ముసాయిదా ప్రకారం వ్యూహాత్మక ఇన్వెస్టర్లు బ్యాంకులో 49 శాతం వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూడేళ్ల లోపు దీన్ని 26 శాతానికి లోపు తగ్గించుకోవడానికి ఉండదు. ప్రణాళికను ప్రకటించిన మరుసటి రోజే ఆర్‌బీఐ యస్ బ్యాంకుపై

Most from this category