News


వొడాఫోన్‌ఐడియా ఆస్తుల విక్రయ సన్నాహాలు!

Wednesday 11th December 2019
Markets_main1576038429.png-30169

ఆప్టిక్‌ ఫైబర్‌ వ్యాపారాన్ని విక్రయించేందుకు బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌తో, డేటా సెంటర్‌ను విక్రయించేందుకు ఎడెల్‌వీజ్‌ గ్రూప్‌తో వొడాఫోన్‌ఐడియా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఏజీఆర్‌ తదితర బకాయిలను జనవరి కల్లా చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో కంపెనీ 250 కోట్ల డాలర్లను సమీకరించాల్సి ఉంది. ఇందుకోసం వివిధ అసెట్స్‌ను విక్రయించేందుకు నిర్ణయించింద. బ్రూక్‌ఫీల్డ్‌కు 156000 కిలోమీటర్ల ఆప్టిక్‌ ఫైబర్‌ విక్రయానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, ఇందుకు బోఫాఎంఎల్‌, మోర్గాన్‌స్టాన్లీ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. నవీ ముంబైలోని డేటా సెంటర్‌ను ఎడెల్‌వీజ్‌ తన అనుబంధ సంస్థద్వారా కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఈ విషయమై బ్రూక్‌ఫీల్డ్‌, ఎడెల్‌వీజ్‌ స్పందించలేదు. ఫైబర్‌నెట్‌వర్క్‌ వ్యాపారం విలువ 150- 200 కోట్ల డాలర్లుంటుందని, డేటాసెంటర్‌ విలువ 60 నుంచి వంద కోట్ల డాలర్లుంటుందని అంచనా.

అక్టోబర్‌ 24న సుప్రీంకోర్టు ఏజీఆర్‌ తీర్పునిచ్చింది. మూడునెలల్లో ఈ బకాయిలు చెల్లించాలని తెలిపింది. వొడాఫోన్‌ ఐడియా రూ. 53వేల కోట్లను ఏజీఆర్‌ బకాయిల కింద చెల్లించాల్సిఉంది. ఆస్తుల విక్రయానంతరం వచ్చిన మొత్తాన్నిబట్టి మిగిలిన బకాయిలు తీర్చేందుకు, క్యాపిటల్‌ అవసరాలకు ఎంత మొత్తం కావాల్సిఉంటుందో లెక్కతేలనుంది. అయితే ఆప్టికల్‌ ఫైబర్‌ రంగంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ వ్యాపారాన్ని అమ్మడం అంత తేలిక కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టెలికం పరిశ్రమే కష్టాల్లో ఉన్నందున ఈ వ్యాపారానికి ఎంత ధర పలుకుతుందో చెప్పలేమని, అసలెవరైనా కొంటారో లేదో తెలియదని చెప్పారు. అయితే ఎలాగైనా నిధులు సమీకరించాల్సిన పరిస్థితి ఉన్నందున కంపెనీ ఇతర సంస్థలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. వీటితోపాటు అనుబంధ టవర్‌ సంస్థలో వాటాను సైతం విక్రయించి సొమ్ము చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఏజీఆర్‌ బకాయిలను గడువులోపు చెల్లించాలని ప్రభుత్వం గతవారం టెల్కోలకు వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో ఎలాగైనా నిధులు సమీకరించక తప్పని పరిస్థితి కంపెనీ ముందుంది. అందుకే ఆస్తుల విక్రయానికి తొందరపడుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. You may be interested

యస్‌బ్యాంక్‌ 19.50శాతం క్రాష్‌

Wednesday 11th December 2019

యస్‌బ్యాంక్‌లో పెట్టుబడులపై అనిశ్చితి కొనసాగుతుండంతో ఈ బ్యాంక్‌ షేరు బుధవారం మిడ్‌సెషన్‌ సమయానికి కల్లా 19.50శాతం నష్టపోయింది. నిన్న జరిగిన బోర్డు సమావేశంలో సైటాక్స్‌ హోల్డింగ్స్‌, సైటాక్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌ ప్రతిపాదించిన 50 కోట్ల డాలర్లకు సుముఖత చూపుతున్నట్లు బ్యాంక్‌ అధికారులు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చారు. అలాగే ఎర్విన్‌ సింగ్ బ్రెయిచ్‌/ఎస్‌పీజీసీ హోల్డింగ్‌ ప్రతిపాదించిన 1.2బిలియన్‌ డాలర్ల బిడ్డింగ్‌ ఆఫర్‌పై డైరెక్టర్ల బోర్డు ఇంకా పరిశీలన జరుపుతుందని పేర్కోంది. వాస్తవానికి

హ్యుందాయ్‌ కార్ల ధరలు పెంపు..!

Wednesday 11th December 2019

జనవరి ఒకటి నుంచి అమల్లోకి న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్‌ ఇండియా తన వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని తెలియజేసింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదలాయించే క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మోడల్‌ ఆధారంగా పెంపు ఉండనున్నట్లు చెప్పిన కంపెనీ.. ఎంత మేర ధరలు పెరగనున్నాయనే అంశాన్ని  వెల్లడించలేదు. మరోవైపు మారుతీ

Most from this category