News


విశాకా, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ అప్‌- జేఎస్‌డబ్ల్యూ వీక్‌

Monday 27th January 2020
Markets_main1580115211.png-31237

ప్రపంచ ఇన్వెస్టర్లలో తలెత్తిన కరోనా వైరస్‌ భయాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. మధ్యాహ్నం 2 ప్రాంతంలో సెన్సెక్స్‌ 240 పాయింట్లు క్షీణించి 41,373కు చేరగా.. నిఫ్టీ 71 పాయింట్ల వెనకడుగుతో 12,172 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ విభిన్న వార్తల కారణంగా విశాకా ఇండస్ట్రీస్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి విశాకా, ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌ లాభాలతో సందడి చేస్తుంటే.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నష్టాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం..

విశాకా ఇండస్ట్రీస్‌ 
ఆటమ్‌ బ్రాండుతో రూపొందిస్తున్న సోలార్‌ ఫోటోవోల్టాయిక్‌ మాడ్యూల్స్‌కు గ్లోబల్‌ సేఫ్టీ సైన్స్‌ కంపెనీ యూఎల్‌ నుంచి అత్యున్నత గుర్తింపు(సర్టిఫికేషన్‌) లభించినట్లు విశాకా ఇండస్ట్రీస్‌ తాజాగా పేర్కొంది. అత్యంత కఠినమైన ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రోటెక్నికల్‌ కమిషన్‌(ఐఈసీ), యూఎల్‌ ప్రామాణిక పరీక్షలలో పీవీ మాడ్యూల్స్‌ విజయం సాధించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో విశాకా ఇండస్ట్రీస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.6 శాతం జంప్‌చేసి రూ. 288 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 293 వరకూ ఎగసింది.

ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్‌
ఈ  ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్‌ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ3లో నికర లాభం 178 శాతం దూసుకెళ్లి రూ. 162 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర అమ్మకాలు సైతం 154 శాతం జంప్‌చేసి రూ. 2681 కోట్లను తాకాయి. పన్నుకు ముందు లాభం 185 శాతం పెరిగి రూ. 312 కోట్లయ్యింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌ షేరు 3 శాతం పుంజుకుని రూ. 392 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 401 వరకూ ఎగసింది.

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌
ఈ  ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ3లో నికర లాభం 87 శాతం పడిపోయి రూ. 211 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర అమ్మకాలు సైతం 12 శాతం తక్కువగా రూ. 17,416 కోట్లను తాకాయి. పన్నుకు ముందు లాభం 82 శాతం వెనకడుగుతో రూ. 436 కోట్లయ్యింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేరు 3.5 శాతం పతనమై రూ. 262 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 258 వరకూ నీరసించింది.



You may be interested

ప్రపంచమార్కెట్లలో ‘‘కరోనా’’ కలవరం..!

Monday 27th January 2020

చైనాతో పాటు ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్‌ వ్యాధి భయాలు ఇప్పుడు ఆర్థిక మార్కెట్లను కలవరపెడుతోంది. చైనాలో సంభవించిన ఈ అనూహ్య సంఘటనతో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై మరోసారి ఆందోళనలు రేకెత్తాయి. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలతో గతవారంలో ఆసియాలో ప్రధాన మార్కెట్లైన హాంగ్‌కాంగ్‌ 2శాతం, షాంఘై 3శాతం, షాంగ్‌జెన్‌ 5శాతం నష్టాలను చవిచూశాయి. ఆర్థిక వృద్ధి మందగమన బెంగతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు 3శాతానికి

బ్యాంకు నిఫ్టీలో బేర్‌పుట్‌ స్ప్రెడ్‌ వ్యూహం!

Monday 27th January 2020

గతవారం బ్యాంకు నిఫ్టీలో గణనీయంగా షార్ట్స్‌ పెరిగాయి. దీంతో ఫ్యూచర్స్‌ ఓఐ సుమారు 20 శాతం పెరిగింది. దీంతో స్వల్పకాలానికి బ్యాంకు నిఫ్టీలో వెనుకంజకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు నిఫ్టీలో బేర్‌ పుట్‌ స్ప్రెడ్‌ వ్యూహం అవలంబించవచ్చని సూచిస్తున్నారు. ఇది ఒక బేరిష్‌ వ్యూహం. ఇందులో ప్రస్తుత మార్కెట్‌ధరకు సమీప పుట్‌ను కొనుగోలు చేయడం, అంతకన్నా దిగువ పుట్‌నువిక్రయించడం చేస్తారు. వ్యూహంలో లాభం

Most from this category