News


ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవో పరిస్థితి ఏంటి..?

Saturday 29th February 2020
Markets_main1582917525.png-32169

కరోనా వైరస్‌ స్టాక్‌ మార్కెట్లను వణికిస్తుంటే... సరిగ్గా ఇదే సమయంలో ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ (ఎస్‌బీఐ కార్డ్‌) ఐపీవో ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఎస్‌బీఐ కార్డ్‌ ఐపీవో పట్ల ఇన్వెస్టర్లలో ఎంతో ఆసక్తి, ఉత్సాహం నెలకొని ఉంది. భారీ సబ్‌స్క్రిప్షన్‌ వస్తుందని, 50 శాతానికి తక్కువ కాకుండా ప్రీమియంతో లిస్ట్‌ అవుతుందన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. కానీ, కరోనా వైరస్‌ ప్రభావంతో గత కొన్ని సెషన్లుగా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు రిస్క్‌ తీసుకునేందుకు ఆసక్తి చూపించిన విదేశీ ఇన్వెస్టర్లు ముఖం చాటేస్తున్నారు. మార్కెట్ల పతనం ఎస్‌బీఐ కార్డ్‌కు దరఖాస్తు చేసుకోవాలని అనుకునే రిటైల్‌ ఇన్వెస్టర్లపై ప్రభావం చూపించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 

దేశంలో ఐదవ అతిపెద్ద ఐపీవోగా వస్తున్న ఎస్‌బీఐ కార్డ్‌ ఇష్యూ మార్చి 2న ప్రారంభమై, 5న ముగియనుంది. మార్కెట్లలో నెలకొన్న వాతావరణం ఐపీవో అవకాశాలను దెబ్బతీస్తుందా? అన్న సందేహం ఇన్వెస్టర్లలో మొదలైంది. ప్రైమరీ మార్కెట్‌తో పోలిస్తే ఎస్‌బీఐ కార్డ్‌ ఇష్యూ విషయంలో పెద్ద తేడా ఏమీ ఉండకపోవచ్చని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులు మరీ ‍దారుణంగా మారితే, ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌పైనా ప్రభావం చూపించొచ్చని అంచనా వేస్తున్నారు. ఇలా జరిగితే లిస్టింగ్‌ రోజున ప్రీమియంపై కచ్చితంగా ప్రభావం పడుతుందంటున్నారు. 

 

కానీ, అన్‌లిస్టెడ్‌ మార్కెట్లో ట్రేడర్లు, బ్రోకర్లు మాత్రం ఎస్‌బీఐ కార్డ్‌ ఐపీవో పట్ల బుల్లిష్‌గా ఉన్నారు. చక్కని ప్రీమియంతో లిస్ట్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. గ్రే మార్కెట్లో ఒక్కో షేరుకు ఇష్యూ ధరపై రూ.350-365 ప్రీమియం పలుకుతోంది. తాజా మార్కెట్‌ పరిణామాలు, ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమైన తర్వాత ప్రీమియంలో మార్పులు వచ్చే అవకాశం లేకపోలేదు. షేరు ధరల శ్రేణిని ప్రకటించడానికి ముందు రూ.250-280 వరకు ప్రీమియం కోట్‌ అవ్వగా, ధరల శ్రేణి వెల్లడయ్యాక ప్రీమియం పెరిగిందని అన్‌లిస్టెడ్‌జోన్‌కు చెందిన దినేష్‌ గుప్తా తెలిపారు. స్టాక్‌ మార్కెట్లు వరుసగా క్షీణిస్తు‍న్నా కానీ, ఎస్‌బీఐ కార్డ్‌కు డిమాండ్‌ బలంగానే ఉందన్నారు. ఎస్‌బీఐ కార్డ్‌కు డిమాండ్‌లో ఏ మాత్రం మార్పు లేదని అన్‌లిస్టెడ్‌ షేర్ల లావాదేవీలు చూసే అభిషేక్‌ సెక్యూరిటీస్‌కు చెందిన సందీప్‌ గినోడియా సైతం తెలిపారు. ఐపీవోకు మంచి స్పందన వస్తే లిస్టింగ్‌ రోజున లాభాలకు అవకాశం ఉంటుందని, ఏడాది నుంచి రెండేళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్‌ కొనసాగించే వారికి మంచి పెట్టుబడి అవకావం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 



You may be interested

ఏడేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి

Saturday 29th February 2020

డిసెంబర్‌ త్రైమాసికంలో 4.7 శాతంగా నమోదు అంతక్రితం త్రైమాసికంలో 4.5 శాతం తాజాగా 5.1 శాతానికి సవరణ పరుగులు తీస్తున్న ద్రవ్యలోటు బడ్జెట్‌ అంచనాలను దాటి 121 శాతానికి న్యూఢిల్లీ: ఇంటా, బయటా ఎన్నో సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో, దేశ జీడీపీ వృద్ధి రేటు డిసెంబర్‌ త్రైమాసికంలో ఏడేళ్ల కనిష్టానికి తగ్గిపోయింది. 4.7 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) జూలై-సెప్టెంబర్‌ కాలంలో వృద్ధి రేటును గతంలో పేర్కొన్న 4.5 శాతం నుంచి 5.1 శాతానికి

కరోనా వైరస్‌ దెబ్బకు బేర్‌మన్న బుల్‌

Friday 28th February 2020

సెన్సెక్స్‌ 1,448.37 పాయింట్లు 4ఏళ్లలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసిన నిఫ్టీ ఈక్విటీ మార్కెట్లను కరోనా వ్యాధి భయాలు వీడటం లేదు. ఫలితంగా దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 1,448.37 పాయింట్లు నష్టపోయి 38297.29 వద్ద, నిఫ్టీ 431.50 పాయింట్లు కోల్పోయి 11201.80 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ గడిచిన నాలుగేళ్లలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. సూచీలు వరుసగా ఆరోరోజూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 111 పాయింట్ల నష్టంతో వద్ద, నిఫ్టీ 111 పాయింట్లను కోల్పోయి

Most from this category