News


వైరస్‌పై మార్కెట్‌ భయాలు తాత్కాలికమే!

Thursday 30th January 2020
Markets_main1580379992.png-31345

మార్కెట్లు మరలా పుంజుకుంటాయంటున్న నిపుణులు
చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రపంచ మార్కెట్లను అల్లకల్లోలం చేస్తోంది. వైరస్‌ భయాలతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనాలవైపు దృష్టి సారిస్తున్నారు. దేశీయ సూచీలు సైతం ఈ మేరకు నెగిటివ్‌గా స్పందిస్తున్నాయి. గురువారం నిఫ్టీ దాదాపు 94 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం నిఫ్టీ కీలక 12100 పాయింట్ల దిగువకు వచ్చింది. కానీ ఇలాంటి అంటువ్యాధుల భయాలు ప్రబలినప్పుడు వచ్చే పతనాలు తాత్కాలికమేనని, మార్కెట్లు తదనంతర దశలో దూసుకుపోతాయని గత గణాంకాలు ఆధారంగా నిపుణులు భావిస్తున్నారు. గతంలో ఇలాంటి అంటువ్యాధుల కారణంగా వచ్చిన పతనాలు వెంటనే ముగిశాయని, తర్వాత దశల్లో సూచీలు మంచిలాభాలు చూశాయని చెబుతున్నారు. 
= 2002-03 సార్స్‌ ప్రబలినప్పుడు నెలరోజుల్లో సూచీలు దాదాపు 5 శాతం క్షీణించాయి. కానీ ఆపై ఆరు నెలల్లో 29 శాతం మేర లాభాల ర్యాలీ జరిపాయి. 
= 2009లో వచ్చిన స్వైన్‌ఫ్యూ భయాలు మార్కెట్‌ను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. ఆ సమయంలో సూచీలు ఒక్క నెలలో 19 శాతం, ఆరు నెలల్లో 79 శాతం మేర లాభపడ్డాయి. 
వివిధ అంటువ్యాధులు ప్రబలిన సమయాలు.. మార్కెట్‌ రియాక‌్షన్స్‌...

ప్రస్తుత వైరస్‌ వల్ల కలిగిన మరణాలు సార్స్‌ సమయంలో మరణాలతో పోలిస్తే కేవలం ఒక్క శాతమేనని, అందువల్ల బడ్జెట్‌ అనంతరం ఒకటిరెండు వారాల్లో సూచీలు సాధారణ స్థితికి రావచ్చని ఈక్వినోమిక్స్‌ రిసెర్చ్‌ తెలిపింది. వైరస్‌ ఎంత తొందరగా వ్యాపిస్తున్నదనేది ముఖ్యమని, కానీ భారత్‌లాంటి మార్కెట్‌పై ఇలాంటి వైరస్‌ భయాల ప్రభావం తక్కువేనని టార్గెట్‌ ఇన్వెస్టింగ్‌ అభిప్రాయపడింది. ప్రస్తుతం మార్కెట్‌కు కీలక పరిణామం కేంద్ర బడ్జెటని, దీని ఆధారంగా తదుపరి కదలికలు సూచీల్లో ఉంటాయని ఎక్కువమంది నిపుణులు భావిస్తున్నారు. 



You may be interested

నష్టాల మార్కెట్లో క్యూ కట్టిన ఫార్మా కంపెనీలు

Thursday 30th January 2020

గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. అధికంగా ఫార్మా ఇండెక్స్‌ 2.15 శాతం తగ్గి 8,231.60 వద్ద ముగిసింది. ఈ ఇండెక్స్‌లో భాగమైన దివీస్‌ల్యాబ్‌ 0.3 శాతం పెరిగి 1,967.90 వద్ద, డాక్టర్‌ రెడ్డీస్‌ 0.18 శాతం పెరిగి 3,154.00 వద్ద, బయోకాన్‌ 0.99 శాతం తగ్గి 294.50 వద్ద, సన్‌ఫార్మా 1.81 శాత తగ్గి 441.95 వద్ద,  కెడిలా హెల్త్‌కేర్‌ 2.19 శాతం తగ్గి 267.50 వద్ద, లుపిన్‌

ప్రపంచ మార్కెట్ల దెబ్బ- సెన్సెక్స్‌ బోర్లా

Thursday 30th January 2020

సెన్సెక్స్‌ 285 పాయింట్లు పతనం 94 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ ఫార్మా కౌంటర్లు కుదేల్‌ ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ డీలా జనవరి డెరివేటివ్‌ సిరీస్‌ చివరి రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు బోర్లాపడ్డాయి. ఇందుకు పలు అంశాలు కారణంకాగా.. సెన్సెక్స్‌ 285 పాయింట్లు పతనమైంది. 41,000 పాయింట్ల దిగువన 40,914 వద్ద ముగిసింది. ఇదేవిధంగా నిఫ్టీ 94 పాయింట్లు కోల్పోయి 12,036 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్‌ ఆందోళనలతో మరోసారి ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. దీనికితోడు

Most from this category