News


వేదాంత షేరు 2% అప్‌!

Monday 2nd March 2020
Markets_main1583129491.png-32212

సోమవారం వేదాంత కంపెనీ షేరు 2 శాతం పెరిగింది. ఉదయం 11గంటల ప్రాంతంలో వేదాంత షేరు 2.41 శాతం పెరిగి 116.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) మెజారిటీ వాటాను కొనేందుకు అందరికంటే ముందు ఆసక్తి కనబర్చిన వేదాంత కంపెనీ ప్రస్తుతం వెనకడుగు వేసింది. బీపీసీఎల్‌ కంపెనీ​విలువ చాలా ఎక్కువగా ఉందని, తుది బిడ్డింగ్‌ పత్రం వచ్చిన తర్వాత పరిశీలిస్తామని వేదాంత కంపెనీ అధినేత అనీల్‌ అగర్వాల్‌  చెప్పడంతో వేదాంత షేరు 2 శాతం పెరిగింది. కాగా బీపీసీఎల్‌ మార్కెట్‌ విలువ రూ.92,464.40 కోట్లుగా ఉంది. దీనిలో రూ. 49,000 కోట్ల విలువైన 53 శాతం ప్రభుత్వ వాటాను విక్రయించనున్నారు. బహిరంగ ఆఫర్‌ ద్వారా రూ.24,000 కోట్ల విలువైన 26 శాతం మైనార్టి వాటాను విక్రయించనున్నారు. 
 You may be interested

లాభాల బాటలో అటో షేర్లు

Monday 2nd March 2020

కరోనా వైరస్‌ ప్రభావంతో ఫిబ్రవరిలో అటో అమ్మకాలు క్షీణించినప్పటికీ..., ఈ రంగానికి చెందిన షేర్లు మాత్రం సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో లాభాల బాటపట్టాయి. మార్కెట్లో నెలకొన్న షార్ట్‌ కవరింగ్‌లో భాగంగా అటోరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ సైతం వాహనరంగ షేర్లకు కొనుగోలు రేటింగ్‌ను సిఫార్సు చేయడం సెంటిమెంట్‌ను బలపరిచింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో

ఎవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ 4 శాతం డౌన్‌

Monday 2nd March 2020

సోమవారం ఎవెన్యూ సూపర్‌ మార్ట్‌ షేరు 4 శాతం పడిపోయింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో 4.04 శాతం తగ్గి 2, 230 వద్ద ట్రేడ్‌ అవుతోంది. భారీ హెచ్చుతగ్గులను నివారించడానికి స్టాక్‌ఎక్సేంజ్‌ ఎవెన్యూ సూపర్‌ మార్ట్స్‌(డీమార్ట్‌) షేర్లను  ట్రేడ్‌ టు టేడ్ర్‌ (టీ సెగ్మెంట్‌)లోకి శుక్రవారం మార్చింది. దీంతో నేడు షేరు 4 శాతం పడిపోయింది. టీసెగ్మెంట్‌లో ఉన్న షేర్లను... ఇన్వెస్టర్లు కొన్న షేర్లను అమ్మడానికిగానీ, అమ్మిన షేర్లను

Most from this category