News


రెలిగేర్‌ నుంచి టాప్‌ రికమండేషన్స్‌

Tuesday 25th February 2020
Markets_main1582623953.png-32081

వచ్చే మూడు నాలుగువారాల్లో మంచి రాబడిని అందించే మూడు రికమండేషన్లను రెలిగేర్‌ బ్రోకరేజ్‌ అందిస్తోంది.
1. వేదాంత: మార్చి ఫ్యూచర్స్‌ను అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 126. స్టాప్‌లాస్‌ రూ. 140. మెటల్‌ కౌంటర్లలో చాలా కౌంటర్లు బలహీనంగా ఉన్నాయి. వీటిలో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. వేదాంత షేరు ఇతర మెటల్‌ షేర్లతో పోలిస్తే పేలవంగా ఉంది. ప్రస్తుతం సరికొత్త బ్రేక్‌డౌన్‌కు రెడీగా ఉంది. ఆరు నెలల కన్సాలిడేషన్‌ షేరులో అప్‌మూవ్‌ తీసుకురాలేకపోయింది. ఇండికేటర్లన్నీ నెగిటివ్‌గా మారాయి.
2. మహానగర్‌ గ్యాస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1180. స్టాప్‌లాస్‌ రూ. 1020. గత ర్యాలీ అనంతరం మూడు వారాలుగా ప్రాఫిట్‌ బుకింగ్‌ చూస్తోంది. అయితే మొత్తంమీద ట్రెడ్‌ పాజిటివ్‌గా ఉంది. తాజా పతనం మరో అప్‌మూవ్‌కు బేస్‌గా పనిచేస్తుంది. అందువల్ల తాజా కరెక‌్షన్‌ను కొనుగోళ్లకు అవకాశంగా మలచుకోవాలి.
3. సన్‌ఫార్మా: మార్చి ఫ్యూచర్స్‌ అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 375. స్టాప్‌లాస్‌ రూ. 420. తొమ్మిది నెలలుగా రూ. 360- 450 మధ్య కదలాడుతూ వస్తోంది. తాజాగా ఈ అవధిలో అప్పర్‌ బ్యాండ్‌ను తాకి మరోమారు దిగువకు వచ్చే క్రమంలో ఉంది. పలు ఇండికేటర్లు షేరులో మరింత డౌన్‌ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. 



You may be interested

నవీన్‌ ఫ్లోరిన్‌, శిల్పా మెడీ.. దూకుడు

Tuesday 25th February 2020

నవీన్‌ ఫ్లోరిన్‌ 20 శాతం హైజంప్‌ శిల్పా మెడికేర్‌ 5 శాతం‍ సర్క్యూట్‌ ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా నవీన్‌ ఫ్లోరిన్‌ ఇంటర్నేషనల్‌, శిల్పా మెడికేర్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ నవీన్‌ ఫ్లోరిన్‌ కౌంటర్‌ 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఈ బాటలో ఫార్మా రంగ కంపెనీ శిల్పా మెడికేర్‌

ఫార్మా షేర్ల పతనం

Tuesday 25th February 2020

మార్కెట్‌ పతనంలో భాగంగా మంగళవారం ఫార్మా షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. ఫలితంగా మిడ్‌సెషన్‌ సమయానికి ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 2.60శాతం నష్టాన్ని చవిచూసింది. నేడు ఈ ఇండెక్స్‌ 8,153.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభం నుంచి ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఒక దశలో 2.66శాతం నష్టాన్ని చవిచూసి 7898.35 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది.

Most from this category