News


52 వారాల కనిష్టానికి వేదాంత

Thursday 1st August 2019
news_main1564651922.png-27478

మెటల్‌ షేర్ల పతనంతో భాగంగా గురువారం వేదాంత షేర్లు భారీ నష్టపోయాయి. నేడు బీఎస్‌ఈలో ఈ షేర్లు రూ.153.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ కోత విధింపు ఇక ముందు కొనసాగపోవచ్చనే పావెల్‌ వాఖ్యలతో మెటల్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మెటల్‌ షేర్లలో అధిక వెయిటేజీ కలిగిన వేదాంత షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒకదశలో 6.50శాతం క్షీణించి రూ.144.05ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ ధర షేరుకు ఏడాది కనిష్ట ధర కావడం గమనార్హం. మధ్యాహ్నం గం.2:45లకు షేరు గతముగింపు(రూ.154.15)తో పోలిస్తే రూ.5.50శాతం నష్టంతో రూ.145 వద్ద ట్రేడ్‌ అవుతోంది. చివరి నెలల్లో షేరు  14శాతం మేర నష్టపోయింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.144.05  రూ.246.90లు నమోదయ్యాయి. 



You may be interested

253 స్టాకులు..ఏడాది కనిష్టానికి

Thursday 1st August 2019

దేశియ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో భారీ నష్టాలవైపు కదులుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో సుమారుగా 253 స్టాకులు వాటి 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. ఆర్తి డ్రగ్స్, అపర్ ఇండస్ట్రీస్, యారో టెక్స్‌టైల్స్‌, బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ గేర్స్, బయోకాన్, కేర్ రేటింగ్స్, కాక్స్ అండ్‌ కింగ్స్, ఎక్సెల్ ఇండస్ట్రీస్, జిటిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హిందూజా వెంచర్స్ షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వీటితో పాటు ఐనాక్స్ విండ్, జైన్ ఇరిగేషన్

బ్రోకరేజ్‌ల డౌన్‌గ్రేడ్‌...జీ డౌన్‌ 10 శాతం

Thursday 1st August 2019

రుణ సంక్షోభం నుంచి గట్టెక్కెందుకు ఇన్వెస్కో ఓపెన్‌ హైపర్‌ ఫండ్‌కు రూ.4224 కోట్ల విలువైన వాటాను విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నప్పటీకీ.., జీ మీడియా షేర్లు గురువారం ట్రేడింగ్‌లో దాదాపు 7 శాతం వరకు క్షీణించాయి. ఎస్సెల్‌ గ్రూప్‌ వ్యూహాత్మకంగా ఫైనాన్షియల్‌ ఇన్వెస్టర్‌కు వాటా విక్రయిచడం ఇన్వెస్టర్లను నిరుత్సాహపరిచినట్లు మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఫైనాన్షియల్‌ ఇన్వెస్టరుకు విక్రయిస్తే యాజమాన్య నిర్వహణ ఎస్సెల్‌ చేతుల్లోనే వుంటుంది. జీ షేర్లను తనఖా పెట్టుకున్న మ్యూచువల్‌

Most from this category