News


వేదాంత 10 శాతం పతనం ..!

Thursday 22nd August 2019
Markets_main1566464945.png-27950

వరుసగా ఐదోరోజూ కూడా వేదాంత షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఈ కంపెనీ షేర్లు గురువారం బీఎస్‌ఈలో ట్రేడింగ్‌లో మరో 10శాతం క్రాష్‌ అయ్యాయి. దేశీయంగా ఆర్థికవృద్ధి మందగమనంతో పాటు ట్రేడ్‌వార్‌తో చైనాలో స్టీల్‌ నిల్వలు పెరగడటంతో అంతర్జాతీయంగా మెటల్‌ ధరలు క్షీణిస్తున్నాయి. ఫలితంగా కంపెనీల ఆదాయాలను, నికర లాభాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుండటంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు మెటల్‌ షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగా వేదాంత షేర్లు సైతం భారీగా నష్టపోతున్నాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.138.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మెటల్‌ షేర్ల పతనంలో భాగంగా 10శాతం నష్టపోయి రూ.125.70 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. మధ్యాహ్నం గం.2:30ని.లకు షేరు కిత్రం ముగింపు(రూ.139.9)తో పోలిస్తే 9శాతం నష్టంతో రూ.127.40 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ షేరు ఏడాది కాలంలో 37.03శాతం మేర నష్టపోయింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.125.70, రూ.246.90లు నమోదయ్యాయి. 



You may be interested

ప్రధాన ఆర్థిక ఉద్దీపన వుండదు: ఎకనామిక్‌ అడ్వజర్‌

Thursday 22nd August 2019

ఆర్థిక వ్యవస్థ కోసం, ప్రభుత్వం ప్రధాన ఉద్దీపన ప్యాకేజిని ప్రకటించే అవకాశాన్ని ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ గురువారం తోసిపుచ్చారు. ‘లాభం ప్రైవేట్, నష్టాలు పబ్లిక్’ అనే సిద్థాంతం ఆర్థికవ్యవస్థకు మంచిది కాదని ఆయన అన్నారు. పరిశ్రమలకు సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి దశలు సాధారణమని, సూర్యాస్తమయ దశలలో పరిశ్రమలకు, ప్రభుత్వం సహకరిస్తుందని ఆశించడం నైతికంగా ప్రమాదకరమని వివరించారు. హీరో మైండ్‌మైన్ సమ్మిట్ 2019 లో మాట్లాడుతూ.. దేశ

షార్ట్‌టర్మ్‌లో ర్యాలీ?.. నో ఛాన్స్‌!

Thursday 22nd August 2019

గ్లోబ్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ అంచనా ఎర్నింగ్స్‌ సీజన్‌లో చాలా కంపెనీలు అంచనాలను అందుకోలేని నేపథ్యంలో స్వల్పకాలంలో మార్కెట్లో ర్యాలీని ఆశించవద్దని గ్లోబ్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ హిమాంశు గుప్తా చెప్పారు. నిఫ్టీ ఇటీవలి కనిష్టాలను కాపాడుకోలేకపోతే క్రమంగా 10100- 10300 పాయింట్ల వరకు పతనం కావచ్చన్నారు. నిఫ్టీకి 10750- 10800 పాయింట్ల వద్ద మంచి మద్దతు ఉందని అంచనా వేశారు. ప్రపంచమార్కెట్లు సహకరించి, ప్రభుత్వం పాజిటివ్‌ ప్రకటన ఏమైనా చేస్తే సూచీలో

Most from this category