News


సంపద సృష్టికి మార్కెట్‌ గురు ఇచ్చే సూచనలు...

Friday 6th September 2019
Markets_main1567709303.png-28222

ఇన్వెస్టర్లలో చాలా మందికి రమేష్‌ దమానీ తెలిసే ఉంటారు. దేశంలో విజయవంతమైన ఇన్వెస్టర్లలో ఆయన కూడా ఒకరు. భారత ఈక్విటీ మార్కెట్లతో ఆయనకు 30 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం. వారెన్‌ బఫెట్‌, రాకేశ్‌ జున్‌జున్‌వాలా ఇలా ఇతర సక్సెస్‌ఫుల్‌ ఇన్వెస్టర్ల నుంచి విలువైన సూచనలను సైతం పొందిన వ్యక్తి. స్టాక్స్‌లో సంపద కూడబెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు తనకున్న అపారమైన మార్కెట్‌ అనుభవం నుంచి ఆయన ఇస్తున్న సూచనలు ఇవి...

 

ముందుగా ఆరంభించాలి... 
ఇన్వెస్టర్లకు సంపద సృష్టించే అంశాల్లో కాలం కూడా ఒకటి. విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచే ఇన్వెస్ట్‌ చేయడం ఆరంభించాలి. తెలివిగా ఇన్వెస్ట్‌ చేయాలి. దాంతో కాంపౌండింగ్‌ ప్రయోజనం సిద్ధిస్తుంది. ఏటా రూ.10 లక్షలను రిటైర్మెంట్‌ కోసం ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, దాన్ని ముందుగానే ఆరంభించడం వల్ల ఎంతో వృద్ధి చెందుతుంది. 30 ఏళ్ల కెరీర్‌లో ప్రతీ మూడేళ్లకు చొప్పున 10 రెట్ల కాంపౌండ్‌ సాధ్యమవుతుంది. ఏటా రూ.10 లక్షల పొదుపు కాస్తా 30 ఏళ్ల తర్వాత రూ.100 కోట్లను సృష్టిస్తుంది. కానీ చేయడం కంటే దీన్ని చెప్పడం సులభం. కాంపౌండింగ్‌ను అర్థం చేసుకుంటే ఆర్థిక స్వేచ్ఛ విషయంలో విజయం సాధించినట్టే. 

 

బేర్‌ మార్కెట్లో వివేకంతో
మార్కెట్లు ప్రతికూలంగా ప్రయాణం చేస్తున్న సమయంలో సహజంగా ఇన్వె‍స్టర్లు తాజా పెట్టుబడుల జోలికెళ్లరు. కానీ, బేర్‌ మార్కెట్లలో తెలివిగా ఇన్వెస్ట్‌ చేయాలి. దాంతో బుల్‌ మార్కెట్లో అధిక రాబడులను అందుకోవచ్చు. మనం ఇప్పుడు ఓ నీడను ఆశ్రయించామంటే గతంలో ఎవరో ఒకరు దాన్ని నాటి ఉంటారు. అలాగే, బేర్‌ మార్కెట్లో పెట్టబడులు భవిష్యత్తులో ఫలాలను ఇస్తాయి. బుల్‌, బేర్‌ మార్కెట్లు ఓ సైకిల్‌ ప్రకారం నడుస్తుంటాయి. ప్రస్తుతానికి బేరిష్‌ దశలో ఉంది. కానీ అదే సమయంలో బెంచ్‌ మార్క్‌సూచీలు స్వల్ప లాభాలతో ఉన్నాయి. ఇది చాలా నిదానంగా నడుస్తున్న బేర్‌ మార్కెట్‌ అని నా భావన. కానీ, ఇది కూడా ముగిసిపోయేదే. 

 

అధ్యయనం
యువ ఇన్వెస్టర్లు ఎంతో చదువుకోవాలి. వారి నైపుణ్యాలను మెరుగుపరిచే మార్గదర్శకుల కోసం చూడాలి. క్రమశిక్షణతో, అధ్యయనం ద్వారా ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మేలు జరుగుతుంది. గొప్ప ఇన్వెస్టర్‌ కావాలంటే రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు చదవాలి. 1979లో సెన్సెక్స్‌ 100 పాయింట్లు. కొన్ని నెలల క్రితమే 40,000ను తాకింది. అంటే 400 రెట్లు పెరిగినట్టు. 

 

భవిష్యత్తు మరింత వృద్ధి
గత 25 ఏళ్ల కంటే రానున్న 25 ఏళ్లు మెరుగ్గా ఉంటుంది. అవకాశాలే పెట్టుబడులను వృద్ధి చేస్తాయి. గత 25 ఏళ్లలో ఎన్నో ర్యాలీలు, కరెక్షన్లను చూశాం. ఆర్థిక సంక్షోభాలు, భౌగోళిక రాజకీయ ఆందోళలను కూడా ఎదుర్కొన్నాం. కానీ, ఇండెక్స్‌ కాంపౌండెడ్‌గా 16-17 శాతం చొప్పున రాబడులను ఇచ్చింది. You may be interested

జియో ఫైబర్‌ వచ్చేసింది...

Friday 6th September 2019

న్యూఢిల్లీ: 4జీ మొబైల్‌ సేవల్లో చౌక టారిఫ్‌లతో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో.. బ్రాడ్‌బాండ్‌ ఇంటర్నెట్‌లో మరొ కొత్త సంచలనానికి తెరతీసింది. దేశీ నెట్‌ వినియోగదారులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న జియో ఫైబర్‌ సేవలను దేశవ్యాప్తంగా 1,600 నగరాల్లో గురువారం ప్రారంభించింది. కనీసం 100 ఎంబీపీఎస్‌(మెగాబైట్స్‌ పర్ సెకన్‌) స్పీడు నుంచి గరిష్టంగా 1 జీబీపీఎస్‌(గిగాబైట్స్‌ పర్‌ సెకన్‌) స్పీడు వరకూ వివిధ రకాల ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. అన్‌లిమిటెడ్‌ బ్రాండ్‌బాండ్‌తో పాటు దేశంలో

రెండేళ్లలో రిలయన్స్‌ స్టాక్‌ రెట్టింపు..?

Friday 6th September 2019

జియో ఫైబర్‌ టారిఫ్‌లను ప్రకటించిన నేపథ్యంలో వచ్చే మూడేళ్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ప్రస్తుత స్థాయి నుంచి రెట్టింపు అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జియో ఫైబర్‌ సేవలను గురువారం కంపెనీ ఆరంభించింది. అలాగే, వివిధ రకాల ప్లాన్లను కూడా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1,600 పట్టణాల్లో కంపెనీ గిగా ఫైబర్‌ సేవలు ఆరంభమయ్యాయి.    ‘‘ఇది నిజంగా మార్కెట్‌లో విధ్వంసం సృష్టించేది. వినియోగదారుల డేటాను పెద్ద లక్ష్యంగా చేసుకున్నారు. ఏఆర్‌పీయూ (ఓ వినియోగదారుని

Most from this category