STOCKS

News


ఈ స్టాక్స్‌ ‘వ్యాల్యూ బై’

Wednesday 13th November 2019
Markets_main1573667567.png-29564

వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌ విధానంలో స్టాక్స్‌ను చౌకగా ఉన్నప్పుడే సొంతం చేసుకోవాలి. అంటే చౌకగా ఉన్నప్పుడు కొనుగోలు చేయడం, మంచి విలువ వచ్చే వరకు వేచి చూడడాన్ని వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌గా చెబుతారు. బీఎస్‌ఈ లిస్టెడ్‌ స్టాక్స్‌ డేటాను గమనిస్తే.. 45 స్టాక్స్‌ పోటీ కంపెనీలతో పోలిస్తే చౌకగా కనిపిస్తూ, వృద్ధి దిశగా సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. వీటిల్లో లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ కూడా ఉన్నాయి. ఆ వివరాలు ఇవి...

 

రెఫెక్స్‌ ఇండస్ట్రీస్‌, ఐయాన్‌ ఎక్సేంజ్‌, ఎవరెస్ట్‌ ఆర్గానిక్స్‌, సుయోగ్‌ టెలిమాటిక్స్‌, గుజరాత్‌ థెమిస్‌, హింద్‌ రెక్టిఫయర్స్‌, డీపక్‌ నైట్రేట్‌, శ్రీగనేష్‌ రెమెడీస్‌, బలరామ్‌పూర్‌ చినీ మిల్స్‌, గుజరాత్‌ గ్యాస్‌, వదిలాల్‌ ఇండస్ట్రీస్‌, బీపీసీఎల్‌, పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌, రైట్స్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌, హుహతమకి పీపీఎల్‌, రీసోనెన్స్‌ స్పెషాలిటీస్‌, రెడింగ్టన్‌ ఇండియా, స్విస్‌గ్లాస్‌కోట్‌, గెలాక్సీ బేరింగ్స్‌, జేబీ కెమికల్స్‌ ఫార్మా, ఆల్కిల్‌ అమైన్స్‌, ఏబీసీ ఇండియా, హెడెల్‌బర్గ్‌ సిమెంట్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌, హోండాసీల్‌ పవర్‌, బీసీపీఎల్‌ రైల్వే ఇన్‌ఫ్రా, ఎన్‌జీఎల్‌ ఫైన్‌కెమ్‌, అంజని పోర్ట్‌ల్యాండ్‌ సిమెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ఆటో, పీఎన్‌సీ ఇన్‌ఫ్రా, మోల్డ్‌టెక్‌ టెక్నాలజీస్‌, హెచ్‌పీసీఎల్‌, రోటోపంప్స్‌, మ్యాక్‌ చార్లెస్‌, ఆన్వర్డ్‌ టెక్నాలజీస్‌, ఏడీఎఫ్‌ ఫుడ్స్‌, జస్ట్‌డయల్‌, బీడీహెచ్‌ ఇండస్ట్రీస్‌, చంద్రప్రభు ఇంటర్నేషనల్‌, డైనమిక్‌ ప్రొడక్ట్స్‌, స్వస్తి వినాయక సింథటిక్స్‌.. ఇవన్నీ వ్యాల్యూ స్టా‍క్స్‌గా కనిపిస్తున్నాయి.

 

ఈ 45 స్టాక్స్‌ ఆర్‌వోసీఈ 15 శాతం కంటే ఎక్కువ. గత 12 నెలల కాల ఎర్నింగ్స్‌ ప్రకారం 20పీఈ కంటే తక్కువలోనే ట్రేడవుతున్నాయి. పోటీ కంపెనీలతో పోల్చి చూసినా తక్కువలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా టెక్నికల్‌ చార్ట్‌ల్లో గోల్డెన్‌ క్రాస్‌ను ఏర్పాటు చేసినవే. 50డీఎంఏ ఎప్పుడైతే 200డీఎంఏ లైన్‌ను క్రాస్‌ చేస్తుందో అప్పుడు గోల్డెన్‌ క్రాసోవర్‌గా చెబుతారు. ఇది బుల్లిష్‌కు సంకేతం. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ కూడా త్వరలోనే ర్యాలీలో పాలు పంచుకుంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇకమీదట మిడ్‌క్యాప్‌ మంచి పనితీరు కనబరుస్తాయని షేర్‌ఖాన్‌కు చెందిన సంజీవ్‌హోట, ఎడెల్‌వీజ్‌కు చెందిన సాహిల్‌ కపూర్‌ పేర్కొన్నారు. రైట్స్‌ స్టాక్‌కు యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ బై కాల్‌ ఇచ్చింది. వైవిధ్యమైన ఆర్డర్ల బుక్‌, అధిక డివిడెండ్‌ చెల్లింపులతో ఆకర్షణీయంగా ఉందని పేర్కొంది. ఈ స్టాక్‌కు యాంటిక్యూ స్టాక్‌ బ్రోకింగ్‌ రూ.378 లక్ష్యిత ధరను ఇచ్చింది. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, దీపక్‌ నైట్రేట్‌కు కూడా బ్రోకరేజీలు బై రేటింగ్‌ ఇచ్చాయి.You may be interested

అదుపు తప్పిన రిటైల్‌ ధరలు

Thursday 14th November 2019

అక్టోబర్‌లో 4.62 శాతం పెరుగుదల 4 శాతం దాటకూడదని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశం ఇదే ధోరణి కొనసాగితే మరో దఫా రేటు కోత అసాధ్యం! న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2019 అక్టోబర్‌లో అదుపు తప్పింది. 4.62 శాతంగా నమోదయ్యింది. అంటే వినియోగ వస్తువుల బాస్కెట్‌ ధర 2018 అక్టోబర్‌తో పోల్చిచూస్తే, 2019 అక్టోబర్‌లో 4.62 శాతం పెరిగిందన్నమాట. గడిచిన 16 నెలల కాలంలో (జూన్‌ 2018లో 4.92

మూడు బ్యాంకులపై కోటక్‌ బుల్లిష్‌

Wednesday 13th November 2019

కోటక్‌ సెక్యూరిటీస్‌ మూడు ప్రైవేటు బ్యాంకులపై బుల్లిష్‌గా ఉంది. అవి ఐసీఐసీఐ బ్యాంకు, కరూర్‌వైశ్యా బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు. రానున్న కాలంలో వీటి ఆర్థిక పనితీరు బాగుంటుందని అంచనా వేస్తోంది. కోటక్‌ సెక్యూరిటీస్‌ అనలిస్ట్‌ సంజీవ్‌ జర్బాడే ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇలా ఉంది.    మార్కెట్ల మూడ్‌  ఏ విధంగా ఉండనుంది? మందగమనం ఇంకా కొనసాగుతోంది. వినియోగ డిమాండ్‌ తగ్గుముఖం పట్టింది. అమ్మకాల వృద్ధిపై అందోళనలు ఉన్నాయి.

Most from this category