ఆటో స్టాక్స్ ఆకర్షణీయం: యోగేష్ మెహతా
By Sakshi

ఆటో రంగ స్టాక్స్ పతనం ఆగినట్టేనని, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, ట్రాక్టర్ల కంపెనీల షేర్లు ప్రస్తుత స్థాయి నుంచి దిద్దుబాటుకు చాలా పరిమిత అవకాశాలే ఉన్నాయని ఈల్డ్ మ్యాగ్జిమైజర్ వ్యవస్థాపకుడు యోగేష్ మెహతా పేర్కొన్నారు. వివిధ రంగాలపై ఆయన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ఆటోమొబైల్ రంగం రియల్ ఎస్టేట్ ప్రభుత్వరంగ సంస్థలు టెలికం
ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహన కంపెనీల స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవచ్చు. హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, మారుతి సుజుకీ, ఎస్కార్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా విలువ పరంగా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎస్కార్ట్స్, ఎంఅండ్ఎం, మారుతి ఆయా విభాగాల్లో అగ్రగామి కంపెనీలు. లార్జ్‌క్యాప్ రాబడుల పరంగా మంచి పనితీరు చూపించగలవు. మారుతి సుజుకీ రూ.7,000 సమీపంలో ఉంది. ఈ స్థాయి ఇక్కడి నుంచి పెరిగేందుకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మందగమనం బజాజ్ ఆటోలో కనిపించలేదు. ఈ కంపెనీ ఎక్కువగా ఎగుమతులపై దృష్టి పెట్టింది.
గోద్రేజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియాలిటీ, శోభ కంపెనీలు రుణ రహితమైనవి. అవసరమైతే నిధుల సమీకరణ, వృద్ధి అవకాశాలను సొంతం చేసుకునే అనుకూలతలు వాటికి ఉన్నాయి. సకాలంలో ప్రాజెక్టుల పూర్తి ద్వారా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పొందినవి. రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒబెరాయ్, శోభ, గోద్రేజ్ ప్రాపర్టీలకు పెట్టుబడుల కేటాయింపును పరిశీలించొచ్చు.
ప్రభుత్వరంగ సంస్థల్లో భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ ఎర్త్‌మూవర్స్ (బీఈఎంఎల్)ను పరిశీలించొచ్చు. ఇవి సరసమైన ధరల వద్ద ఉన్నాయి. బీపీసీఎల్‌లో వ్యూహాత్మక పెట్టబడుల ఉపసంహణ ఉన్నప్పటికీ, చాలా స్వల్ప కాలంలో రూ.350 నుంచి రూ.500 వరకు పెరిగింది. ఎబిట్డాతో ఏడు ఎనిమిది రెట్ల వద్ద ఉంది. కానీ, బీఈఎల్, బీఈఎంఎల్, కాంకర్లో ఎంతో విలువ దాగుంది. వచ్చే రెండేళ్లలో ఇవి గరిష్టాలకు వెళ్లొచ్చు.
ఇప్పటి వరకు ఈ రంగం అనిశ్చితిలో ఉంది. జియో ఇంటర్ కనెక్షన్ యూసేజీ చార్జీల పేరుతో నిమిషానికి 6 పైసలు వసూలు చేయనున్నట్టు ప్రకటించడం ఈ రంగంలోని కంపెనీల ఎబిట్డాను పెంచేదే. భారతీ ఎయిర్టెల్ బేస్ మరింత విస్తృతం కావడంతో అనుకూలతలు ఉన్నాయి. ఆఫ్రికా వ్యాపారం కూడా బ్రేక్ ఈవెన్‌కు వచ్చేసింది. రూ.380-390 స్థాయిలో భారతీ ఎయిర్టెల్ మంచి పెట్టుబడి అవకాశమే అవుతుంది. వచ్చే ఏడాది కాలంలో 15-20 శాతం పెరిగేందుకు అవకాశం ఉంది.
You may be interested
అంతా వాళ్లే చేశారు..!!
Thursday 17th October 2019మన్మోహన్, రాజన్ హయాంలోనే ప్రభుత్వరంగ బ్యాంకులకు దుర్గతి వాటిని బాగుచేయడమే నా ప్రాథమిక కర్తవ్యం కేంద్ర ఆర్థిక మంత్రినిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ హయాంలోనే ప్రభుత్వరంగ బ్యాంకులు దుర్భర పరిస్థితులను చవిచూశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. దెబ్బతిన్న ప్రభుత్వరంగ బ్యాంకులను బాగు చేయడమే తన ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్
పడిపోతున్నా కానీ ఈ స్టాక్స్‌లో ఫండ్స్ పెట్టుబడులు
Wednesday 16th October 2019పడిపోతున్న చాకును పట్టుకోవద్దన్న సూక్తి స్టాక్ మార్కెట్ అనలిస్టుల నుంచి వినిపిస్తుంటుంది. అయితే, ఈ సూత్రం అన్నింటికీ వర్తించదులేండి. ఎందుకంటే కొన్ని మంచి కంపెనీల షేర్లు కూడా తాత్కాలిక ప్రతికూలతల కారణంగా పడిపోతుంటాయి. అవి కొనుగోళ్లకు మంచి అవకాశాలుగానే చూడాలి. మ్యూచువల్ ఫండ్స్ కూడా మంచి పెట్టుబడి అవకాశాలుగా భావించి... గత ఏడాదిగా పడిపోతున్నప్పటికీ ఓ ఎనిమిది కంపెనీలలో క్రమంగా వాటాలు పెంచుకుంటూ వస్తున్నాయి. ఇలా మ్యూచువల్ ఫండ్స్ వాటాలు క్రమంగా