News


యూఎస్‌ఎల్‌, వొకార్డ్‌ జోరు- టొరంట్‌ బోర్లా

Tuesday 28th January 2020
Markets_main1580188745.png-31260

క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో లిక్కర్‌ దిగ్గజం యునైటెడ్‌ స్పిరిట్స్‌, ఫార్మా కంపెనీ వొకార్డ్‌ లిమిటెడ్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. మరోపక్క ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో హెల్త్‌కేర్‌ కంపెనీ టొరంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి యూఎస్‌ఎల్‌, వొకార్డ్‌ కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. టొరంట్‌ ఫార్మా నష్టాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం..

యూఎస్‌ఎల్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో యునైటెడ్‌ స్పిరిట్స్‌ లిమిటెడ్‌(యూఎస్‌ఎల్‌) రూ. 235 కోట్ల నికర లాభం ఆర్జించింది. వార్షిక ప్రాతిపదికన ఇది 15 శాతం వృద్ధికాగా.. నిర్వహణ లాభం సైతం 8 శాతం పుంజుకుని రూ. 314 కోట్లకు చేరింది. నికర అమ్మకాలు స్వల్పంగా 3 శాతం పెరిగి రూ. 2588 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో ఉదయం 10.30 ప్రాంతంలో యూఎస్‌ఎల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం జంప్‌చేసి రూ. 620 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 627 వరకూ ఎగసింది.

వొకార్డ్‌ లిమిటెడ్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో వొకార్డ్‌ లిమిటెడ్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. క్యూ3లో రూ. 19 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2018-19) క్యూ3లో రూ. 77 కోట్ల నికర నష్టం నమోదైంది. ఇందుకు వ్యయాల నియంత్రణ, మెరుగైన నిర్వహణ సహకరించినట్లు కంపెనీ తెలియజేసింది. అయితే మొత్తం ఆదాయం 15 శాతం క్షీణించి రూ. 869 కోట్లకు చేరింది. కంపెనీలో ప్రమోటర్లకు 72.40% వాటా ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 10.30 ప్రాంతంలో వొకార్డ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 369 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 373 వరకూ ఎగసింది. 

టొరంట్‌ ఫార్మాస్యూటికల్స్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో టొరంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ 2 శాతం తక్కువగా రూ. 251 కోట్ల నికర లాభం ఆర్జించింది. పన్నుకు ముందు లాభం మరింత అధికంగా 16 శాతం పుంజుకుని రూ. 319 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం నామమాత్రంగా క్షీణించి రూ. 1924 కోట్లకు పరిమితమైంది. అయితే వీటిలో దేశీ విక్రయాలు 5 శాతం పుంజుకుని రూ. 871 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో ఉదయం 10.30 ప్రాంతంలో టొరంట్‌ ఫార్మా షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం పతనమై రూ. 1925 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

3శాతం పతనమైన వేదాంత, సెయిల్‌

Tuesday 28th January 2020

చైనాలో మెటల్‌ ఉత్పత్తి తగ్గుముఖం పట్టవచ్చనే అందోళనలతో ప్రపంచ వ్యాప్తంగా మెటల్‌ ధరలు భారీగా దిగివస్తున్నాయి. మెటల్‌ ధరలు తగ్గముఖం పట్టడంతో అటు అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లోనూ మెటల్‌ షేర్ల భారీగా నష్టపోయతున్నాయి. ముఖ్యంగా స్టీల్‌ సంబంధింత షేర్లు ఎక్కువగా నష్టాలను చవిచూస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌ సెషనలో ఏకంగా 2శాతం నష్టాన్ని చవిచూసింది. ఉదయం గం.10:30ని.లకు

మెటల్‌ షేర్లకు కరోనా దెబ్బ!

Tuesday 28th January 2020

చైనాలో కొత్తగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా మెటల్‌ షేర్లు వణుకుతున్నాయి. చైనా ఎకానమీపై కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్న భయాలు మెటల్‌షేర్లపై ప్రతిబింబిస్తున్నాయి. చైనా ప్రపంచంలో అతిపెద్ద మెటల్‌ వినియోగదారు మరియు ఉత్పత్తిదారు. ప్రపంచ మెటల్‌ డిమాండ్‌, సప్లైలో దాదాపు సగం వాటా చైనాదే! అలాంటి చైనాలో ఇలాంటి అంటువ్యాధి ప్రబలడం వినిమయంపై ప్రభావం చూపుతున్న భయాలు పెరుగుతున్నాయి. దీంతో దేశీయంగా మెటల్‌ కంపెనీ షేర్లు

Most from this category